ఈ విమానాల్లో ప్రయాణించాలంటే ఆస్తులు అమ్మినా సరిపోదు.. ఒక్కో టికెట్‌ ధర ఎంతో తెలుసా.??

మునుపటితో పోలిస్తే ఇప్పుడు విమాన ప్రయాణాలు చాలా సులభంగా మారాయి. విమానయాన సంస్థలు కూడా ఆఫర్లు ప్రకటిస్తూ తక్కువ టికెట్‌ ఛార్జీలతో ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. అయితే అంతర్జాతీయంగా కొన్ని విమానాల్లో ఫస్ట్ క్లాస్‌ టికెట్‌ ధరలు కూడా మీరు ఊహించని ధరలో ఉన్నాయని తెలుసా.. వాటి గురించే మీకు ఇక్కడ అందిస్తున్నాం.

ఎతిహాద్ ఎయిర్‌వేస్ A380(Etihad Airbus a380): ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ A380 ఫస్ట్ క్లాస్ టికెట్ ప్రపంచంలోనే అత్యధిక ధరకు విక్రయిస్తోంది. న్యూయార్క్ సిటీ, అబుదాబిలను కలిపే ఎతిహాద్ ఎయిర్ బస్ ఏ380 విమానం ఫస్ట్ క్లాస్ టికెట్ దాదాపు 66 వేల యూఎస్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. 54 లక్షల 98 వేల 773 రూపాయలు.

Most-Expensive-Flights

అయితే ఈ ఫస్ట్‌ క్లాస్‌ టికెట్‌ను ఎక్కువగా ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు వినియోగించుకుంటున్నారు. ఫస్ట్ క్లాస్ సీట్లు విమానం పై డెక్‌లో రిజర్వ్ అయి ఉంటాయి. విమానంలో ప్రతి ఫస్ట్ క్లాస్ క్యాబిన్ 430 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉంటుంది. ఇందులో పడక సౌకర్యం, లగ్జరీ సీటింగ్ సౌకర్యం వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఓ ప్రైవేట్‌ జెట్‌లో ప్రయాణిస్తున్న అనుభూతిని పొందవచ్చు.

ఎతిహాద్ ఎయిర్‌వేస్‌ a380 లోని ఫస్ట్‌ క్లాస్‌లో ప్రైవేట్ బాత్రూమ్ సదుపాయం కూడా ఉంది. న్యూయార్క్, అబుదాబి మధ్య సేవలందించే ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రయాణ సమయం 12 గంటల 30 నిమిషాలు. ఆ సమయంలో అత్యంత విలాసవంతమైన ప్రయాణ అనుభవంతో ప్రయాణించేందుకు సంపన్నులకు దోహదపడుతుంది.

Most-Expensive-Flights

ఎమిరేట్స్ A380(Emirates A380): ఎతిహాద్ ఎయిర్‌బస్ A380 తర్వాత ప్రపంచంలో అత్యధిక ఫ్లైట్‌ టికెట్‌ ఛార్జీలు వసూలు చేసేది ఎమిరేట్స్ A380. లాస్ ఏంజెల్స్ నుంచి దుబాయ్‌కి వెళ్లే ఈ విమానానికి ఫస్ట్ క్లాస్ టికెట్ ధర 31,000 డాలర్లు. అంటే భారత కరెన్సీలో అక్షరాలా రూ. 25 లక్షల 82 వేలు వసూలు చేస్తారు.

లాస్‌ ఏంజెల్స్‌ నుంచి దుబాయ్‌కి ఎమిరేట్స్‌ a380 ప్రయాణ సమయం 16 గంటలు. అంటే ఈ ఫ్లైట్‌లో ఒక్క నిమిషం ప్రయాణం చేయడానికి 32 అమెరికన్ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ విమానంలో ఫస్ట్‌ క్లాస్‌లో ప్రయాణించే వారికి స్పా సర్వీస్‌తో సహా సూపర్ లగ్జరీ సర్వీస్ అందిస్తారు. అంతేకాకుండా ప్రయాణికులకు ఖరీదైన సబ్బులు, క్రీములు అందిస్తారు. ఉల్లాసభరితంగా ఈ ఫ్లైట్‌లో లగ్జరీ జర్నీ చేయొచ్చు.

Most-Expensive-Flights

కొరియన్ A380 (Korean A380): న్యూయార్క్ నుంచి సియోల్‌కు సేవలందించే ఈ విమానం ఫస్ట్ క్లాస్ టికెట్‌పై వెళ్లాలంటే 28 వేల US డాలర్ల ఖర్చు చేయాల్సిందే. అంటే ఇండియన్‌ కరెన్సీలో రూ.23 లక్షలు. ఇది కొరియాలోని అతిపెద్ద వ్యాపారవేత్తల కోసం ప్రత్యేకంగా రూపొందించిన విమానయాన సంస్థ. ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌తో పాటు అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలు ఉన్నాయి.

వర్జిన్ అట్లాంటిక్ A330neo (Virgin Atlantic A330neo): ఈ ఎయిర్‌లైన్ లండన్ లాస్ ఏంజిల్స్ మార్గంలో సర్వీసులు అందిస్తుంది. ఈ ఫ్లైట్‌లో ఫస్ట్ క్లాస్ టికెట్‌ ధర దాదాపు 22 వేల అమెరికన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో రూ. 18 లక్షలు పైగానే ఉంటుంది.

Most-Expensive-Flights

A330 నియో ఒక మినీ ఫస్ట్ క్లాస్ ఎయిర్‌బస్.. కాగా దీన్ని చాలా విలాసవంతంగా రూపొందించారు. ఇందులో ఒకేసారి నలుగురు కూర్చుని భోజనం చేయవచ్చు. అంతే కాకుండా ఈ విమానంలో మరెన్నో విలాసవంతమైన సౌకర్యాలను కలిగి ఉంది. బడా వ్యాపారవేత్తలు, ప్రముఖులు ఎక్కువగా ఈ ఫస్ట్‌ క్లాస్‌లో ప్రయాణిస్తారు.

పైన పేర్కొన్న విమానాల్లో ఫస్ట్‌ క్లాస్‌ టికెట్‌ ధరలు చూస్తుంటే మతి పోవడం ఖాయం. అంత మొత్తం వార్షిక ఆదాయం కూడా భారత్‌లో చాలా మందికి లేదు. కానీ ఈ డబ్బును వారు కేవలం కొన్ని గంటల్లో ఖర్చు చేస్తూ లగ్జరీగా ప్రయాణిస్తున్నారు. ప్రయాణం కూడా ఇంత లగ్జరీగా ఉంటుందంటే ఎవరికైనా ఆశ్చర్యమే..

More from DriveSpark

Article Published On: Saturday, November 25, 2023, 16:55 [IST]
English summary
The most expensive first class flight tickets in the world here is the list
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+