ప్రపంచంలోనే అతిపెద్ద డీజిల్ ఇంజన్ 'వార్సిలా సుల్జర్'

World's Largest Diesel Engine
ప్రంపంచంలోనే అతిపెద్ద డీజిల్ ఇంజన్‌ను ఎప్పుడైనా చూశారా..? పక్కన ఉన్న ఫోటోలో 68 చక్రాలు కలిగిన ఓ పొడవాటి లారీపై వెళ్తున్న ఈ భారీ ఇంజన్‌ను గమనించారా..! ఇదే ప్రపంచంలోనే అతిపెద్ద డీజిల్ ఇంజన్. దీనిపేరు 'వార్సిలా సుల్జర్'. ఇది విడుదల చేసే శక్తి ఎంతో తెలుసా.. 1,09,000 బిహెచ్‌పి (బ్రేక్ హార్స్ పవర్) మరియు 76,03,850 ఎన్ఎమ్ (న్యూటన్ మీటర్స్) @ 2012 ఆర్‌పిఎమ్ (రొటేషన్ పెర్ మినిట్).

మరి ఈ ఇంజన్‌ను ఎక్కడ ఉపయోగిస్తారనే కదా మీ సందేహం. దాదాపు రెండు ఫుట్‌బాల్ గ్రౌండ్స్ అంత పెద్దిదిగా ఉండే ఓడ (షిప్)ల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. ఈ ఇంజన్ ద్వారా సముద్రంపై ఓడ గంటకు 60 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. నావీ స్టాండర్డ్స్ ప్రకారం నీటిపై ఇది అత్యంత వేగం.

ఈ ఇంజన్ ఎత్తు 44 అడుగులు మరియు పొడవు 90 అడుగులు. దాదాపు నాలుగు అంతస్థుల పొడవు ఉన్న ఈ ఇంజన్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ షిప్ అయిన 'ఎమ్మా మాఎర్స్క్' తయారీలో ఉపయోగించారు. ఈ షిప్ పొడవు 337 మీటర్లు.ఈ ఇంజన్‌కు దాహం కూడా ఎక్కువే.. ప్రతి సెకనుకు ఇది సుమారు 3.80 లీటర్ల డీజిల్‌ను తాగేస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, July 29, 2011, 11:27 [IST]
English summary
This is the world’s largest diesel engine Wärtsilä-Sulzer. Which produces 1,09,000 bhp power and 76,03,850 nm torque 102 rpm. It propels ships which are twice the size of a football ground.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+