కారు మూరెడు పేరు బారెడు..: వేలానికి అత్యంత పురాతన కారు

సరే ఇదంతా అటుంచితే, పక్క చిత్రంలో ఉన్న పురాతన కారు (వింటేజ్ కార్)కు కూడా ఓ ప్రత్యేకత ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన కారు. 127 ఏళ్ల క్రితం ఈ కారును రూపొందించారు. 1884వ సంవత్సరానికి చెందిన ఈ కారు పేరు "డి డియాన్ ఎట్ ట్రెపార్‌డౌక్స్ డాస్-ఏ-డాస్ స్టీమ్ రన్అబౌట్". చాశారా.. కారు మూరెడే.. కానీ పేరు మాత్రం బారెడు.
అంతేకాదండోయ్.. ఈ కారు ఇప్పటికీ రన్నింగ్ కండిషన్‌లోనే ఉంది. ప్రపంచపు తొలి ఆటోమొబైల్ రేసులో కూడా ఇది పాల్గొని విజేతగా నిలిచింది. దీన్ని ముద్దుగా 'లా మార్క్వైజ్'గా పిలుస్తారు. తొమ్మిది అడుగులు మాత్రమే పొడవు ఉండే ఈ కారులో రెండు స్టీమ్ ఇంజన్లు ఉంటాయి. బొగ్గుతో నడిచే రైళ్లు గుర్తున్నాయి. ఇది కూడా అదే కాన్సెప్ట్ ఆధారంగా పనిచేస్తుంది.
ఇందులో నలుగురు ప్రయాణికులు ప్రయాణించవచ్చు. స్టీల్ ట్యాంక్‌పై భాగంలో సీటు ఉంటుంది. ఈ స్టీల్ ట్యాంకులో 40 గ్యాలెన్ల నీటిని నింపుతారు. ఈ నీటి సాయంతో 20 మైళ్ల దూరం ప్రయాణించవచ్చు. ఇది గరిష్టంగా గంటకు 37 మైళ్ల వేగంతో పరుగులు తీస్తుంది. బొగ్గు మండించడం ద్వారా ఉత్పత్తి అయ్యే నీటి ఆవిరితో ఇంజన్ పనిచేసి పరుగులు తీయడం ప్రారంభిస్తుంది.
ఆటోమొబైల్ చరిత్రలోనే అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ కారను అక్టోబర్ 6న వేలం వేయనున్నారు. ఆర్ఎమ్ ఆక్షన్ నిర్వహిస్తున్న వేలంలో ఈ కారు 2 మిలియన్ డాలర్ల పలుకవచ్చని అంచనా వేస్తుంది.


Click it and Unblock the Notifications








