Live Video BMW X5 కారు అద్దాలు ధ్వంసం చేసి రూ.13.75 లక్షలు చోరీ.. కారు అలారం మోగకుండా దొంగలు ఏం చేశారో చూడండి!
భారత్‌లో మెట్రో నగరాలు సహా ఇతర ప్రాంతాల్లో దొంగతనాలు పెద్ద సమస్యగా మారాయి. ఇలాంటి ఘటనలు అరికట్టేందుకు అనేక ప్రాంతాల్లో పోలీసులు సీసీ కెమెరాల ఏర్పాటుచేశారు. అయినా దొంగతనాలు ఎక్కడో చోట జరుగుతున్నాయి.
ఇళ్లు, కార్యాలయాలు సహా రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాల నుంచి విలువైన వస్తువులు సహా నగదు చోరీ చేసిన ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. తాజాగా బెంగళూరులో ఇటువంటి ఘటన జరిగింది. అక్కడున్న సీసీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డు అయింది. రోడ్డుపక్కన పార్కింగ్ చేసిన బీఎండబ్ల్యూ కారులోని (BMW X5) రూ.13.75 లక్షల నగదును చోరీచేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సీసీటీవీ కెమెరా వీడియో వైరల్: బెంగళూరులోని సర్జాపూర్‌లోని సోంపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ పార్కింగ్ చేసిన బీఎండబ్ల్యూ X5 కారు అద్దాన్ని ధ్వంసం చేసి రూ.13.75 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. అక్కడున్న సీసీ కెమెరాల్లో ఈ వీడియో రికార్డు అయింది.
ఈ వీడియో ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట బీఎండబ్ల్యూ X5 కారును పార్కింగ్ చేశారు. అయితే కారులో డబ్బు ఉందని గుర్తించిన దుండగులు.. ఆ పరిసర ప్రాంతాలను నిశితంగా పరిశీలించారు. వారి అనుమానాస్పద కదలికలను వీడియోలో గుర్తించవచ్చు. ఇద్దరిలో ఒకరు బైక్‌పై ఉండగ మరో వ్యక్తి కారు వద్దకు వెళ్లాడు. అనంతరం కారు అద్దాలను ధ్వంసం చేసి, లోపలున్న నగదును కాజేశారు. అనంతరం బైక్‌పై ఇద్దరు వెళ్లిపోయారు.

ఎంతో చాకచక్యంగా చోరీ : అయితే అక్కడకు సమీపంలోని ప్రజలు ఉండగా.. ఈ దొంగతనాన్ని వారు ఎవరూ పసిగట్టలేకపోయారు. కారు డోర్లను తెరిచేందుకు ప్రయత్నం చేయలేదు. అలా చేస్తే కారు అలారం మోగుతుందని జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. అందుకే అద్దాలు ధ్వంసం చేసి ఆ మార్గం ద్వారా క్యాబిన్‌లోకి ప్రవేశించి, నగదు దోచుకెళ్లారు.
కారు డోర్ తెరిస్తే : కారులో నగదు ఉందని, దొంగలకు ముందు సమాచారం ఉంది. అందువల్ల పక్కా ప్లానింగ్‌తో చోరీ చేశారు. దాంతోపాటు కారు గురించి కూడా దొంగలకు మంచి అవగాహన ఉన్నట్లు తెలుస్తోంది. కారు అద్దాలు ధ్వంసం చేసిన అనంతరం డోర్ తీసుకొని క్యాబిన్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడే దొంగలు చాలా అప్రమత్తంగా వ్యవహరించారు.

కారు డోర్ తెరిస్తే అలారం మోగే అవకాశం ఉంటుందని భావించి, ధ్వంసం చేసిన అద్దం ద్వారా క్యాబిన్‌లోకి ప్రవేశించారు. డబ్బు చోరీ చేశారు. దీంతోపాటు చుట్టుపక్కల ప్రజలు ఉన్నా ఎంతో ధైర్యంతో చాకచక్యంగా నగదు చోరీ చేశారు. ఇదంతా అక్కడున్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయింది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








