భారత మార్కెట్లో కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమైన ఫేస్‌లిఫ్టెడ్ కార్లు

ప్రపంచవ్యాప్తంగా కార్ల తయారీ సంస్థలు తాము విక్రయించే, కొన్ని పాపులర్ వాహనాలలో ప్రతి సంవత్సరం లేదా ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి చొప్పున ఫేస్‌లిఫ్ట్ మోడళ్లను ప్రవేసపెడుతూ వస్తుంటాయి. కారు డిజైన్ లో భారీ మార్పులు చేయకుండా, కొద్దిపాటి కాస్మెటిక్ అప్‌డేట్ లతో కంపెనీలు వీటిని రూపొందిస్తాయి.

భారత మార్కెట్లో కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమైన ఫేస్‌లిఫ్టెడ్ కార్లు

ఈ మేకోవర్ ప్రాసెస్ లో అప్‌డేట్ చేయబడే వాహనాలు కొన్నిసార్లు మునుపటి మోడళ్ల కంటే మెరుగ్గా ఉంటాయి. అలాగే, కొన్ని సందర్భాల్లో, అవి తమ మునుపటి మోడళ్లతో పోలిస్తే వికారమైన డిజైన్ కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఫేస్‌లిఫ్ట్ మోడళ్లు తమ ఆకర్షణను కోల్పోయి, కొనుగోలుదారులను ఆకర్షించకపోవచ్చు.

భారత మార్కెట్లో కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమైన ఫేస్‌లిఫ్టెడ్ కార్లు

మనదేశంలో కూడా ఫేస్‌లిఫ్ట్ పొందిన తర్వాత కూడా విజయవంతం కాలేకపోయిన కొన్ని కార్లు ఉన్నాయి. ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

భారత మార్కెట్లో కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమైన ఫేస్‌లిఫ్టెడ్ కార్లు

రెనో డస్టర్ (Renault Duster)

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ భారత మార్కెట్లో ఓ స్థిరమైన కార్ బ్రాండ్ గా అవతరించడానికి మరియు విజయం సాధించడానికి డస్టర్ ఎస్‌యూవీ ఎంతగానో ఉపయోగపడిందని చెప్పవచ్చు. రెనో డస్టర్ భారతదేశంలో ఈ ఫ్రెంచ్ కార్ బ్రాండ్ నుండి వచ్చిన మొదటి విజయవంతమైన వాహనం. ఇది చాలా ఆచరణాత్మకమైనది, సరసమైనది మరియు దృఢమైనది.

భారత మార్కెట్లో కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమైన ఫేస్‌లిఫ్టెడ్ కార్లు

రెనో డస్టర్ మార్కెట్లోకి వచ్చిన మొదటి 2-3 సంవత్సరాల సమయంలో, ఈ మోడల్ కి పోటీగా వేరే ఇతర ఎస్‌యూవీ నిలబడలేదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాలక్రమేణా, కంపెనీ ఈ ఎస్‌యూవీలో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) వేరియంట్ ను కూడా ప్రవేశపెట్టింది. ఆ సమయంలో అత్యంత సరసమైన ధరకే ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ తో లభించిన ఎస్‌యూవీ రెనో డస్టర్.

భారత మార్కెట్లో కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమైన ఫేస్‌లిఫ్టెడ్ కార్లు

అయితే, రెనో డస్టర్ రాక తర్వాత, భారతదేశంలో అప్పటి వరకు అంతగా పరిచయం లేని కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఈ విభాగంలో పోటీని ఎదుర్కునేందుకు రెనో తమ డస్టర్‌ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ని మార్కెట్లో విడుదల చేసింది. అయితే తొలినాళ్లలో డస్టర్ కి లభించిన ఆదరణ ఆ తర్వాత వచ్చిన ఫేస్‌లిఫ్ట్ మోడల్‌కి లభించలేదని చెప్పొచ్చు. ఫలితంగా, ఈ మోడల్ కి డిమాండ్ కూడా క్రమంగా తగ్గుతూ వచ్చింది.

భారత మార్కెట్లో కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమైన ఫేస్‌లిఫ్టెడ్ కార్లు

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ (Ford EcoSport)

అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ ఇండియా, భారత కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లో విడుదల చేసిన మొట్టమొదటి సబ్-ఫోర్ మీటర్ ఎస్‌యూవీ ఎకోస్పోర్ట్. భారత మార్కెట్లో ఈ కారు ప్రారంభమయ్యే నాటికి ఈ విభాగంలో మరే ఇతర కార్ల తయారీదారు (ప్రీమియర్ రియో ​​మినహా) దేశీయ విపణిలో ఓ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీని అందించలేదు.

భారత మార్కెట్లో కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమైన ఫేస్‌లిఫ్టెడ్ కార్లు

భారత కార్ మార్కెట్లో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ అతికొద్ది కాలంలోనే భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఎకోస్పోర్ట్ విజయానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా, దాని శక్తివంతమైన టర్బో పెట్రోల్ ఇంజన్, స్పోర్టీ డ్రైవింగ్ డైనమిక్స్, ఆకర్షణీయమైన డిజైన్, బెస్ట్-ఇన్ క్లాస్ ఫీచర్స్ మరియు అత్యుత్తమ సేఫ్టీ మొదలైన అంశాలు ఉన్నాయి. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ, ఇది సౌకర్యవంతమైన క్యాబిన్‌కు ప్రసిద్ధి చెందింది.

భారత మార్కెట్లో కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమైన ఫేస్‌లిఫ్టెడ్ కార్లు

అద్భుతమైన పట్టణ ఎస్‌యూవీ (అర్బన్ ఎస్‌యూవీ) గా వచ్చిన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ లో కూడా కంపెనీ కాలానుగుణంగా కొన్ని అప్‌డేటెడ్ వెర్షన్లను పరిచయం చేసింది. ఈ క్రమంలో కంపెనీ దాని డిజైన్ తో పాటుగా ఫీచర్లను కూడా అప్‌డేట్ చేసింది. అయితే, ఈ అప్‌డేట్స్ విషయంలో కంపెనీ కాస్తంత ఆలస్యం చేసినట్లుగా తెలుస్తోంది. పెరిగిన పోటీ కారణంగా, ఈ మోడల్ కి ఆదరణ కూడా కరువయ్యింది. ఏదేమైనప్పటికీ, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఇప్పటికీ డబ్బుకి విలువైన వాహనం మరియు ఈ విభాగంలో కెల్లా అత్యంత శక్తివంతమైన ఎస్‌యూవీగా ఉంటుంది.

భారత మార్కెట్లో కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమైన ఫేస్‌లిఫ్టెడ్ కార్లు

ఫోక్స్‌వ్యాగన్ పోలో క్రాస్ (Volkswagen Polo Cross)

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో దాదాపు ఐదారేళ్ల క్రితం వరకూ క్రాస్ఓవర్ అనేది చాలా పాపులర్ కార్ సెగ్మెంట్. ఆటోమొబైల్ కంపెనీలు తమ హ్యాచ్‌బ్యాక్/సెడాన్ కార్లను ఎస్‌యూవీ డిఎన్ఏతో మిళితం చేసి క్రాసోవర్లను రూపొందించాయి. ఈ రకంగా మార్కెట్లోకి వచ్చినదే ఫోక్స్‌వ్యాగన్ పోలో క్రాస్. కంపెనీ యొక్క పోలో హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా ఈ మోడల్ ని రూపొందించారు.

భారత మార్కెట్లో కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమైన ఫేస్‌లిఫ్టెడ్ కార్లు

భారత మార్కెట్లో ఇటాలియన్ కార్ బ్రాండ్ ఫియట్ తమ అవెంచురా క్రాసోవర్ ను ప్రకటించిన తర్వాత ఫోక్స్‌వ్యాగన్ కూడా అలాంటి ఓ కారును విడుదల చేయాలని పోలో క్రాస్ ద్వారా ముందుకు వచ్చింది. అయితే, ఫోక్స్‌వ్యాగన్ పోలో క్రాస్ మొదటి నుండి ఎటువంటి ముఖ్యమైన కదలికలు చేయలేదనే చెప్పాలి. పోలో హ్యాచ్‌బ్యాక్‌కి లభించినంత ఆదరణ పోలో క్రాస్ కి లభించలేదు.

భారత మార్కెట్లో కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమైన ఫేస్‌లిఫ్టెడ్ కార్లు

ఇతర ఆటోమొబైల్ కంపెనీల మాదిరిగానే, ఫోక్స్‌వ్యాగన్ కూడా తమ పోలో క్రాస్ కి ఫేస్‌లిఫ్ట్ ఇవ్వాలని చూసింది. ఫలితంగా, ఈ కారులో చిన్నపాటి మార్పులు చేసింది, కానీ అది కూడా ఓవరాల్ లుక్ అండ్ ఫీల్ ను పెద్దగా మార్చలేకపోయింది. ఫోక్స్‌వ్యాగన్ పోలో క్రాస్ వీల్ ఆర్చ్‌లతో పాటుగా కారు చుట్టూ బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్‌ను కలిగి మంచి రగ్గడ్ లుక్ తో ఉండేది.

భారత మార్కెట్లో కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమైన ఫేస్‌లిఫ్టెడ్ కార్లు

టొయోటా ఎతియోస్ క్రాస్ (Toyota Etios Cross)

క్రాస్ఓవర్ మార్కెట్ డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా కూడా ప్లాన్ చేసింది. కంపెనీ విక్రయిస్తున్న పాపులర్ హ్యాచ్‌బ్యాక్ ఎతియోస్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఇందులో ఓ క్రాసోవర్ మోడల్ ని ప్రవేశపెట్టింది. కానీ, ఇది కస్టమర్లను అంతగా ఆకర్షించలేకపోయింది. ఇందులో ఫేస్‌లిఫ్ట్ మోడల్ వచ్చినా ప్రయోజనం లేకపోయింది. నిజానికి క్రాసోవర్ మోడళ్లు ప్రధానంగా యువతను మరియు ఖరీదైన ఎస్‌యూవీలను కొనలేని కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని ప్రవేశపెట్టబడ్డాయి.

భారత మార్కెట్లో కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమైన ఫేస్‌లిఫ్టెడ్ కార్లు

హోండా సివిక్ (Honda Civic)

అమెరికాలో హోండా సివిక్ చాలా ప్రాచుర్యం పొందిన ఎంట్రీ లెవల్ సెడాన్. భారత మార్కెట్లో కూడా మంచి లెజెండరీ కార్లలో హోండా సివిక్ కూడా ఒకటి. అయితే, ఈ మోడల్ లుక్ చాలా బాగున్నప్పటికీ, దీని అధిక ధర కారణంగా ఇది కస్టమర్ల చెంతకు చేరుకోలేకపోయిందని చెప్పాలి.

భారత మార్కెట్లో కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమైన ఫేస్‌లిఫ్టెడ్ కార్లు

కొన్ని సంవత్సరాల తరువాత, సరిగ్గా 6 సంవత్సరాల క్రితం, హోండా భారతదేశంలో విక్రయించిన మొదటి తరం సివిక్‌ సెడాన్ ఉపసంహరించుకుంది. ఆ తర్వాత, తిరిగి 2019 లో హోండా ఈ మోడల్ లో సెకండ్ జెనరేషన్ మోడల్ ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. అయినప్పటికీ, ఇది హోండా అంచనాలను అందుకోలేకపోయింది.

భారత మార్కెట్లో కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమైన ఫేస్‌లిఫ్టెడ్ కార్లు

హ్యుందాయ్ శాంత్రో (Hyundai Santro)

కొరియన్ కార్ హ్యుందాయ్ శాంత్రో, ఒకప్పుడు మారుతి సుజుకి ఎమ్800 మరియు ఆల్టో వంటి మోడళ్లకు గట్టి పోటీగా నిలిచి, మార్కెట్లో స్థిరమైన స్థానాన్ని మరియు విజయాలను దక్కించుకుంది. హ్యుందాయ్ బ్రాండ్ భారత మార్కెట్లో విడుదలైన మొదటి కార్లలో శాంత్రో కూడా ఒకటి. కొంత కాలం తర్వాత కంపెనీ ఈ మోడల్ ని పూర్తిగా నిలిపివేసింది.

భారత మార్కెట్లో కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమైన ఫేస్‌లిఫ్టెడ్ కార్లు

అయితే, భారత మార్కెట్లో చిన్న కార్లకు తరగని డిమాండ్ ని గ్రహించిన హ్యుందాయ్ తమ ఐకానిక్ శాంత్రో కార్ ను పూర్తిగా మోడ్రన్ డిజైన్ మరియు ఫీచర్లతో మార్కెట్లో రీలాంచ్ చేసింది. ఎంత అడ్వాన్స్డ్ డిజైన్ మరియు ఫీచర్లతో వచ్చినప్పటికీ, ఇది మునుపటి శాంత్రో మైలురాళ్లను మాత్రం చేరుకోలేకపోయింది. ఈ వాహనం యొక్క డిజైన్, ఫీచర్ అప్‌గ్రేడ్‌ల విషయంలో కంపెనీ చేసిన ప్రయత్నాలు ఏవీ పెద్దగా ఫలించలేదనే చెప్పాలి.

Most Read Articles

English summary
These facelifted cars in india failed to attract customers attention details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X