టేకాఫ్‌, ల్యాండింగ్ సమయంలో విమానం ఎంత స్పీడ్‌తో ప్రయాణిస్తుందో మీకు తెలుసా??.. ఇంట్రెస్టింగ్ విషయాలివే.!!

విమానయాన పరిశ్రమలో వేగం అనేది చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే.. ఎయిర్‌క్రాఫ్ట్ డైనమిక్స్‌కు వేగం వెన్నెముకగా భావిస్తారు. అయితే విమానం ఎత్తుగా ఎగరాలంటే వేగం చాలా ప్రధానమైనది. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సురక్షితంగా ఎగరడానికి లేదా ల్యాండ్ కావడానికి వేగం కీలకం.. స్పీడ్‌ను సరిగ్గా మెయింటైన్‌ చేయకపోతే.. ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంది.

ఒకప్పుడు విమానం(Aeroplane)లో ప్రయాణించాలంటే ధనికులకే సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు మధ్యతరగతి ప్రజలతో పాటు సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చింది. తక్కువ ఛార్జీలతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుతున్నారు. డొమెస్టిక్‌ విమానాల పుణ్యమా అని పొరుగు రాష్ట్రాలతో పాటు పక్క జిల్లాలకు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నాం.

Aeroplane-Speed-Landing-Takeoff

అయితే విమాన(Aircraft Landing And Takeoff) ప్రయాణంలో ముఖ్యంగా ల్యాండిగ్‌, టేకాఫ్‌ విషయంలో వేగం అనేది చాలా ముఖ్యం. అందుకే స్పీడ్‌ను విమాన డైనమిక్స్‌కు వెన్నెముకగా పేర్కొంటారు.. కాగా విమానం వేగాన్ని ఎనిమోమీటర్ ద్వారా కొలుస్తారు. దీంతో పైలట్లు విమానాన్ని టేకాఫ్ ఇంకా ల్యాండింగ్‌ చేస్తారు. కాగా విమాన వేగాన్ని రెండు విధాలుగా కొలుస్తారు. అవి NOTS మరియు MAC నంబర్.

వాణిజ్య రవాణా విమానం యొక్క వేగాన్ని మాక్ నంబర్ పరంగా పేర్కొంటారు. సాధారణంగా ప్రతి వాణిజ్య విమానం మాక్ 0.77 వేగంతో పనిచేస్తుందట. మ్యాక్‌(Mac) అంటే కిలోమీటర్లలో గంటకు దాదాపు 860 కి.మీ వేగంతో ప్రయాణించడం. ఈ వేగంతో వాణిజ్య విమానాలు ఆకాశంలో ఎగురుతూ ప్రయాణిస్తాయి. ఈ వేగంతో ప్రయాణించడం ద్వారా మాత్రమే సరైన సమయంలో విమానం ఇంధన పొదుపు మరియు గమ్యాన్ని చేరుకోవడానికి వీలవుతుంది.

Aeroplane-Speed-Landing-Takeoff

కాగా ప్రపంచంలో రెండు విమానయాన(Aircraft Speed Limits) సంస్థలు మాత్రమే అత్యంత వేగవంతమైన వాణిజ్య విమానాలుగా పేరుగాంచాయి. అవి ఎయిర్‌బస్ A330 నియో మరియు బోయింగ్ B788. ఇవి మెరుపు వేగాన్ని మించి ఎక్కువ వేగంతో ఆకాశంలో ప్రయాణిస్తాయట. ఈ రెండు విమానాలు వరుసగా దాదాపు గంటకు 1,061 కి.మీ మరియు 1,051 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి.

అయితే విమానం టేకాఫ్‌ అయిన తర్వాత ఒక నిర్దిష్ట వేగాన్ని చేరుకున్నప్పుడు మాత్రమే ఎగరడానికి అనుమతి లభిస్తుంది. అది ఆ వేగాన్ని చేరుకోలేకపోతే.. పైలట్‌లు మళ్లీ సర్కిల్‌కు ప్రయత్నించి, ఆపై మళ్లీ టేకాఫ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ విధంగా టేకాఫ్‌ అయ్యాక విమానం గంటకు 250 కి.మీ లేదా 300 కి.మీ వేగాన్ని తప్పనిసరిగా చేరుకోవాల్సి ఉంటుంది.

Aeroplane-Speed-Landing-Takeoff

ఈ వేగాన్ని చేరుకున్నప్పుడు మాత్రమే పైలట్లు విమానాన్ని నడిపిస్తూ నిర్దిష్ట సమయం మెయింటైన్‌ చేయగలరు. అదేవిధంగా, విమానం ల్యాండింగ్‌కు కూడా నిర్దిష్ట వేగం తప్పనిసరిగా ఉండాలి. మిడ్‌ ఎయిర్‌లో, హై-స్పీడ్‌లో విమానం భూమిని తాకడానికి ముందు వేగం 240 కి.మీ లేదా 250 కి.మీకు తగ్గించబడుతుంది.

అయితే ఇక్కడ ఇంకొకటి గుర్తుంచుకోవాలి. ఇంత కంటే ఎక్కువ లేదా తక్కువ వేగంతో విమానాన్ని నడిపితే, విమానం ల్యాండింగ్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. తద్వారా ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే విమానం టేకాఫ్‌ మరియు ల్యాండింగ్‌ సమయంలో నిర్దిష్ట వేగాన్ని పాటిస్తారు.

ఇక్కడ మీకొక సందేహం రావచ్చు. విమానాలకు వేగ నియంత్రణ ఉంటుందా అని.. అవును ఉంది. వాహనాలకు వేగ పరిమితులు ఉన్నట్లే, కొన్ని కారణాల వల్ల విమానాలకు వేగ పరిమితులు విధిస్తారు. అదే సమయంలో, వాణిజ్య వాహనం గరిష్ఠంగా మ్యాక్(Mac) 0.77 వేగంతో ప్రయాణించేలా రూపొందించారు.

More from DriveSpark

Article Published On: Wednesday, January 31, 2024, 9:13 [IST]
English summary
The speed of an aircraft while takeoff and landing interesting details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+