ప్రపంచపు అతి పెద్ద విమానం, ఉక్రెయిన్ నుండి ఆస్ట్రేలియాకు చారిత్రక ప్రయాణం
ప్రపంచపు అతి పెద్ద సరుకు రవాణా విమానం త్వరలో ఇతిహాసక యాత్ర చేపట్టనుంది. పేద్ద అనే పదానికి సరితూగని భారీ విమానం, భారీ బరువుతో భారీ దూరం పాటు ప్రయాణాన్ని మొదలు పెట్టనుంది. ప్రపంచంలోనే అతి పెద్ద విమానంగా పేరుగాంచిన ఆంటనోవ్ ఏఎమ్-225 అనే విమానం అతి త్వరలో ఉక్రెయిన్ నుండి ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఇంత దూరం పాటు ప్రయాణిస్తున్న మొదటి విమానం, మొదటి యాత్రం కూడా ఇదే. అంతే కాదండోయ్ దీని ప్రయాణ మార్గంలో ఇది మన హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమివ్వనుంది. దీని గురించి చదివే కొద్ది ఆశ్చర్యంగా ఉంది. మరిన్ని వివరాలు క్రింది కథనంలో ఉన్నాయి ఓ లుక్కేసుకోండి.

ఉక్రెయిన్ ఆధారిత సంస్థ తయారు చేసిన ప్రపంచపు అతి పెద్ద కార్గో (సరుకు రవాణా) విమానం ఆంటనోవ్ ఏఎన్-225 ఉక్రెయన్ నుండి ఆస్ట్రేలియా ప్రయాణానికి సిద్దం అయ్యింది.

ఇది ఆస్ట్రేలియాలోని మైనింగ్ సంస్థ కోసం అతి పెద్ద, భారీ బరువున్న విద్యుత్ జనరేటర్ యంత్రాన్ని మోసుకెళ్లనుంది.

ఈ జనరేటర్ బరువు సుమారుగా 117 టన్నులు పైమాటే. మరియు ఉక్రెయిన్ నుండి ఆస్ట్రేలియాకు అంటే అత్యంత దూరం పాటు అత్యధిక బరువును మోసుకెళుతోందన్నమాట.

అన్ని రికార్డులను ఒకే సారి నెలకొల్పనుంది ఈ ఆంటనోవ్ ఏఎన్-225 విమానం. ఎందుకంటే అంతటి గరిష్ట బరువుతో భారీ దూరాన్ని చేధించిని విమానాల విభాగాన్ని దీని ప్రయాణంతో సృష్టించనుంది.

చారిత్రక ఘట్టాన్ని లిఖించనున్న ఈ ప్రయాణం ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని పెర్త్ అంతర్జాతీయ విమానాశ్రయం విభాగానికి చెందిన విమాన ప్రియులు ఎంతో అసక్తితో ఉన్నారు. వారి మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా దీని గురించి తెలుసుకున్న వారు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద విమానం ఒకే సారి బ్రిటీష్‌కు చెందిన 10 యుద్ద ట్యాంకుల బరువుకు సరిమానమైన బరువును మోయగలదు.

ఆకారం పరంగా చూస్తే బోయింగ్ బి-747 విమానం రెక్కల యొక్క విస్తీర్ణం కన్నా రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది.

1980 ల కాలం నాటి ఇమ్మెన్స్ ఆంటనోవ్ ఏఎన్-225 మ్రియా కార్గో విమానాన్ని తన 42 చక్రాల ద్వారా నింగికేగి వివిధ స్టాపుల మీదుగా ఆస్టేలియాలోని పెర్త్‌కు చేరుకోనుంది.

మధ్య యూరప్ నుండి ప్రారంభం కానున్న దీని ప్రయాణంలో పరాగ్వే, టర్క్‌మెన్‌బాషి, హైదరాబాద్ మరియు జకార్తా మీదుగా ఆస్ట్రేలియాలోని పెర్త్‌ను చేరుకోనుంది.

దీని ప్రయాణ మార్గంలో నాలుగు ప్రదేశాలలో ఆపడానికి కారణం, ఎక్కువ బరువును మోసుకెళుతున్నందున ఇంధనాన్ని నింపుకోవడానికి దీనిని ఈ ఎయిర్ పోర్ట్‌ల మీదుగా నడపనున్నారు.

117 టన్నుల బరువున్న ఈ విద్యుత్ జనరేటర్‌ను సెజాక్ రిపబ్లిక్ నుండి పశ్ఛిమ ఆస్ట్రేలియాలోని అల్యూమినియం మైనింగ్ సంస్థకు చేర్చనుంది.

అల్యూమినియం మైనింగే కేంద్రంలో ఉన్న భారీ డ్రిల్లింగ్ మరియు ఎస్కవేటింగ్ యంత్రాలకు విద్యుత్‌ను అందివ్వడానికి ఈ జనరేటర్‌ను వినియోగించనున్నారు. మైనింగ్ రంగంలో ఆటోమొబైల్ పాత్ర (మైనింగ్‌లో వినియోగించే అత్భతమైన ఆటోమొబైల్ వాహనాలు)

ఇది సుమారుగా 84 మీటర్ల పొడవుతో 88 మీటర్ల పొడవైన రెక్కలను కలిగి ఉంది. ఇది సుమారుగా రెండు ఫుట్ బాల్ స్టేడియంలకు సమానంగా ఉంటుంది.

ఈ విమానం ఎటువంటి స్టాపింగులు లేకుండా ఉక్రెయిన్ నుండి పెర్త్‌కు వెళ్లడానికి సుమారుగా 18 గంటల సమయం తీసుకుంటుంది.

ఆంటనోవ్ ఏఎన్-225 విమానం సోవియట్ కు చెందిన బురాన్ స్పేస్ షటిల్‌ను మోసుకెళుతున్నప్పటి చిత్రం.

సుమారుగా రెండు శతాబ్ధాల తరాల వారికి కొన్ని దశాబ్దాల పాటు సేవలందించిన ఈ విమానం వయస్సు సుమారుగా 42 సంవత్సరాలుగా ఉంది.

సుమారుగా ఆరు ఇంజన్‌లను కలిగి ఉన్న ఈ ఆంటనోవ్ ఏఎన్-225 విమానం గరిష్టంగా 600 టన్నుల బరువును మోయగలదు.

విశ్వపు అతి పెద్ద ప్యాసింజర్ విమానం ఎయిర్‌బస్ ఎ380 గురించి ఆసక్తికర విషయాలు
ప్రపంచానికి చురకలంటిచనున్న జపాన్ తొలి స్టెల్త్ యుద్ద విమానం


Click it and Unblock the Notifications








