'టైటానిక్ 2' లగ్జరీ షిప్: ఫొటోలు, వివరాలు
'టైటానిక్' ఒకప్పుడు ప్రపంచంలో కెల్లా అతిపెద్దదైన మరియు అత్యంత విలాసవంతమైన ఓడ (షిప్) ఇది. తొలి ప్రయాణంలోనే సముద్ర గర్భంలో కలిసిపోయిన ఈ షిప్, సముద్రంలో మునిగిపోయిన ఈ ఏడాదితో సరిగ్గా 101 ఏళ్లు పూర్తి కానున్నాయి.
దాదాపు శతాబ్ధానికి పైగా సముద్ర భూభాగంలో విశ్రాంతి తీసుకుంటున్న ఈ టైటానిక్‌కు తిరిగి జీవం రానుంది. అయితే, ఈ పాత షిప్‌కు మరమ్మత్తు చేయటం సాధ్యం కాదు కాబట్టి, అచ్చం టైటానిక్‌ను పోలి ఉండేలా మరో టైటానిక్ షిప్‌ను తయారు చేయనున్నారు.
మొదటి టైటానిక్ షిప్‌కు రెప్లికా (కాపీ/ప్రతిభింభం)గా వస్తున్న ఈ రెండవ టైటానిక్ షిప్‌కు 'టైటానిక్ 2' (Titanic II) అనే పేరును పెట్టనున్నారు. కోట్ల రూపాయల సంపధకు అధిపతి అయిన ఆస్ట్రేలియన్ మైనింగ్ దిగ్గజం క్లైవ్ పామర్ తమ కంపెనీ 'బ్లూ స్టార్ లైన్' తరఫున ఈ టైటానిక్ 2 షిప్‌ను తయారు చేయిస్తున్నాడు.
టైటానిక్ 2 షిప్‌కు సంబంధించిన మరిన్ని ఆసక్తికర అంశాలను, ఫొటోలను పరిశీలిద్దాం రండి..!

ఆస్ట్రేలియన్ బిలీనియర్ క్లైవ్ పామర్ తయారు చేయించనున్న ఈ టైటానిక్ 2 షిప్ కోసం ఇప్పటికే బ్లూ ప్రింట్ కూడా సిద్ధమైంది.

అచ్చుగుద్దినట్లు ఒరిజినల్ టైటానిక్‌ను పోలి ఉండేలా ఈ టైటానిక్ 2 షిప్‌ను తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

రానున్న 2016వ సంవత్సరం నాటికి టైటానిక్ 2 షిప్ నిర్మాణం పూర్తవుతుందని అంచనా. అదే సంవత్సరంలోనే ఈ షిప్ తొలి ప్రయాణం మొదలు కానుంది.

2600 మంది ప్రయాణీకులు, 900 మంది క్రూ సిబ్బందితో టైటానిక్ 2 షిప్ తొలిసారిగా ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ నుంచి న్యూయార్క్‌కు ప్రయాణం కానున్నట్లు సమాచారం.

ఒరిజిల్ టైటానిక్ షిప్‌లో తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని, ఈ టైటానిక్ 2ను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, అత్యంత సురక్షితాపరమైన అంశాలతో తయారు చేయనున్నారు.

అత్యవర సమయాల్లో షిప్‌లోని ప్రయాణీకులందరినీ రక్షించేందుకు వీలుగా ఇందులో తగినన్ని లైఫ్ బోట్లను ఏర్పాటు చేయనున్నారు.

ఒరిజినల్ టైటానిక్ థీమ్‌కు మ్యాచ్ అయ్యే విధంగా, ఈ టైటానిక్ 2 షిప్‌లో ప్రయాణించే ప్యాసింజర్లకు అలనాటి (1920 కాలంలో) ప్రయాణీకులు ధరించిన స్టయిల్‌లో ఉండే దుస్తులను కూడా ఆఫర్ చేయనున్నారట.

ఈ సరికొత్త టైటానిక్ 2 షిప్‌లో ఇంటర్నెట్, టెలివిజన్ మొదలైన అధునాత సదుపాయాలను కూడా కల్పించనున్నారు.

టైటానిక్ 2 షిప్ చూడటానికి పురాతన క్లాసిక్ డిజైన్‌ను కలిగి ఉండి, నేటి ఆధునిక ప్రయాణీకులకు సైతం వింటేజ్ ఫీల్‌ను కలిగించేలా ఉన్నప్పటికీ, ఇందులో సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ వంటి మోడ్రన్ అంశాలు ఉండనున్నాయి.

ఈ టైటానిక్ 2 షిప్‌లో ప్రయాణం కోసం టికెట్ ధరను ఇంకా వెల్లడించకపోయినప్పటికీ, ఇది ఒక్కో వ్యక్తికి 1 మిలియన్ డాలర్లు ఉండొచ్చని అంచనా.

థర్డ్ క్లాస్ డైనింగ్ రూమ్.

ఫస్ట్ క్లాస్ డైనింగ్ రూమ్.

స్విమ్మింగ్ పూల్.

స్క్వాష్ కోర్ట్ (ఇండోర్ గేమ్స్ కోసం)

గ్రాండ్ స్టెయిర్ కేస్ డోమ్

జిమ్ (వ్యాయామం కోసం)

లిఫ్ట్ (ఎలివేటర్స్)


Click it and Unblock the Notifications








