విమాన వసతుల్ని తలదన్నే అత్యంత విలాసవంతమైన కారు

By Anil

మధ్య తరగతి ప్రజలు సాధారణ కారుతో సరిపెట్టుకుంటారు. కాని లగ్జరీ కే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించే వారు లగ్జరీ ఫీచర్లు ఉండే కార్లను ఎంచుకుంటారు. లగ్జరీ ఫీచర్లు అంటే అలాంటి ఇలాంటివి కాదు. ఏకంగా విమానంలోని విలాసవంతమైన ఫీచర్లను తలదన్నే స్థాయిలో ఉండే కార్లను ఎంచుకుంటారు.

ఇంతటి లగ్జరీ సౌకర్యాలతో ఏ కార్లు ఉన్నాయి అనేగా మీ డౌట్. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలాసవంతమైన మరియు సకల సౌకర్యాలు గల లిమోసిన్ వ్యాన్ కలదు. ఈ లిమోసిన్ వ్యాన్ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో ఉన్నాయి.

జర్మనీకు చెందిన సంస్థ

జర్మనీకు చెందిన సంస్థ

జర్మనీకు చెందిన కార్లను కస్టమైజ్ చేసే సంస్థ ఈ లిమోసిన్ లగ్జరీ వ్యాన్‌ను విడుదల చేసింది.

మోడల్

మోడల్

మెర్సిడెస్ బెంజ్ లిమోసిన్ లగ్జరీ క్లాస్ ఆధారంతో దీనిని రూపొందించింది.

ప్రత్యేకమైన ఫీచర్లు

ప్రత్యేకమైన ఫీచర్లు

ఇందులో ఉన్న ఏకైక ప్రత్యేక ఫీచర్ కారు బాడీ డిజైనింగ్. మీరు ఇలాంటి లగ్జరీ కారును కేవలం సినిమాలలో మాత్రమే చూసుంటారు. ఇండియన్ రోడ్ల మీద ఇవి అస్సలు కనబడవు. దీనిని తయారు చేసిన వారు ఇంటీరియర్ ఫీచర్ల రూపకల్పనను దృష్టిలో ఉంచుకుని దీని బాడీని డిజైన్ చేశారు.

అదనపు సమాచారం

అదనపు సమాచారం

విమానం లోపల ఉన్నటువంటి ఫీచర్లు ఉన్నాయి అని కథనం మధ్య భాగంలో తెలిపాము కదా. తరువాత స్లైడర్ల ద్వారా ఇంటీరియర్ ఫీచర్లు గురించి తెలుసుకోగలరు, మరిన్ని వివరాలకు స్లైడర్ల మీద క్లిక్ చేయండి.

వసతులు

వసతులు

వ్యాన్ యొక్క ఇంటీరియర్ స్పేస్‌ను పెంచడానికి దీని వీల్ బేస్‌ను మరింత పెంచారు. తద్వారా ఇందులోకి ప్రవేశించిన తరువాత మీరు ఒక గదిలోకి ప్రవేశించినట్లు ఉంటుంది.

సీట్లు

సీట్లు

ఎంతో విశాలంగా ఉండే ఇందులో చాలా వరకు సీటింగ్ సామర్థ్యం ఉంటుందని ఊహించవచ్చు. అయితే ఇందులో కేవలం నలుగురు మాత్రమే సౌకర్యవంతంగా కూర్చోవడానికి డిజైన్ చేశారు. అయితే ప్రతి సీటుకు కూడా రెండు చేతులను క్రిందకు చాచి విశ్రాంతి తీసుకోవచ్చు.

వినోద సౌకర్యం

వినోద సౌకర్యం

ఇందులో వినోదం కోసం అతి పెద్ద స్క్రీన్ ఉండే విధంగా టెలివిజన్ అందించారు.

లాకరు

లాకరు

ఇందులో ప్రయాణిస్తున్నప్పుడు అత్యంత విలువైన బంగారు ఆభరణాలు మరియు డబ్బును దాచుకోవడానికి వేలి ముద్రల ద్వారా వినియోగించోగలిగే లాకరు కలదు. దీనిని ఇందులో అన్ని సీట్లకు అందుబాటులో ఉండే విధంగా అమర్చారు.

టేబుళ్లు

టేబుళ్లు

అవసరాన్ని బట్టి వినియోగించుకునే ఫీచర్లను ఇందులో అందించారు. అందులో టేబుళ్లు. వీటిని సీట్లకు దగ్గరగా అవసరం ఉన్నప్పుడు వినియోగించుకోవచ్చు.

 విశాలమైన విండోలు

విశాలమైన విండోలు

ఈ లగ్జరీ వ్యానుకు చుట్టు ప్రక్కల విశాలమైన అద్దాలను అందించారు. వీటిని పరదాలతో కప్పి ఉంచారు.

మధ్యం కోసం ప్రత్యేక ప్రదేశం

మధ్యం కోసం ప్రత్యేక ప్రదేశం

ఇందులో మధ్య సేవించడానికి ఓ చిన్న సైజు బార్‌ను కూడా తెరిచారు. దీని కోసం ఫ్రిజ్ మరియు ప్రత్యేకంమైన మద్యం సేవించే గ్లాసులు కలవు.

చదునుగా ఉండే టైర్లతో

చదునుగా ఉండే టైర్లతో

ఈ వ్యాను ద్వారా సురక్షితంగా ప్రయాణించడానికి దీని కోసం చదునుగా ఉండేటటువంటి(ఫ్లాట్) టైర్లను వినియోగించారు.

టెంపర్వరీ ఆఫీస్

టెంపర్వరీ ఆఫీస్

ఇందులో మధ్య రకపు మీటింగ్‌లు నిర్వహించడానికి చిన్న సైజు ఆఫీస్ ఇందులో కల్పించారు, దీని కోసం ప్రత్యేకంగా ఇందులో ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అందించారు.

ట్యాబ్లెట్ ద్వారా కంట్రోల్

ట్యాబ్లెట్ ద్వారా కంట్రోల్

ఈ లగ్జరీ వ్యాను లోపల లైటింగ్ పెంచడం మరియు తగ్గించడం, సీట్ అడ్జెస్ట్‌మెంట్ వంటి వాటిని ట్యాబ్ ద్వారా నియంత్రించవచ్చు.

ఇంజన్

ఇంజన్

ఇందులో 3.5-లీటర్ కెపాసిటి గల ఆరు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు ఈ ఇంజన్‌కు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసందానం చేశారు. ఇది గరిష్టంగా గంటకు 217 కిలోమీటర్ల వేగంతో దూసుకెలుతుంది.

సీటింగ్ సామర్థ్యం

సీటింగ్ సామర్థ్యం

ఇందులో డ్రైవర్‌తో సహా మొత్తం ఆరు మంది వరకు ప్రయాణించవచ్చు.

బరువు

బరువు

ఈ లగ్జరీ లిమోసిన్ కారు యొక్క బరువు 3,050 కిలోలు కలదు. కస్టమైజ్ చేసి దీనిని మెటాలిక్ బ్లాక్ రంగులోకి మార్చారు.

ధర

ధర

ఇంత వరకు అంతా బాగానే ఉంది, మొత్తానికి దీని ధర ఎంత అనుకుంటున్నారు. ఎంతో మాకు కూడా తెలియదు ఎందు కంటే దీనిని కొనుగోలు చేసే వారికి మాత్రమే దీని ధరల వివరాలు వెల్లడిస్తారట.

విమాన వసతుల్ని తలదన్నే అత్యంత విలాసవంతమైన కారు
  • ఇది సల్మాన్ ఖాన్ కోసం తయారు చేసిన 'ఆల్ట్రా లగ్జరీ బస్'
  • తమషా రహదారి గుర్తులు: సృజనాత్మక ఇండియాలో ఇలాంటివి చూశారా..

Most Read Articles

English summary
The Most Luxurious Vip Limousin Van
Story first published: Friday, April 1, 2016, 17:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X