ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే ట్రక్
ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు పెట్టే కారు అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది 'బుగాటి వేరాన్'. అయితే, ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు పెట్టే ట్రక్కు గురించి మీకు తెలుసా..?
బుగాటి వేరాన్ గరిష్ట వేగాన్ని (408.47 కెఎమ్‌పిహెచ్) మించి పరుగులు తీసే ట్రక్కు పేరు 'షాక్‌వేవ్' (Shockwave). మూడు గిగాంటిక్ జెట్ ఇంజన్లతో తయారు చేయబడిన ఈ ట్రక్కు గరిష్ట వేగం గంటకు 643.7 కిలోమీటర్లు.
కెనడాలోని ఆంటారిలో జరిగిన ఓ కార్ షోలో ఈ ట్రక్కు దర్శనమిచ్చింది. పసుపు రంగులో మూడు టన్నల బరువుండే ఈ చెవీ ట్రక్కుకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అంశాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

షాక్‌వేవ్ ట్రక్కును 1984లో లెస్ షాక్లే తయారు చేశాడు. ఇది జపాన్ బుల్లెట్ ట్రైన్ వేగంతో సమానంగా పరుగులు తీయగలదు. ప్రస్తుతం ఈ ట్రక్కు వయస్సు 30 ఏళ్లు.

అమెరికన్ నావీ ట్రైనింగ్ జెట్లలో ఉపయోగించే మూడు ప్రాట్ అండ్ విట్నే జె34-48 జెట్ ఇంజన్లను ఇందులో ఉపయోగించారు. ప్రస్తుతం ఈ ట్రక్కుకు నియల్ డార్నెల్ యజమాని. ఈ ట్రక్కును నడిపేది కూడా అతనే.

షాక్‌వేవ్ ట్రక్కులో ఉపయోగించిన మూడు జెట్ ఇంజన్ల సాయంతో ఇది కేవలం 6.5 సెకండ్ల వ్యవధిలోనే 36,000 హార్స్‌పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేయటం సాధ్యమవుతుంది.

ఇందులో 190 గ్యాలన్ల ఇంధనం స్టోర్ చేసుకోవచ్చు. ప్రతి పెర్ఫామెన్స్‌కు 180 గ్యాలెన్ల ఇంధనం ఖర్చు అవుతుంది.

షాక్‌వేవ్ ట్రక్కు గరిష్ట వేగం గంటకు 400 మైళ్లు. అంటే గంటకు 643.7 కిలోమీటర్లు.
వీడియో
షాక్‌వేవ్ ట్రక్కు పెర్ఫార్మెన్స్‌ను ఈ వీడియోలో వీక్షించండి.


Click it and Unblock the Notifications








