వీడియో: ఫన్నీయెస్ట్ ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్
మోటారిస్టులలో చాలా మందికి మోటార్‌స్పోర్ట్స్‌లో పాల్గొనాలనే కోరిక ఉంటుంది. అయితే, ఇలాంటి మోటార్‌స్పోర్ట్స్ కార్యక్రమాలలోకి ప్రవేశించడం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. అందుకే, కొందరు ఔత్సాహికులు తమ ముచ్చటను ఇదిగో ఇలా తీర్చుకుంటున్నారు.
ఈ వీడియో చూడండి.. ఖరీదైన మోటార్‌స్పోర్ట్‌లో పాల్గొనలేని కొందరు తామే స్వయంగా ఓ మోటార్‌స్పోర్ట్‌ను తయారు చేసుకున్నారు. చిన్ని పిల్లల కోసం ఉపయోగించే మ్యాన్యువల్ రైడ్ఆన్స్ (చిన్నపాటి బొమ్మ కారు)తో అడవి లాంటి ప్రదేశంలో ఎత్తు నుంచి పల్లం వైపుకు దానిపై కూర్చొని క్రింది నెట్టుకుంటూ రావటం ఇందులో హైలైట్.
ఇది కూడా చూడండి: ఫోర్-వీల్ డ్రైవ్ వాహనంతో ట్రాఫిక్ జామ్ ను ఇలా దాటేయొచ్చు
పిల్లలు కూర్చోవాల్సిన బొమ్మ కార్లపై పెద్దవాళ్లు కూర్చొని రైడ్ చేయటం, ఆ ప్రక్రియలో వారు క్రింద పడుతూ లేస్తూ ముందుకు సాగిపోవటం కేవలం ఆడేవారికే కాకుండా చూసే వారికి కూడా చాలా సరదగా ఉంటుంది.
మనం కూడా ఆ సరదా వీడియో చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/R7yCCcVJE54?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








