అతి ఇరుకైన ప్రదేశంలో కారుతో 360 డిగ్రీ స్పిన్ టర్న్
కారును 360 డిగ్రీలో స్పిన్ చేయటం అంటే ఎవ్వరికైనా సరదాగానే ఉంటుంది. బహుశా మీలో కొంతమంది విశాలమైన ప్రదేశంలో ఇలాంటి ప్రయత్నం చేసి ఉండొచ్చు కూడా..! కానీ కేవలం 2.50 మీటర్ల గ్యాప్‌లో కారును 360 డిగ్రీల కోణంలో స్పిన్ (అంత కొద్ది స్థంలో కారును పూర్తిగా ఒక రౌండు చుట్టడం) చేయటం సాధ్యమవుతుందా..? అసాధ్యం అంటారా..!
కానీ దీనిని సుసాధ్యం చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం ద్కించుకున్నాడు ఈ జర్మనీ బుల్లోడు. జర్మనీకి చెందిన స్టంట్ డ్రైవర్ రోనీ వుచెసెల్‌బర్జర్ (అలియాస్ 'రోని సి రాక్') ఈ అరుదైన ఫీట్‌ను చేశాడు. ఫోక్స్‌వ్యాగన్ బీటెల్ కారుతో కేవలం 2.50 మీటర్ల (8 అడుగుల 2.42 ఇంచ్‌ల) స్థలంలో 360 డిగ్రీ స్పిన్ టర్న్ చేసి ఔరా అనిపించుకున్నాడు రోనీ.
రెండు పొడవాటి ట్రక్కులను వాటి మధ్యలో 2.50 మీటర్ల ఖాలీ ఉండేలా పార్క్ చేశారు. ఆ ఖాలీ స్థలంలోనే కారును 360 డిగ్రీ స్పిన్ టర్న్ చేయాలి. ఇందులో ఏ మాత్రం అజాగ్రత్త వహించినా కారు ఏదో ఒకవైపు ట్రక్కులకు గుద్దుకోవటం ఖాయం. మరి ఈ అద్భుతమైన గిన్నిస్ బుక్ రికార్డు ఫీట్‌ను మనం కూడా ఈ వీడియోలో వీక్షిద్దాం రండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/9Y7KiaKl_IQ?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








