ఈ ఏడాది లగ్జరీ కార్లకు ఓనర్లుగా మారిన ముద్దుగుమ్మలు వీరే.. ఒక్కో కారు ఖరీదు ఎంతో తెలుసా.!!

సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయమైనా సరే ఫ్యాన్స్‌కు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా వారు తిరిగే లగ్జరీ కార్లు. సాధారణంగా సినీ రంగంలోని ప్రముఖ నటీనటులందరి వద్ద ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో 2023 ముగియనుంది. ఈ క్రమంలో ఈ ఏడాది సెలబ్రిటీలు కొనుగోలు చేసిన కార్ల వివరాలు ఈ కథనంలో..

ఈ ఏడాదిలో ఆటో మొబైల్‌ రంగంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రముఖ బ్రాండ్‌ కంపెనీల నుంచి పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్‌జీ వెర్షన్‌ కార్లే కాకుండా ఎలక్ట్రిక్‌ కార్లు కూడా లాంచ్‌ అయ్యాయి. ఆశాజనక సేల్స్‌తో కస్టమర్లలో మంచి ఆదరణ పొందాయి. కొవిడ్‌ 19 సంక్షోభం తర్వాత ఆటో సెక్టార్‌ పుంజుకున్న మాదిరిగానే సినీ పరిశ్రమ కూడా కోలుకుంది.

Alia-Bhatt-Range-Rover-Autobiogrphy1

టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ అనే తేడా లేకుండా అన్ని భాషల చిత్రాలు చాలా వరకు సూపర్‌ హిట్స్‌ను అందుకున్నాయి. అయితే సినిమాల సంగతి ఎలా ఉన్నా.. సినీ సెలబ్రిటీలకు కార్లపై మోజు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా హీరోయిన్లు లగ్జరీ కార్లు కొనుగోలు చేశారు. 2023 లో ఐదుగురు ముద్దుగుమ్మలు కొనుగోలు చేసిన ఖరీదైన కార్ల వివరాలు ఇక్కడ చదివేయండి..

Alia-Bhatt-Range-Rover-Autobiogrphy1

పూజా హెగ్డే(Pooja Hegde): దక్షిణ భారత సినీ పరిశ్రమలో పూజా హెగ్దే అందం, అభినయంతో ఫ్యాన్స్‌లో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. కాగా పూజా హెగ్డే ఈ ఏడాది 2023లో రూ.4 కోట్ల విలువైన రేంజ్ రోవర్(Range Rover) లగ్జరీ ఎస్‌యూవీని కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Alia-Bhatt-Range-Rover-Autobiogrphy1

అలియా భట్ (Alia Bhatt): RRR సినిమాతో తెలుగు ప్రజలు మనసు దోచుకున్న బ్యూటీ ఆలియా భట్‌. ఈ ఏడాది దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతే కాకుండా గంగూభాయ్‌ సినిమాకు ఉత్తమ నటిగా నేషనల్‌ అవార్డును సొంతం చేసుకుంది. కాగా ఆలియా ఈ ఏడాది.. సరికొత్త రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ లాంగ్-వీల్-బేస్ లగ్జరీ ఎస్‌యూవీని కొనుగోలు చేసింది. ఈ కారు ఖరీదు రూ. 3 కోట్లకు పైనే ఉంటుంది.

రకుల్‌ ప్రీత్ సింగ్(Rakul Preet Singh): ఈ ఏడాది టాలీవుడ్‌ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ Mercedes-Maybach GLS600 SUVని కొనుగోలు చేసింది. ఈ కారును షోరూం సిబ్బంది.. ట్రక్కులో ఆమె ఇంటికే డెలివరీ చేశారు. ఈ కారును ఇప్పటికే బాలీవుడ్‌ నటుల్లో చాలా మంది కలిగి ఉన్నారు. దీపికా పదుకొనే, కృతి సనన్, అజయ్ దేవగన్, అర్జున్ కపూర్, ఇలా కొంతమంది ప్రముఖులు ఈ ఖరీదైన కారును కలిగి ఉన్నారు.

Rakul-Preet-Mercedes-Maybach

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez): మార్కెట్‌లోకి వచ్చే ఏ కొత్త ఖరీదైన లగ్జరీ కారునైనా సరే కొనుగోలు చేయడానికి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఆసక్తి చూపిస్తుంది. ఈ ఏడాది కూడా ఆమె ఖరీదైన BMW i7, ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్‌ను కొనుగోలు చేసింది. దీని ధర రూ.2 కోట్లు.

నయనతార(Nayanthara): సౌత్ ఇండియన్ సినిమా లేడీ సూపర్ స్టార్ అని ఫ్యాన్స్‌ అభిమానంగా పిలుచుకునే నయనతారకు ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో చాలా క్రేజ్‌ ఉంది. నయన్‌ ఇటీవలే తన 39వ పుట్టినరోజు ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంది. ఈ బర్త్‌డేకు ఆమె భర్త విఘ్నేష్ శివన్ ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చాడు. అది మెర్సిడెస్‌ మేబ్యాచ్‌ GLS600(Mercedes-Maybach GLS600).

Rakul-Preet-Mercedes-Maybach

వీరితో పాటు బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ కూడా ఖరీదైన కారును కొనుగోలు చేసింది. దసరా సందర్భంగా రూ. 4 కోట్ల ఖరీదైన లంబోర్ఘినీ హురాకాన్‌ టెక్నికా కారును సొంతం చేసుకుంది. శిల్పాశెట్టి నిర్వహించిన దీపావళి వేడుకలో ఈ హాట్‌ లావిష్‌ స్పైసీ రెడ్‌ కలర్‌ కారులో ఈ ముద్దుగుమ్మ తళుక్కుమంది. వీరితో పాటు మరికొంత నటులు కూడా ఖరీదైన కార్లను కొనుగోలు చేశారు.

More from DriveSpark

Article Published On: Thursday, December 14, 2023, 13:12 [IST]
English summary
These indian actresses bought luxury cars in this year 2023 pooja hegde to nayanthara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+