ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంతో పరుగులు తీసే బస్సు

By Ravi

సాధారణంగా బస్సు ఎంత వేగంతో వెళ్తుంది..? గంటకు 60 కి.మీ.? 100 కి.మీ.? 120 కి.మీ.? ఇంత వరకూ ఓకే కానీ, గరిష్టంగా గంటకు 250 కి.మీ. వేగంతో పరుగులు పెట్టే బస్సును ఎప్పుడైనా చూశారా..? ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న బస్సును చూడండి. ఇది 'సూపర్ ఫాస్ట్ సూపర్ బస్'. ముందు వైపు నుంచి సూపర్ కారులా కనిపించే ఈ సూపర్ బస్సు గరిష్టం వేగం గంటకు 250 కిలోమీటర్లు. ఇది కేవలం వేగవంతమైన కారు మాత్రమే కాదండోయ్, విలాసవంతమైన కారు కూడా. ఈ సూపర్ బస్సులో 23 మందికి చోటు ఉంటుంది.

మరి ఇంత గరిష్ట వేగంతో వెళ్తోంది కదా.. ఈ బస్సులో ఉపయోగించే ఇంధనం ఏంటా అనుకుంటున్నారా..? ఖచ్చితంగా పెట్రోల్, డీజిల్ అయితే మాత్రం కాదు. అవును ఇది పూర్తిగా బ్యాటరీ పవర్‌తో నడుస్తుంది. ఈ బస్సులో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్లు ఇది లిథియం అయాన్ బ్యాటరీలతో పనిచేస్తాయి. ఈ బ్యాటరీలు వాహనం పైభాగంలో అమర్చిన సోలార్ ప్యానెల్స్ ద్వారా రీఛార్జ్ అవుతాయి. బస్సు బరువు తేలికగా ఉంచేందుకు గాను దీని ఛాస్సిస్‌ను తక్కువ బరువు కలిగిన కార్బన్ ఫైబర్‌తో తయారు చేశారు.

15 మీటర్ల పొడవు ఉండే ఈ సూపర్ బస్సుకు ముందువైపు రెండు చక్రాలు వెనుకపై నాలుగు చక్రాలు మొత్తం ఆరు చక్రాలు మాత్రమే ఉంటాయి. ముందువైపున్న రెండు చక్రాలు స్వతంత్రంగా విడివిడిగా తిరుగుతాయి. దీని వల్ల బస్ టర్నింగ్ రేడియస్‌ను తగ్గించేందుకు వీలవుతుంది. ఈ సూపర్ ఫాస్ట్ సూపర్ బస్సుకు మొత్తం 16 గల్-వింగ్ డోర్లు (పైవైపుకు తెరుచుకునేవి) ఉంటాయి. యూ డెల్ఫ్ట్ యూనివర్సిటీ బృందం ఈ కారును అభివృద్ధి చేసింది. ఈ బృందంలో మాజీ డచ్ వ్యోమగామి వుబ్బో ఓక్లెస్ కూడా ఉన్నారు.

సూపర్‌ఫాస్ట్ సూపర్‌బస్

సూపర్‌ఫాస్ట్ సూపర్‌బస్

సూపర్‌ఫాస్ట్ సూపర్‌బస్

సూపర్‌ఫాస్ట్ సూపర్‌బస్

సూపర్‌ఫాస్ట్ సూపర్‌బస్

సూపర్‌ఫాస్ట్ సూపర్‌బస్

సూపర్‌ఫాస్ట్ సూపర్‌బస్

సూపర్‌ఫాస్ట్ సూపర్‌బస్

సూపర్‌ఫాస్ట్ సూపర్‌బస్

సూపర్‌ఫాస్ట్ సూపర్‌బస్

సూపర్‌ఫాస్ట్ సూపర్‌బస్

సూపర్‌ఫాస్ట్ సూపర్‌బస్

సూపర్‌ఫాస్ట్ సూపర్‌బస్

సూపర్‌ఫాస్ట్ సూపర్‌బస్

సూపర్‌ఫాస్ట్ సూపర్‌బస్

సూపర్‌ఫాస్ట్ సూపర్‌బస్

సూపర్‌ఫాస్ట్ సూపర్‌బస్

సూపర్‌ఫాస్ట్ సూపర్‌బస్

సూపర్‌ఫాస్ట్ సూపర్‌బస్

సూపర్‌ఫాస్ట్ సూపర్‌బస్

సూపర్‌ఫాస్ట్ సూపర్‌బస్

సూపర్‌ఫాస్ట్ సూపర్‌బస్

సూపర్‌ఫాస్ట్ సూపర్‌బస్

సూపర్‌ఫాస్ట్ సూపర్‌బస్


గత 2011 సంవత్సరంలో ఈ వాహనాన్ని దుబాయ్‌లో జరిగిన ఓ వాణిజ్య ప్రదర్శన షోలో ప్రదర్శనకు ఉంచారు. ప్రస్తుతం ఈ సూపర్ బస్సు అధికారికంగా సాధారణ రోడ్లపై తిరిగేందుకు నెథర్లాండ్స్ ప్రభుత్వం అనుమతి తెలిపింది. గతంలో నెంబర్ ప్లేట్ కూడా లేని ఈ సూపర్ బస్సుకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా లభించింది. గల్ఫ్ నగరాల్లో ఈ బస్సు కోసం ప్రత్యేకంగా నిర్మించిన 'ఫాస్ట్ లేన్'లో ఇది సంచరించనుంది. దుబాయ్ నుంచి అబుదాబికు ఇది ప్రయాణం చేయనుంది. ఈ రెండు నగరాలకు మధ్య దూరం 120 కిలోమీటర్లు. ఈ సూపర్ ఫాస్ట్ సూపర్ బస్సులో ఈ దూరాన్ని కేవలం 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, January 21, 2013, 16:29 [IST]
English summary
How fast can a bus go? 60Kmph? 100Kmph? 120Kmph? No, the answer is an incredible 250kmph! The bus, aptly named as the Super Bus can reach a top speed of 250kmph without breaking a sweat. It not only offers speed but also luxury too. 23 passengers can travel in the Super Bus amidst ample luxury and comfort.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+