బైక్ దొంగకు చెమటలు పట్టించిన ఫేస్‌బుక్ పోస్ట్.. ఈ యజమాని ఐడియాకు సలాం కొట్టాల్సిందే.!!
ఏదైనా వస్తువు దొంగతనానికి గురైందంటే ఇక దాని మీద బాధితులు ఆశలు వదిలేసుకోవాల్సిందే.. ఎందుకంటే చోరీ అయిన సొమ్ము దొరికిన సందర్భాలు చాలా తక్కువ. కార్లు, బైక్‌లు కూడా ఆ కోవలోకే వస్తాయి. ఎందుకంటే దొంగలు అంత హైటెక్‌గా చోరీలకు పాల్పడతారు. కానీ ఇక్కడ ఓ దొంగ మాత్రం అందుకు విభిన్నం.
జనజీవనంపై సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా పలు సామాజిక మాధ్యమాల ద్వారా చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఇంకా ఎవరికైనా సహాయం కావాల్సివచ్చినా, ఏదైనా సమాచారం పంచుకోవాల్సి వచ్చినా సోషల్ మీడియా మంచి వేదికగా ఉపయోగపడుతోంది.

కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ మారిపోయింది. చాలా మంది త్వరగా వైరల్ అయ్యేందుకు రకరకాల వీడియోలను చేస్తూ పోస్ట్ చేస్తున్నారు. లక్షల్లో వ్యూస్‌ను సంపాందించుకుంటూ డబ్బు గడిస్తున్నారు. అయితే ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం తాను పోగొట్టుకున్న బైక్(Bike Theft)ను ఫేస్‌బుక్ పుణ్యమా అని తిరిగి దక్కించుకున్నాడు. అదెలా అనుకుంటున్నారా.. ఈ స్టోరీ చదివేయండి మరి..
గుజరాత్‌లోని సూరత్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. సూరత్‌లో ఉంటున్న పరేష్ భాయ్ పటేల్ అనే వ్యక్తి ఈ నెల(డిసెంబర్) 9 న తన బైక్(Bike Theft Facebook Post)ను తన అపార్ట్‌మెంట్‌లోని పార్కింగ్ ప్లేస్‌లో ఎప్పటిలాగే పార్క్ చేశాడు. అయితే తెల్లారి లేచిన తర్వాత బయటకు వెళ్దామని చూసేసరికి తన బైక్ కనిపించలేదు. దీంతో వెంటనే అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా.. తన బైక్‌ను ఓ వ్యక్తి దొంగిలించినట్లుగా గుర్తించాడు.

బైక్ చోరీకి గురయిందని తెలుసుకున్న పటేల్.. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు చూసుకుంటారు లే అని అనుకోకుండా.. ఈ మధ్యలో పరేష్ భాయ్ ఓ గమ్మత్తైన పని చేశారు. బైక్ చోరీకి గురైన విజువల్ సీసీటీవీ క్లిప్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఇక ఆ వీడియో కింద ఇలా రాసుకొచ్చారు.
'జెంటిల్‌మెన్ మీరు నా బైక్‌ను దొంగిలించారని నాకర్థమైంది. నా బైక్ తెచ్చివ్వమని మిమ్మల్ని అడగను. కానీ దానికి సంబంధించి కీస్, RC బుక్‌ను.. మీరు బైక్‌ను ఎక్కడ దొంగిలించారో అక్కడే పెడుతున్నాను. మీరు వచ్చి బైక్ తాళం చెవి, RC బుక్‌ను తీసుకోవచ్చు. నా గురించి మీరు ఆందోళన చెందవద్దు. నేను సైకిల్ మీద వెళ్లి అయినా బతకగలను' అని పరేష్ భాయ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్ అయింది. అయితే విచిత్రం ఏమిటంటే.. ఈ పోస్ట్‌ను దొంగ కూడా చూశాడు. దీంతో కంగారుకు గురైన దొంగ.. డిసెంబర్ 11 న రాత్రి ఆ బైక్‌ను దొంగిలించిన చోటే వదిలేసి వెళ్లాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
తన బైక్ తిరిగి తనకు దక్కడంతో యజమాని పరేష్ భాయ్ హర్షం వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్ పోస్ట్ చేసి తన బైక్‌ను తనకు తెచ్చి ఇచ్చినందుకు ఆనందపడ్డారు. దీంతో పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన కంప్లెయింట్‌ను వెనక్కి తీసుకున్నారు. ఏదేమైనా ఈ దొంగను జెంటిల్‌మెన్ అని సంబోధించినందుకు అందుకు తగ్గట్టుగానే ప్రవర్తించాడు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








