నేటి వీడియో: ట్రక్కుతో 360 డిగ్రీ బ్యారెల్ రోల్ స్టంట్

By Ravi

సాధారణంగా మోటార్‌సైకిళ్లపై స్టంట్‌లు చేసే వాళ్లు తమ బైక్‌తో గాలిలో పల్టీలు కొట్టడాన్ని మనం తరచూ చూస్తునే ఉంటాం. ఇలాంటి స్టంట్‌ల కోసం తేలికపాటి మోటార్‍‌సైకిళ్లను ఉపయోగించి సదరు స్టంట్ రైడర్లు తమ బైక్‌లో గాలిలో గుండ్రంగా కూడా తిరిగేస్తుంటారు. ఇది వారికి వెన్నతో పెట్టిన విధ్య. కానీ, ఇలా గాలిలో ఓ ట్రక్కుతో పల్టీలు కొట్టే స్టంట్‌ను మీరు ఎప్పుడైనా చూశారా..?

చూసి అవకాశమే లేదు. ఎందుకంటే ఇలాంటి ప్రమాదకర స్టంట్‌ను ఇప్పటి వరకు చేయలేదు కాబట్టి. కానీ 'వైల్డ్ మ్యాన్'గా పేరు తెచ్చుకొన్న బాజా 1000 రేసర్ అడ్రియన్ సెన్నీ మాత్రం ఈ ఫీట్‌ను చేసి చూపించాడు. ఓ తేలికపాటి ట్రక్కును గాలిలో 360 డిగ్రీలు (పూర్తి గుండ్రం)గా తిప్పి చూపరులను ఆకట్టుకున్నాడు. అంతేకాదు, ప్రపంచంలోనే ఈ తరహా స్టంట్ ఇదే మొట్టమొదటి కావటం విశేషం.

మెక్సికోలోని ఎన్సెనాడాలో ప్రారంభమైన 2013 బాజా ఆఫ్-రోడ్ రేసింగ్‌లో భాగంగా అడ్రియన్ సెన్నీ ఈ ఛాలెంజింగ్ స్టంట్‌ను చేసి చూపించాడు. '360 డిగ్రీ బ్యారెల్ రోల్'గా పిలిచే ఈ స్టంట్‌ కోసం ప్రత్యేకంగా ర్యాంప్‌ను తయారు చేశారు. ఈ ర్యాంప్‌లో మొదటి సెక్షన్ ట్రక్కును గాలిలో ఎగిరేలా, రెండవ సెక్షన్‌ను 360 డిగ్రీ బ్యారెల్ రోల్ చేసేలా డిజైన్ చేశారు. మరి ఈ వళ్లు గగుర్పొడిచే స్టంట్‌ను మనం కూడా క్రింది వీడియోలో చూద్దా రండి..!
<center><center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/jsrgeoa_70M?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center></center>

More from DriveSpark

Article Published On: Monday, November 18, 2013, 15:34 [IST]
English summary
Adrian Cenni, also known as The Wildman, performed the 360 degree barrel roll in front of a live crowd. While some are erroneously claiming this to be the first ever 360 degree barrel roll, it's actually not. It is, however, the first ever full barrel roll done with a truck.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+