Maruti Suzuki కార్లకు ఎందుకు అంత డిమాండ్? అసలు ఈ బ్రాండ్ ప్రత్యేకలు ఏంటి?

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) దేశాయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ బ్రాండ్లలో ఒకటి. గడచి రెండు దశాబ్ధాలకు పైగా మారుతి సుజుకి ఇండియా దేశీయ విపణిలో అగ్రగామిగా కొనసాగుతోంది. ఇందుకు ప్రధాన కారణం, ఈ బ్రాండ్ పట్ల భారత కస్టమర్లలో ఉన్న విశ్వసనీయతే అని చెప్పొచ్చు.

Maruti Suzuki కార్లకు ఎందుకు అంత డిమాండ్? అసలు ఈ బ్రాండ్ ప్రత్యేకలు ఏంటి?

మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గా దేశంలో కార్ల వ్యాపారం ప్రారంభించి, జపాన్‌కి చెందిన సుజుకి చేరికతో 'మారుతి సుజుకి'గా మారి దేశంలోనే అతిపెద్ద కార్ కంపెనీగా ఈ సంస్థ అవతరించింది. ఈ సంస్థ నుండి కార్లను కొనుగోలు చేసిన వారిలో లక్షలాధి మంది సంతృప్తికర వినియోగదారులు ఉన్నారు. జెన్, ఆల్టో, స్విఫ్ట్ మరియు ఎస్టీమ్ వంటి కార్లతో భారతీయుల హృదయాలను జయించిన మారుతి సుజుకి బ్రాండ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

Maruti Suzuki కార్లకు ఎందుకు అంత డిమాండ్? అసలు ఈ బ్రాండ్ ప్రత్యేకలు ఏంటి?

మారుతి సుజుకి కార్లు ధరకు తగిన విలువను కలిగి ఉంటాయి..

భారతదేశంలో మారుతి సుజుకి బ్రాండ్ విజయవంతం కావడానికి ఇదే అతిపెద్ద కారణం. మారుతి 800 లాంచ్ అయినప్పటి నుండి, మారుతి సుజుకి తమ కార్ల ధరలను చాలా చాకచక్యంగా నిర్ణయిస్తూ వచ్చింది. ఈ సంస్థ నుండి లభించే కార్లు మార్కెట్లోని ఇతర బ్రాండ్ కార్ల కంటే సరసమైనవిగా ఉండి, ధరకు తగిన విలువను ఆఫర్ చేసేలా ఉంటాయి. మధ్యతరగతి ప్రజల కారు కలను నిజం చేయడంలో ఈ బ్రాండ్ విజయవంతమైందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

Maruti Suzuki కార్లకు ఎందుకు అంత డిమాండ్? అసలు ఈ బ్రాండ్ ప్రత్యేకలు ఏంటి?

మారుతి సుజుకి కార్లు మెరుగైన మైలేజీని అందిస్తాయి..

మారుతి సుజుకి కార్లు సక్సెస్ కావడానికి మరొక కారణంగా, అవి అందించే మైలేజ్ గురించి చెప్పుకోవచ్చు. చిన్నపాటి ఇంజన్లను మరియు మెరుగైన సాంకేతికతను ఉపయోగించడం ద్వారా కంపెనీ తమ కార్ల మైలేజ్ ని పెంచింది. ఇటీవలి కాలంలో మారుతి సుజుకి తమ కార్లలో స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ సిస్టమ్ (SHVS) వంటి సాంకేతికతలను చేర్చడంతో, మైలేజ్ సంఖ్య బాగా పెరుగుతోంది. మారుతి ఎస్-క్రాస్, విటారా బ్రెజ్జా మరియు సియాజ్ వంటి పెద్ద కార్లలో కూడా మైలేజ్ గణాంకాలు అద్భుతంగా ఉంటాయి.

Maruti Suzuki కార్లకు ఎందుకు అంత డిమాండ్? అసలు ఈ బ్రాండ్ ప్రత్యేకలు ఏంటి?

మారుతి సుజుకి కార్లపై కస్టమర్ల నుండి ధృడమైన విశ్వసనీయత..

మారుతి సుజుకి బ్రాండ్ పట్ల మరియు ఈ సంస్థ అందించే కార్ల పట్ల భారతీయ కస్టమర్లలో ధృడమైన విశ్వసనీయత ఉంది. భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎన్ని ఆటు పోట్లు వచ్చినా స్థిరమైన బ్రాండ్‌గా కొనసాగుతూ, దేశంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం కస్టమర్లకు అందుబాటులో ఉండే బ్రాండ్ ఇది. మారుతి సుజుకి అందించే కార్లను చక్కగా ఏళ్లతరబడి ఉపయోగించినా ఉపయోగించినా అవి ఎప్పటిలాగే సజావుగా నడుస్తుండటాన్ని మనం చూస్తూనే ఉంటాం.

Maruti Suzuki కార్లకు ఎందుకు అంత డిమాండ్? అసలు ఈ బ్రాండ్ ప్రత్యేకలు ఏంటి?

వినియోగదారుని సంతృప్తే మారుతి సుజుకి ప్రధాన లక్ష్యం..

మారతి సుజుకి తమ కస్టమర్లను చాలా ఆరోగ్యకరంగా ట్రీట్ చేస్తుంది. కస్టమర్ షోరూమ్ లోకి ప్రవేశించినప్పటి నుండి కారు కొనుగోలు చేసి డెలివరీ తీసుకునేంత వరకు మరియు ఆ తర్వాత కూడా ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ సేవలను అందించే విషయంలో ఈ బ్రాండ్ ఇబ్బందులు లేని అనుభవాన్ని అందించడానికి కృషి చేస్తుంది. ఇందుకోసం మారుతి సుజుకి తమ డీలర్లు మరియు ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తుంది.

Maruti Suzuki కార్లకు ఎందుకు అంత డిమాండ్? అసలు ఈ బ్రాండ్ ప్రత్యేకలు ఏంటి?

మారుతి సుజుకి అంటే విస్తృతమైన సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్..

మార్కెట్లో ఏ బ్రాండ్ అయినా విజయవంతంగా తన వ్యాపారాన్ని కొనసాగించాలంటే, అది విస్తృతమైన సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్‌ను కలిగి ఉండటం ఎంతో అవసరం. ఈ విషయంలో మారుతి సుజుకి ఇతర కార్ బ్రాండ్ల కన్నా ఎన్నో రెట్లు ముందంజలో ఉంటుంది. భారతదేశ వ్యాప్తంగా మారుతి సుజుకి అమ్మకాలు మరియు సేవల నెట్‌వర్క్‌ని కలిగి ఉంది. గ్రామాల నుంచి పట్టణాల వరకూ ఈ నెట్‌వర్క్ విస్తరించి ఉంటుంది.

Maruti Suzuki కార్లకు ఎందుకు అంత డిమాండ్? అసలు ఈ బ్రాండ్ ప్రత్యేకలు ఏంటి?

మారుతి సుజుకి కార్లకు బెటర్ రీసేల్ వ్యాల్యూ..

సరసమైన ధరకే కొత్త కార్లను విక్రయించే మారుతి సుజుకి, రీసేల్ వ్యాల్యూ విషయంలో కూడా శభాష్ అనిపించుకుంటుంది. మార్కెట్లో సెకండ్ హ్యాండ్ మారుతి సుజుకి కార్లను కొనాలంటే, కస్టమర్లు అధిక ధరను చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రధాన కారణం వాటికి ఉన్న రీసేల్ విలువే. అందుకే, సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్‌లో కూడా అత్యంత ప్రాచుర్యం పొందాయి. విశ్వసనీయత మరియు ఇంధన సామర్థ్యం (మైలేజ్) వంటి అంశాల వలన మారుతి సుజుకి కార్లకు ఉత్తమ రీసేల్ విలువ ఉంటుంది.

Maruti Suzuki కార్లకు ఎందుకు అంత డిమాండ్? అసలు ఈ బ్రాండ్ ప్రత్యేకలు ఏంటి?

అత్యధికంగా సిఎన్‌జి కార్లను అందించే ఏకైక సంస్థ మారుతి సుజుకి..

బిఎస్6 ఉద్గార నిబంధనల తర్వాత మారుతి సుజుకి డీజిల్ కార్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసి, కేవలం పెట్రోల్ కార్లను మాత్రమే విక్రయిస్తోంది. అయితే, ఎక్కువ మైలేజ్‌ని ఆశించే కస్టమర్ల కోసం కంపెనీ కొన్ని ఎంపిక చేసిన మోడళ్లలో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌లను కూడా అందిస్తోంది. కమర్షియల్ క్యాబ్ మార్కెట్లో సెలెరియో, వ్యాగన్ఆర్, డిజైర్ మరియు ఎర్టిగా వంటి మోడళ్లకు ఎక్కువ ప్రాచుర్యం లభించడంతో, కంపెనీ వీటిలో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్ ఆప్షన్‌ను అందించింది. మొత్తంగా చూస్తే, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులు మరియు సేవలను అందించడం కోసం మారుతి సుజుకి నిరంతరం కృషి చేస్తూనే ఉందని చెప్పవచ్చు.

Most Read Articles

English summary
The reasons behind maruti suzuki success some special and unique things of this car brand
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X