ప్రపంచంలో కెల్లా అత్యంత ప్రమాదకరమైన రహదారి!
మన గమ్యానికి దారి చూపేవి రోడ్లు. ఇందులో కొన్ని సుందరమైన రోడ్లు ఉంటాయి, కొన్ని ప్రమాదకరమైన రోడ్లు ఉంటాయి. కానీ ఇలాంటి రెండు విభిన్నమైన లక్షణాలు కలిగిన రోడ్డు ఒకే చోట ఉండటం చాలా అరుదుగా ఉంటుంది.
ఇప్పుడు ఈ కథనంలో మనం అలాంటి ఓ రోడ్డు గురించే తెలుసుకోబోతున్నాం. ఇది ఆషామాషీ రోడ్డు కాదు. బహుశా ప్రపంచంలో కెల్లా అత్యంత ప్రమాదకరమైన రోడ్డంటే ఇదేనేమో. ఈ రోడ్డుపై తరచూ అనేక మంది అసువులు బాస్తుంటారు.
ఇది కూడా చూడండి: టైటానిక్ 2 షిప్ ఫొటోలు
అందుకే ఈ రోడ్డును 'ది డెత్ రోడ్' (మృత్యు రహదారి) అని పిలుస్తారు. ఈ రోడ్డు బోలివియాలో ఉంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ రోడ్డుపై ప్రతి ఏటా సగటును 200 నుంచి 300 మంది మరణిస్తుంటారు, అనేక వాహనాలు లోయలో పడిపోతుంటాయి.
ఈ ప్రమాదకరమైన రోడ్డును మనం కూడా చూసొద్దాం రండి.

డెత్ రోడ్‌గా పిలువబడే ఈ రోడ్డు మొత్తం పొడవు 43 మైళ్లు.

ఈ రోడ్డు నార్త్ఈస్ట్ లా పాజ్ నుంచి బోలివియాలోని యుంగాస్ రీజియన్‌లో ఉన్న కోరోయ్‌కో వరకు ఉంటుంది. మార్గ మధ్యంలో ఈ రోడ్డు ఆండెస్ పర్వతాలను చుట్టుకుంటూ క్రింది వైపుకు సాగిపోతుంది.

ఇదొక ప్రమాదకరమైన సింగిల్ లైన్ ఘాట్ రోడ్డు. సరిగ్గా ఒక్క వాహనం మాత్రమే పట్టేంత స్థలం ఉండే ఈ రోడ్డుపై ఇరు వైపుల నుంచి వాహనాలు వస్తూ/పోతూ ఉంటాయి.

ప్రతి పర్వతం వద్ద అనేక మలుపులు, వంపులతో కూడిన ఈ రోడ్డుపై ఎదురుగా ఏ వాహనం వస్తుందో చూడటం చాలా కష్టం.

చాలా మంది డ్రైవర్లు (ప్రయాణీకులు కూడా) రాత్రివేళ్లలో ఈ రోడ్డుపై ప్రయాణించేందుకు సిద్ధపడుతారు. ఎందుకంటే, ఆ సమయంలో ఎదురుగా వచ్చే వాహన లైట్లు ఆన్ చేసుకొని వస్తుంటుంది కాబట్టి, ఎదురుగా వచ్చే వాహనాన్ని గుర్తించడం కొంత వరకు సాధ్యమవుతుంది.

ఎదురుగా బస్సుల వంటి ఏవైనా పెద్ద వాహనాలను వస్తున్నాయని ముందుగా గుర్తిస్తే, ఎక్కడైనా రోడ్డు కాస్తంత వెడల్పుగా ఉన్నచోట తమ వాహనాలను నిలిపివేసి, భారీ వాహనాలకు దారి ఇస్తుంటారు. ఈ ప్రక్రియలో ఎవరైనా క్రింద పడితే నేరుగా పాతాళానికి పోవాల్సిందే.

ఈ డెత్ రోడ్ ఇప్పుడు ఓ టూరిస్ట్ ప్లేస్‌గా మారిపోయింది. దాదాపు 12 అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీలు లా పాజ్‌లో స్థావరాలను ఏర్పాటు చేసుకొని, డెత్ రోడ్ మౌంటైన్ బైకింగ్ ట్రిప్‌లను ఆఫర్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications








