కార్ గ్లవ్ బాక్స్ వెనుక ఉన్న చరిత్ర ఏంటో మీకు తెలుసా?

ఎవరైనా కొత్తగా కారును కొనుగోలు చేసినప్పుడు, వారు సదరు కారులో ఉండే ఇంజన్, పనితీరు, మైలేజ్, డిజైన్ మరియు అందులో లభించే ఫీచర్ల గురించి అనేక విషయాలను పరిగణలోకి తీసుకుంటారు. అలాంటి కొన్ని ఫీచర్లలో ఒకటి 'గ్లవ్ బాక్స్'. అసలు ఈ గ్లవ్ బాక్స్ ఫీచర్ వెనుక ఉన్న చరిత్ర ఏంటో కథనంలో తెలుసుకుందాం రండి.

కార్ గ్లవ్ బాక్స్ వెనుక ఉన్న చరిత్ర ఏంటో మీకు తెలుసా?

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మోడ్రన్ కార్లలో గ్లవ్ బాక్స్ ఫీచర్ లభిస్తుంది. సాధారణంగా కారులో గ్లవ్ బాక్స్ అనేది డ్యాష్‌బోర్డులో కానీ లేందా సెంటర్ కన్సోల్‌లో కానీ ఉంటుంది. కొన్ని కార్లలో వెనుక వరుసలోని ప్యాసింజర్ల కోసం కూడా గ్లవ్ బాక్స్ ఫీచర్ అందుబాటులో ఉంది.

కార్ గ్లవ్ బాక్స్ వెనుక ఉన్న చరిత్ర ఏంటో మీకు తెలుసా?

కారులో అదనపు స్టోరేజ్ స్థలం అవసరమైనప్పుడు, ఈ గ్లవ్ బాక్స్ చక్కగా ఉపయోగపడుతుంది. కారు డ్యాష్‌బోర్డులో ఆఫర్ చేసిన గ్లవ్ బాక్స్‌లో కారుకి సంబంధించిన డాక్యుమెంట్లు, విలువైన వస్తువులను భద్రపరుచుకోవచ్చు. కొన్ని గ్లవ్ బాక్సులను తాళం చెవితో లాక్ చేసుకునే సౌకర్యం కూడా ఉంటుంది.

కార్ గ్లవ్ బాక్స్ వెనుక ఉన్న చరిత్ర ఏంటో మీకు తెలుసా?

మరికొన్ని కార్లలో కూల్డ్ గ్లవ్ బాక్స్ అనే ఫీచర్ కూడా ఉంటుంది. ఇలాంటి గ్లవ్ బాక్స్‌లలో చల్లటి ఆహారపదార్థాలు, కూల్‌డ్రింక్స్ వంటి వాటిని నిల్వ చేసుకోవచ్చు. అనేక రకాలుగా ఉపయోగపడే, ఈ గ్లవ్ బాక్స్‌కి చాలా పెద్ద చరిత్రే ఉంది.

కార్ గ్లవ్ బాక్స్ వెనుక ఉన్న చరిత్ర ఏంటో మీకు తెలుసా?

గ్లవ్ బాక్స్ చరిత్ర ఏంటి? దానికి ఆ పేరు ఎలా వచ్చింది?

గ్లవ్ బాక్స్ అనేది పేరుకు తగినట్లుగానే, చేతి తొడుగులు (హ్యాండ్ గ్లవ్స్) ఉంచుకునే ప్రదేశం. ఒకప్పుడు కార్లను నడిపే వ్యక్తులు తప్పనిసరిగా చేతి తొడుగులు ధరించి డ్రైవ్ చేసే వారు. సుమారు 17వ శతాబ్దం చివరిలో మరియు 18వ శతాబ్దం ప్రారంభంలో తయారైమ కార్లకు పైకప్పులు ఉండేది కాదు.

కార్ గ్లవ్ బాక్స్ వెనుక ఉన్న చరిత్ర ఏంటో మీకు తెలుసా?

ఆ కాలంలో రూపొందించబడిన కార్లకు పైకప్పు, కిటికీలు, ఎయిర్ కండిషనర్ లేదా హీటర్ వంటి ఫీచర్లు కూడా ఉండేవి కావు. దీంతో అప్పట్లో కారును నడపటం అంత సులువుగా ఉండేది కాదు. వివిధ రకాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాహనాన్ని నడపటం కాస్తంత కష్టంగానే ఉండేది.

కార్ గ్లవ్ బాక్స్ వెనుక ఉన్న చరిత్ర ఏంటో మీకు తెలుసా?

ప్రత్యేకించి చలి కాలంలో ఇలాంటి ఓపెన్ టాప్ వాహనాలను నడపటం చాలా సవాలుగా ఉండేది. ఈ పరిస్థితుల్లో వాహనాన్ని నడిపే డ్రైవర్లు చలిని నివారించడానికి చేతి తొడుగులను ఉపయోగించేవారు. అయితే, డ్రైవింగ్ పూర్తయిన తర్వాత ఈ చేతి తొడుగులను ఉంచడానికి, పొడిగా మరియు సురక్షితంగా ఉండే ఒక పెట్టె అవసరమయ్యేది.

కార్ గ్లవ్ బాక్స్ వెనుక ఉన్న చరిత్ర ఏంటో మీకు తెలుసా?

చేతి తొడుగులు తడిసిపోకుండా, పొడిగా ఉంచేందుకు మరియు అవసరమైనప్పుడు వాటిని తిరిగి ఉపయోగించేందుకు గానూ కార్లలో ఒక ప్రత్యేకమైన కంపార్ట్మెంట్ రూపొందించబడింది. ఈ కంపార్ట్‌మెంట్‌నే కాల్ క్రమంగా గ్లవ్ బాక్స్ అనే పేరుతో పిలవడం ప్రారంభించారు. ఈ రకంగా కార్లలో మొట్టమొదటి సారిగా గ్లవ్ బాక్స్ ఫీచర్ రూపొందించబడింది.

కార్ గ్లవ్ బాక్స్ వెనుక ఉన్న చరిత్ర ఏంటో మీకు తెలుసా?

20వ శతాబ్దంలో హీటెడ్ గ్లవ్ బాక్స్

సుమారు 20వ శతాబ్దంలో, వాహనాలను తయారు చేసే సంస్థలు తాపన వ్యవస్థను (హీటింగ్ సిస్టమ్‌ను) కలిగి గ్లవ్ బాక్స్‌లను ఉత్పత్తి చేయడంలో విజయవంతమయ్యారు. వీటి సాయంతో చేతి తొడుగులు ఎల్లప్పుడూ పొడిగా మరియు వేడిగా ఉండేవి. ఈ ట్రెండ్ సుమారు 1950-60 కాలం వరకు కొనసాగింది. ఆ తరువాత కార్ల తయారీదారులు పానీయాలను పెట్టుకోవటానికి వీలుగా ఇండెంట్లతో కూడిన గ్లవ్ బాక్సులను అందించడం ప్రారంభించారు.

కార్ గ్లవ్ బాక్స్ వెనుక ఉన్న చరిత్ర ఏంటో మీకు తెలుసా?

గ్లవ్ బాక్స్ రూపంతరాలు

గ్లవ్ ప్రధాన ఉద్దేశ్యం అప్పట్లో చేతి తొడుగులను (హ్యాండ్ గ్లవ్స్‌ను) భద్రపరచుకోవటమే. అయితే, ఆ తర్వాతి కాలంలో ఈ గ్లవ్ బాక్సులు అనేక రకాలుగా రూపాంతరం చెందాయి. ఇప్పుడు వాటిని అనంతమైన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. వీటి డిజైన్, ఆకారాల్లో కూడా పెను మార్పులు వచ్చాయి. ఇదీ గ్లవ్ బాక్స్ యొక్క చరిత్ర. మరి మీ కారులో కూడా గ్లవ్ బాక్స్ ఫీచర్ ఉందా? ఒకవేళ ఉంటే మీరు దానిని ఏ ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నారో మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Most Read Articles

English summary
The Rich History Behind The Car Glove Box That You Need To Know. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X