ఆధునిక కార్లలో ఈ ఫీచర్లు చాలా "చిరాకు" తెప్పిస్తాయ్..! అవేంటో చూద్దాం రండి..!!

మనం ఉపయోగిస్తున్న ఆధునిక కార్లలో అనేక కంఫర్ట్ అండ్ కన్వీనెన్స్ ఫీచర్లు అందుబాటులో ఉంటున్నాయి. వాహనాలలో ప్రయాణాలను మరింత విలాసవంతమైన మరియు ఆసక్తికరంగా చేయడానికి, తయారీదారులు ఆధునిక కార్లలో వివిధ సాంకేతిక సౌకర్యాలతో కూడిన ఫీచర్లను అందిస్తున్నాయి. ఈ ఫీచర్లలో చాలా వరకు ప్రభావవంతంగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆటోమోటివ్ ప్రపంచానికి ఈ ఫీచర్లు గొప్ప వరం అనొచ్చు.

Recommended Video

Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT

అయితే, కార్లలోని అన్ని ఫీచర్లు మనకు సౌకర్యాన్ని కల్పించాలన్న గ్యారంటీ లేదు. అసలు కార్లలో "ఇలాంటి ఫీచర్‌ను ఎందుకు ఇచ్చారబ్బా?" అని మీరు ఆలోచించేలా చేసే కొన్ని అనవసరమైన ఫీచర్లు కూడా కార్లలో అందించబడతాయి. వినియోగదారులకు అసౌకర్యం కలిగించే అటువంటి కొన్ని అవసరమైన ఫీచర్ల గురించిన సమాచారాన్ని ఈ పోస్ట్‌లో చూద్దాం రండి.

ఆధునిక కార్లలో ఈ ఫీచర్లు చాలా

లో రిజల్యూషన్ కెమెరా

ప్రస్తుతం, ఎంట్రీ లెవల్ కార్లలో కూడా రివర్స్ పార్కింగ్ కెమెరా ఫీచర్ లభిస్తుంది. అయితే, కారు యొక్క తక్కువ ధర కారణంగా, అందులో అందించే ఇలాంటి యాక్ససరీలు కూడా అంత నాణ్యమైనవిగా ఉండట్లేదు. కార్లలో అందించే రివర్ పార్కింగ్ కెమెరాలో ఉపయోగించే లో రెజల్యూషన్ కెమెరాలు, కారులోపల డ్యాష్‌బోర్డులో ఉండే డిస్‌ప్లే పై ప్రదర్శించే విజువల్స్ చాలా అస్పష్టంగా ఉంటాయి. కాబట్టి, కొన్ని సందర్భాల్లో ఇలాంటి కెమెరా ద్వారా చూడటం కంటే తలతిప్పి వెనుకకు చూడటమే మంచిదనిపిస్తుంది.

ఆధునిక కార్లలో ఈ ఫీచర్లు చాలా

పెద్ద సైజులో ఉండే కీఫాబ్‌లు

మార్కెట్లో సుమారు రూ. 8 లక్షల కంటే ఎక్కువ ధర కలిగిన కార్ మోడళ్ల కోసం వాహన తయారీదారులు కీలెస్ ఎంట్రీ ఫీచర్‌ను అందిస్తుంటారు. ఇలాంటి ఫీచర్ కలిగిన కార్లు రిమోట్ కీఫాబ్ ని కలిగి ఉంటాయి. అయితే, ఈ కీఫాబ్‌లు సన్నగా, స్లిమ్‌గా ఉండకుండా, కాస్తంత పెద్దవిగా ఉంటున్నాయి. ఆటోమేకర్లు ఈ ఫీచర్‌ను నిరాడంబరంగా కాకుండా పెద్ద పరిమాణంలో ఉండే కీఫాబ్ లను అందిస్తున్నారు. ఇది వినియోగదారులకు ఇబ్బందికరంగా ఉంటోంది. కాబట్టి, వీటి పరిమాణం ఇంకా చిన్నవిగా ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు.

ఆధునిక కార్లలో ఈ ఫీచర్లు చాలా

వాయిస్ కంట్రోల్ సిస్టమ్స్

ప్రస్తుతం, అనేక కార్లలో వాయిస్ కమాండ్ ఫీచర్ లభిస్తోంది. డ్రైవర్ తన చేతివేళ్లను ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే వాయిస్ కమాండ్ సాయంతో కారులోని అనేక ఫీచర్లను కంట్రోల్ చేయవచ్చు. కొన్ని నిర్దేశిత వాయిస్ కమాండ్స్‌ను ఉపయోగించడం ద్వారా ఫోన్ కాల్స్ చేయడం, మ్యూజిక్ ట్రాక్‌లను మార్చడం, సౌండ్ పెంచడం లేదా తగ్గించడం, ఏసిని కంట్రోల్ చేయడం వంటి చాలా పనులు చేయవ్చచు. నిజానికి, ఇదొక కంఫర్ట్ ఫీచర్ అయినప్పటికీ, ఇది డ్రైవరును పరధ్యానికి గురిచేసే ఫీచర్ అని చాలా మంది భావిస్తున్నారు.

ఆధునిక కార్లలో ఈ ఫీచర్లు చాలా

అంతేకాకుండా, ఈ వాయిస్ కమాండ్ సిస్టమ్ మనం అందించే సందేశాలను తప్పుగా అర్థం చేసుకుంటే, దాని పనితీరు కూడా భిన్నంగా ఉంటుంది. మనం అందించే కమాండ్ సరైన రీతిలో సిస్టమ్ అర్థం చేసుకునే వరకూ మనకు తప్పుగా రిజల్ట్స్ వస్తుంటాయి. ప్రస్తుతం, చాలా స్మార్ట్‌ఫోన్లలో ఇలాంటి ఫీచర్ ఉంటోంది. మీ ఫోనులో దీనిని ఉపయోగించి ఉంటే, దాని వల్ల కలిగే నష్టాలు ఏంటో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా సరైన వాయిస్ కమాండ్ ఇవ్వడం కోసం పదే పదే వాయిస్ కమాండ్ ఉపయోగించడానికి బదులుగా చిటికెలో చేతి వేళ్ల సాయంతో మనకు నచ్చిన పని చేసేయవచ్చనేది వీరి అభిప్రాయం.

ఆధునిక కార్లలో ఈ ఫీచర్లు చాలా

స్పేస్ సేవర్ స్పేర్ వీల్

కొంతమంది వాహనదారులు ఆధునిక కార్లలో స్పేర్ వీల్ అనవసరమని భావిస్తారు. ఇవి కారులో అనవసరంగా ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయనేది వారి అభిప్రాయం. ఇందుకు ప్రధాన కారణం, ఆధునిక కార్లు ట్యూబ్ లెస్ టైర్లతో వస్తున్నాయి, కాబట్టి వీటికి ఎవరైనా సులువుగా పంక్చర్ వేసుకోవచ్చు. నిజానికి వీల్ మార్చడం కన్నా ట్యూబ్‌లెస్ టైర్లకు పంక్చర్ వేయడమే చాలా సులభం. ఈ విషయాన్ని గ్రహించిన తయారీదారులు కూడా ఇప్పుడు స్పేర్ వీల్స్ ను అందించడానికి బదులుగా పంక్చర్ రిపేర్ కిట్ లను అందిస్తున్నాయి.

ఆధునిక కార్లలో ఈ ఫీచర్లు చాలా

ఖాళీ స్విచ్‌లు

డ్యాష్‌బోర్డులో మీరు గమనించినట్లయితే, తయారీదారులు కొన్ని డమ్మీ స్విచ్ లను అందిస్తుంటారు. డ్యాష్‌బోర్డులో డ్రైవర్ కు కుడిచేతి వైపు ఇలాంటి డమ్మీ స్విచ్‌లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వాహన యజమానులు తమ కార్లలో ఏవైనా అదనపు ఎలక్ట్రానిక్స్ అమర్చుకుంటే, వాటికి సంబంధించిన స్విచ్ లను అమర్చుకోవడం కోసం ఇలాంటి ఖాలీ స్విచ్‌లను అందిస్తుంటారు. అయితే, చాలా వరకూ మోడ్రన్ కార్లు యూజర్లకు అవసరమైన అన్ని ఫీచర్లతో వస్తున్నాయి. అలాంటప్పుడు ఈ డమ్మీ స్విచ్ లతో పెద్ద పనేంటనేది కొందరి అభిప్రాయం. ఇది కారు ముందు భాగంలో దాని అందాన్ని పాడు చేస్తుందని భావిస్తున్నారు.

ఆధునిక కార్లలో ఈ ఫీచర్లు చాలా

డెడ్ పెడెల్ లేకపోవడం

మునుపటి వాహనాలలో, క్లచ్‌ను నిరంతరం నొక్కే పాదాలకు విశ్రాంతినిచ్చే విధంగా, క్లచ్ పెడల్ కు ఎడమ వైపును ఓ డెడ్ పెడల్ ఉండేది. హైవేలపై ప్రయాణిస్తున్నప్పుడు లేదా క్లచ్ నిరంతరం ఉపయోగించాల్సిన అవసరం లేనప్పుడు డ్రైవర్ తన ఎడమ కాలుని ఈ డెడ్ పెడల్ పై ఉంచే వారు. అయితే, నేటి ఆధునిక కార్లలో ఈ ఫీచర్ అందించబడడటం లేదు. కొంతమంది అందం కోసం ఈ ఫీచర్‌ను పట్టించుకోరు. అయితే, కొంతమంది సాధారణ కారు వినియోగదారులు ఈ ఫీచర్ అద్భుతంగా ఉంటుందని భావించడం ప్రారంభించారు. మరి వాహన తయారీదారులు తిరిగి ఈ ఫీచర్‌ను అందిస్తారో లేదో చూడాలి.

More from DriveSpark

Article Published On: Saturday, September 10, 2022, 8:00 [IST]
English summary
These are the most frustrating features on modern cars lets take a look
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+