24 ఏళ్లకే ముగ్గురు పిల్లల తల్లి.. 3 కోట్ల కారులో దిగిన ఈ అప్సరసను చూడండి
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల చూస్తే జాలేస్తుందని ఆమె అభిమానులు అంటున్నారు. కారణం టాలీవుడ్ లో ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా సక్సెస్ అనే పదం చేతివరకు వచ్చి చేజారిపోతుంది. తన కెరీర్లో ధమాకా తర్వాత హిట్ సినిమానే లేదు. ఆ సినిమా తర్వాత శ్రీలీల ఒకటా రెండా పొలోమని పలు సినిమాలు చేసింది. కానీ ఏ ఒక్కటి శ్రీలీల కెరీర్‌కు ఉపయోగపడే హిట్ పడలేదు.
మహేశ్ సరసన గుంటూరు కారం సినిమా మీద హోప్స్ పెట్టుకుంది కానీ అది నిరాశపరిచింది. ఇప్పుడు మాస్ జాతర కూడా శ్రీలీలను బాగా ఊరించింది. ఆ సినిమాలో మాస్ పాత్రలో చాలా కష్టపడింది. ఎలాగైనా హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని శ్రీలీల చాలా తాపత్రయపడింది. డాన్స్ లు, లుక్స్ విషయంలో శ్రీలీల బాగుంది. ఆమె పాత్రకు న్యాయం చేసింది. కానీ మాస్ జాతర టాక్ ఆమెను మళ్లీ ఇబ్బందిపెట్టేసింది. దీంతో శ్రీలీలకి కష్టాలు మళ్లీ కంటిన్యూ అయ్యాయి.

ఇటీవల శ్రీలీల ఒక ఈవెంట్‌కు హాజరయ్యేందుకు చీరలో రూ. 3 కోట్లు విలువ చేసే రేంజ్ రోవర్ లగ్జరీ ఎస్‌యూవీలో దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే కేవలం గ్లామర్ కోసమే కాకుండా, 24 ఏళ్ల వయసులోనే ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుని తన మానవత్వాన్ని చాటుకుంది.
బ్రిటీష్ లగ్జరీ వాహన తయారీ సంస్థకు చెందిన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ HSE లాంగ్-వీల్‌బేస్ మోడల్‌లో ఆమె ఆ ఈవెంటుకు వచ్చింది. భారతదేశంలో ఈ ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.3.11 కోట్ల వరకు ఉంటుంది. ఈ కారులో 3.0 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ డీజిల్ ఇంజన్ ఉంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించబడి 351 బీహెచ్‌పీ పవర్, 700 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ ఫోర్-వీల్ డ్రైవ్ ఎస్‌యూవీ కేవలం 5.9 సెకన్లలో 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు.

కోట్లు విలువ చేసే ఈ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ మోడల్‌లో అత్యంత విలాసవంతమైన ఫీచర్లు ఉన్నాయి. సిగ్నేచర్ డీఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్, 22-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ దీని లుక్‌ని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి.
కారు లోపల 13 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మసాజ్ సీట్లు (కూల్డ్, హీటెడ్ సౌకర్యంతో), ఆటోమాన్ సౌకర్యంతో కూడిన వెనుక సీట్లు, వెనుక ప్రయాణీకుల కోసం ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌లు, 24-వైపులా అడ్జస్ట్ చేయగల ఎలక్ట్రిక్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

కేవలం నటిగానే కాకుండా శ్రీలీల ఒక అద్భుతమైన మానవతావాదిగా కూడా గుర్తింపు పొందింది. ఆమె కేవలం 24 ఏళ్ల వయసులోనే ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుంది. మొదట ఇద్దరు దివ్యాంగులైన పిల్లలను దత్తత తీసుకుని వార్తల్లో నిలిచిన ఆమె, ఆ తరువాత మరో బిడ్డను కూడా చేర్చుకుంది. ఈ రోజుల్లో ప్రచారం కోసం మంచి పనులు చేసే వారికి కాకుండా, నిశ్శబ్దంగా మానవ సేవ చేస్తున్న శ్రీలీలను చూసి నేర్చుకోవాలని చాలా మంది ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications








