భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు ఇదే ట్రెండ్.. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్..

భారతదేశంలో కార్లు కాలంతో పాటే చాలా ఆధునికంగా మారాయి. ప్రస్తుతం, భారత ఆటోమోటివ్ మార్కెట్లో హాటెస్ట్ ట్రెండ్ అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS). అడాస్ గా ప్రాచుర్యం పొందిన ఈ డ్రైవర్ సహాయక వ్యవస్థ ఒకప్పుడు ఖరీదైన లగ్జరీ కార్లలో మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ, ఇప్పుడు ఇది మిడ్-సైజ్ కార్లలో కూడా అందుబాటులోకి వచ్చింది. మనదేశంలో అడాస్ ఫీచర్లను పరిచయం చేసిన మొట్టమొదటి కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్. ఎమ్‌జి విడుదల చేసిన గ్లోస్టర్ ఎస్‌యూవీలో కంపెనీ తొలిసారిగా ఈ టెక్నాలజీని పరిచయం చేసింది.

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు ఇదే ట్రెండ్.. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్..

ఆ తర్వాత అదే కంపెనీ విడుదల చేసిన చిన్న ఎస్‌యూవీ ఎమ్‌జి ఆస్టర్ లో కూడా ఈ టెక్నాలజీని అందించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తర్వాత మన దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా గతేడాది మార్కెట్లో విడుదల చేసిన ఎక్స్‌యూవీ700 ఎక్స్‌యూవీ ఇదే తరహా అడాస్ టెక్నాలజీని అందించింది. ఈ టెక్నాలజీకి తోడు దాని సరసమైన ధర కారణంగా మార్కెట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ700 హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. మరి అసలు ఇంతకీ అడాస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) అంటే ఏమిటి, ఇందులో ఏయే ఫీచర్లు ఉన్నాయో తెలుసుకుందాం రండి.

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు ఇదే ట్రెండ్.. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్..

సాధారణంగా కార్లలో క్రూయిజ్ కంట్రోల్ అనేది చాలా హైప్ చేయబడిన ఫీచర్. అయితే, ఈ ఫీచర్ చాలా వరకు భారతీయ డ్రైవింగ్ పరిస్థితులకు సరిపోదు. క్రూయిజ్ కంట్రోల్‌ని యాక్టివేట్ చేయడం ద్వారా డ్రైవర్ నుండి ఎలాంటి యాక్సిలరేటర్ ఇన్‌పుట్ లేకుండానే కారును నిర్ధిష్ట వేగంతో ఆటోమేటిక్ గా నడిచేలా చేయవచ్చు. దీని వలన దూర ప్రయాణాలు చేసేటప్పుడు అలసట తగ్గుతుంది. అయితే, సాధారణ క్రూయిజ్ కంట్రోల్ విషయంలో డ్రైవర్ బ్రేక్ పెడల్‌ని ఉపయోగించి కారుని వేగాన్ని తగ్గించడానికి లేదా ఆపడానికి ప్రయత్నిస్తే, ఈ సిస్టమ్ డియాక్టివేట్ అవుతుంది.

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు ఇదే ట్రెండ్.. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్..

అంటే, రద్దీగా ఉండే భారతీయ రహదారులపై క్రూయిజ్ కంట్రోల్‌ని ఉపయోగించడం అనేది ఒక ఛాలెంజ్ అనే చెప్పొచ్చు. ప్రతిసారి బ్రేక్ నొక్కుతూ, క్రూయిజ్ కంట్రోల్ ని డీయాక్టివేట్ చేసుకుంటూ తిరిగి యాక్టివేట్ చేసుకుంటా నడపడానికి బదులు సాధారణంగా యాక్సిలరేటర్ ఇచ్చుకుంటూ నడుపుకొని వెళ్లిపోవచ్చు. అయితే, ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు అడాస్ లో ఓ అధునాతన ఫీచర్ ఉంటుంది. అదే అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, మరి ఇదెలా పనిచేస్తుందో తెలుసుకుందాం రండి.

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు ఇదే ట్రెండ్.. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్..

అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్

అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ అనేది సాధారణ క్రూయిజ్ కంట్రోల్ మాదిరిగానే పనిచేస్తుంది, కాకపోతే ఇందులో కొన్ని రకాల స్మార్ట్ సెన్సార్లు ఉంటాయి. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ కలిగిన వాహనం డ్రైవర్ నుండి ఎటువంటి బ్రేకింగ్ సహాయం లేకుండానే ముందు ఉన్న వాహనం యొక్క వేగాన్ని ఆటోమేటిక్‌గా గుర్తించి కారు యొక్క వేగాన్ని తగ్గించడం లేదా ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేక్ ని అప్లయ్ చేయడం చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే, ఈ ఫీచర్ కలిగిన కారులో డ్రైవర్ కేవలం స్టీరింగ్ ని మాత్రమే కంట్రోల్ చేస్తే సరిపోతుందన్నమాట. యాక్సిలరేటర్ మరియు బ్రేక్ లను కారు ఆటోమేటిక్ గా అదే కంట్రోల్ చేసుకుంటుంది.

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు ఇదే ట్రెండ్.. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్..

అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ లో డ్రైవర్ నిర్ధిష్టమైన వేగం వద్ద క్రూయిజ్ కంట్రోల్ ని సెట్ చేసిన తర్వాత, సదరు వాహనం దానికి ముందు ఉన్న వాహనం యొక్క వేగానికి అనుగుణంగా నడుస్తుంది. ఒకవేళ ముందుగా వెళ్తున్న వాహనం నెమ్మదిగా కదులుతున్నట్లయితే, మన కారు కూడా నెమ్మదిగా వెళ్తుంది. అదే, ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత ముందు ఎలాంటి వాహనాలు లేకున్నా లేదా ముందున్న వాహనాలు మన వాహనం కన్నా వెగంగా వెళ్తున్నా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ సెట్ చేసిన కారు డ్రైవర్ సెట్ చేసిన నిర్ణీత వేగ పరిమితికి చేరుకుని ప్రయాణిస్తుంది.

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు ఇదే ట్రెండ్.. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్..

లేన్-కీప్ అసిస్ట్ ఫీచర్

అడాస్‌లో మరొక అద్భుతమైన ఫీచర్ లేన్-కీప్ అసిస్ట్. పేరు సూచించినట్లుగానే ఇది కారును నిర్ధిష్టమైన లైనులో మాత్రమే ప్రయాణించేలా చేస్తుంది. ఇది సాధారణ సిటీ రోడ్లపై అంతగా పనిచేయనప్పటికీ, నిర్ధిష్టమైన లైన్స్ కలిగిన జాతీయ రహదారుల్లో మాత్రం చక్కగానే పనిచేస్తుంది. ఈ ఫీచర్ కలిగిన ఉన్న కారు, స్టీరింగ్ కంట్రోల్ ను కొన్ని సెకన్ల పాటు దాని అదీనంలోకి తీసుకుంటుంది అకస్మాత్తుగా డ్రైవర్ లైన్ మారుతున్నట్లయితే, స్టీరింగ్ ఆటోమేటిక్‌గా గుర్తించి డ్రైవర్ ను హెచ్చరిస్తుంది. లేన్-కీప్ అసిస్ట్ ఫీచర్ లేన్‌లను పర్యవేక్షించడానికి మరియు స్టీరింగ్‌ను నియంత్రించడం ద్వారా వాహనాన్ని ఆ లేన్‌లో ఉంచడానికి ఫార్వర్డ్-ఫేసింగ్ కెమెరాను ఉపయోగిస్తుంది.

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు ఇదే ట్రెండ్.. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్..

వోల్వో వంటి ఖరీదైన వాహనాలే కాకుండా, ఎమ్‌జి గ్లోస్టర్ వంటి ప్రీమియం కార్లలో కూడా ఇలాంటి అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) పీచర్లు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే, ఎమ్‌జి గ్లోస్టర్ లో మాత్రం కొన్ని భద్రతా కారణంగా దృష్ట్యా లేన్-కీపింగ్ అసిస్ట్ ఫీచర్‌ను అందించడం లేదు. ఎమ్‌జి గ్లోస్టర్ యొక్క 2 వీల్ డ్రైవ్ వేరియంట్ 160 bhp పవర్ మరియు 375 Nm టార్క్‌ ను జనరేట్ చేసే 2.0 లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. కాగా, ఇందులోని 4 వీల్ డ్రైవ్ వేరియంట్ 180 bhp పవర్ మరియు 480 Nm టార్క్ ను జరేట్ చేసే మరింత శక్తివంతమైన ట్విన్-టర్బో ఇంజన్ తో లభిస్తుంది.

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు ఇదే ట్రెండ్.. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్..

బడ్జెట్ ధరలో ఇలాంటి ఫీచర్లను కలిగిన కారు కావాలనుకుంటే, మహీంద్రా ఎక్స్‌యూవీ700 అందుబాటులో ఉంటుంది. ఈ ఫుల్ సైజ్ ఎస్‌యూవీ ఒక పెట్రోల్ ఇంజన్ మరియు రెండు డీజిల్ ఇంజన్ల ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులోని పెట్రోల్ ఇంజన్ 197 bhp పవర్ ను మరియు 380 Nm టార్క్‌ ను జనరేట్ చేసే 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ 4-సిలిండర్ ఇంజన్ కాగా, మిగిలిన రెండు డీజిల్ ఇంజన్లు 2.2-లీటర్ యూనిట్లు.

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు ఇదే ట్రెండ్.. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్..

వీటిలో ఒకటి మరింత శక్తివంతమైన వెర్షన్, ఇది 182 bhp పవర్ మరియు 450 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. కాగా, ఇందులోని బేస్ వెర్షన్ 153 bhp పవర్ మరియు 360 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇక ఎమ్‌జి ఆస్టర్ కూడా భారతదేశంలో ADASతో లభిస్తున్న అత్యంత సరసమైన ఎస్‌యూవీ. ఈ 5-సీటర్ కూడా రెండు ఇంజన్ ఆప్షన్లలో అందించబడింది. ఇందులోని బేస్ ఇంజన్ 108.5 bhp పవర్ మరియు 144 Nm టార్క్‌ను జనరేట్ చేసే 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఇకపోతే రెండవది 138 bhp పవర్ మరియు 220 Nm టార్క్‌ను జనరేట్ చేసే మరింత స్పోర్టియర్ 1.3-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్.

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు ఇదే ట్రెండ్.. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్..

ఇవే కాకుండా, జపనీస్ కార్ బ్రాండ్ సుజుకి అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న సరికొత్త ఎస్-క్రాస్‌ కూడా ఈ తరహా ఫీచర్లతో లభిస్తుంది. గ్లోబల్ మార్కెట్లలో, కొత్త ఎస్-క్రాస్ అడాస్ మరియు సుజుకి యొక్క ప్రసిద్ధ ఆల్-గ్రిప్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో లభిస్తుంది. మనదేశంలో కూడా మారుతి సుజుకి ఎస్-క్రాస్ క్రాసోవర్ ను విక్రయిస్తుంద్, అయితే, ఇక్కడి మార్కెట్లో మాత్రం ఎందుకు ఈ ఫీచర్ ను అందించడం లేదో తెలియదు. బహుశా తయారీ ఖర్చును దృష్టిలో ఉంచుకొని ఈ ఫీచర్ ను అందించడం లేదేమో.

Most Read Articles

English summary
The new automobile tech trend in india adaptive cruise control and adas details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X