రోడ్డుపై మరియు నీటిపై ప్రయాణించే బస్సు
లండన్, టోక్యో, ముంబై, న్యూయార్క్ వంటి నగరాల్లో నీటిదారులు ఎక్కువగా మనకు కనిపిస్తుంటాయి. ప్రజలు తమ రోజూవారీ ప్రయాణాల కోసం నీటిపై మైళ్ల దూరం ప్రయాణిస్తుంటారు, ఇందుకోసం వాళ్లు ఓడలు, పడవలు, బోట్లు వంటి వివిధ ప్రత్యామ్నాయాలపై ఆధారపడుతుంటారు. అయితే, మాములుగా రోడ్లపై నుంచి ప్రయాణించే బస్సునే నీటిపై కూడా నడుపుకుంటూ పోతే ఎలా ఉంటుంది. ఇది పగటి కల ఏ మాత్రం కాదండోయ్. ఇదిగో ఈ ఫొటోల్లో కనిపిస్తున్న బస్సును చూడండి.
ఈ ఆంఫిబియస్ బస్సు రోడ్డుపై అలాగే నీటిపై కూడా ప్రయాణించగలదు. దక్షిణాధి యూరోపియన్ దేశమైన మాల్టాలో ఈ ఆంఫికోచ్‌ను తయారు చేశారు. స్కాట్‌మ్యాన్ జార్జ్ స్మిత్ ఈ ప్రాజెక్టుకు ఫండింగ్ చేశారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఆంఫికోచ్ కమ్యూటర్ బస్సు. ఇందులో 50 మంది ప్రయాణికులకు చోటు ఉంటుంది. ఈ ఆంఫికోచ్‌ను బస్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని నిర్మించారు. దీని అడుగు భాగం బోటు ఆకారంలో ఉండి, నీటిపై తేలియాడేందుకు సహకరిస్తుంది.
ఆంఫికోచ్ సాధారణ బస్సు మాదిరిగానే రోడ్డుపై ప్రయాణిస్తుంది. ఇది నీటిపై ప్రవేశించినప్పుడు గంటకు 8 నాట్‌ల వేగంతో పరుగులు తీస్తుంది. రెన్‌ఫ్ర్యూ యొక్క స్కాటిష్ నగరాలు మరియు యోకర్‌కు మధ్యలో ఉన్న 500 ఏళ్ల పురాతన బోటు సర్వీస్‌ను రీప్లేస్ చేసేందుకు ఆంఫికోచ్‌ను తొలుత నిర్మించారు. ప్రస్తుతం ఇది ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య పరంగా విక్రయానికి అందుబాటులో ఉంది. న్యూయార్క్‌లో హడ్‌సన్ రివర్‌పై సేవలను కూడా అందిస్తోంది.

ఆంఫిబియస్ బస్సు

ఆంఫిబియస్ బస్సు

ఆంఫిబియస్ బస్సు

ఆంఫిబియస్ బస్సు

ఆంఫిబియస్ బస్సు

ఆంఫిబియస్ బస్సు

ఆంఫిబియస్ బస్సు

ఆంఫిబియస్ బస్సు

ఆంఫిబియస్ బస్సు

ఆంఫిబియస్ బస్సు

ఆంఫిబియస్ బస్సు

ఆంఫిబియస్ బస్సు

ఆంఫిబియస్ బస్సు

ఆంఫిబియస్ బస్సు

ఆంఫిబియస్ బస్సు



Click it and Unblock the Notifications








