హైటెక్‌ దొంగల ఏటీఎం చోరీ.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..

సినిమాల్లోనూ, వార్తల్లోనూ చాలామంది ఏటీఎం దొంగతనాలకు పాల్పడటం చూసి ఉంటాం. ఏటీఎం మెషీన్‌ను సుత్తితో పగలగొట్టడం లేదంటే టెక్నాలజీ సాయంతో ఏటీఎంలో డబ్బున్న లాకర్‌ను తెరిచి చోరీకి పాల్పడారు. కానీ ఇక్కడ ఇద్దరు దుండగులు మాత్రం కొంచెం వినూత్నంగా ఆలోచించి చివరకు పాల్పడ్డారు.

గతంలో దొంగలు దారిలో వెళ్తున్న వారి చేతి సంచి ఎత్తుకువోవడం, లేదంటే ఎవరూ లేనిది చూసి ఇళ్లలోకి చొరబడి అందినకాడికి దోచుకుపోయేవారు. కానీ ఇప్ప్పడు ఆ పరిస్థితి మారింది. దొంగలు కూడా అప్‌డేట్‌ అవుతున్నారు. ఇందుకు కారణం సినిమాలు, వెబ్ సిరీస్‌లలో దొంగతనాలు తెలివిగా ఎలా చెయ్యాలో చూపించడంతో దొంగలు కూడా ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.

ATM-Theft

కానీ ఇక్కడ ఇద్దరు దొంగలు మాత్రం ఏటీఎంను చోరీ చెయ్యడానికి చేసిన ప్రయత్నం చూస్తే ఫస్ట్‌ షాక్ అయి తర్వాత నవ్వాపుకోలేకపోతారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కొన్నేళ్ల క్రితం అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన జులాయి సినిమాలో సోనూసూద్ బ్యాంక్ దోపిడీ సీన్‌ గుర్తుంది కదా.. బ్యాంక్‌కి వెళ్లినప్పుడు బ్యాంకులో డబ్బు మొత్తం పెద్ద గొలుసుకు కట్టి దాన్ని క్రేన్ సహాయంతో బయటకు లాగి ఎత్తుకుపోతాడు. అయితే ఆ డబ్బు వారికి చిక్కకుండా హీరో ప్రయత్నిస్తాడనుకోండి.

ATM-Theft

అయితే ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఈ తరహా చోరీ సీన్‌ ఒకటి రిపీట్ అయ్యింది. అయితే ఇది బ్యాంకు దొంగతనం కాదు, ఏటీఎం చోరీ. ఇక్కడ ఫైటింగ్‌, చంపుకోవడాలు లాంటివి ఏమీ ఉండవు... కానీ డబ్బు బయటకు లాగే సీన్‌ చూస్తే తెగ నవ్వుకుంటారు. ఏకంగా ఏటీఎం మెషిన్ లాగడానికి ప్రయత్నించారు.

మహారాష్ట్ర బీడ్ జిల్లాలో ఉన్న ఓ ఏటీఎంను ఇద్దరు దొంగలు కొల్లగొట్టేందుకు ప్రయత్నించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వీడియోలో ఇద్దరు దొంగలు తమ ముఖం కనిపించకుండా ముఖానికి స్కార్ఫ్ కట్టుకున్నారు. వీరిద్దరూ ఏటీఎంలో డబ్బు దొంగిలించడానికి కొత్త మార్గం అనుసరించారు.

ATM-Theft

వీరిలో ఒక వ్యక్తి ఏటీఎంను తాడుతో చాలా గట్టిగా కట్టాడు. రెండో కొనను కారు వెనుక భాగంలో కట్టాడు. అనంతరం కారును స్టార్ట్ చేసి వేగంగా ముందుకు పోనివ్వగానే ఏటీఎం మెషిన్ బయటకు వచ్చేస్తుందని, తద్వారా దాన్ని ఎత్తుకెళ్లి పోవాలన్నది వారి ప్లాన్. అయితే ఈ నేపథ్యంలో కారును ఎలా స్టార్ట్‌ చేయాలో రెండో వ్యక్తి సూచనలిచ్చాడు.

అనుకున్నట్టే వారిద్దరూ తాడుతో ఏటీఎంను కట్టేసి, కారుకు తాడును బిగించిన తరువాత రెండవ దొంగ కారును స్టార్ట్ చేశాడు. కానీ ఇక్కడే మొదటి వ్యక్తి పప్పులో కాలేశాడు. ఏటీఎం మెషిన్ ఉన్న గది డోర్ మూసుకుని ఉండటంతో మొదటి దొంగ డోర్‌ తీయాలని చూశాడు. అనంతరం కారు దిగి వచ్చి ఏటీఎం గది తలుపు తీసి అలాగే పట్టుకుని అక్కడే నిలబడ్డాడు.

ATM-Theft

ఇది తెలియని రెండవ దొంగ కారును స్పీడ్‌గా ముందుకు పోనిచ్చాడు. అంతే క్షణాల్లో ఏటీఎం మెషిన్ చాలావేగంగా ముందుకు వచ్చి ఏటీఎం గది డోర్‌ను బద్దలు కొట్టింది. అక్కడే నిలబడి ఉన్న మొదటి దొంగ ఆ విసురుకు అక్కడినుంచి దూరంగా వెళ్లి పడ్డాడు. ఈ సంఘటన మొత్తం ఏటీఎం గదిలోని సీసీ కెమెరాలో రికార్డయ్యింది.

ఏటీఎంలో సేప్ఠీ సర్వీస్ అమర్చి ఉండటంతో పోలీసులకు క్షణాల్లోనే సమాచారం అందింది. పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి ఏటీఎం ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. కానీ అప్పటికే ఆ దొంగలిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో వారు ఏటీఎంలో డబ్బు దొంగిలించడంలో ఫెయిల్ అయ్యారు.

పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ వీడియోను Raja Babu అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్‌ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక వైపు దొంగల క్రియేటీవిటికి ఆశ్చర్యపోతూనే మరొకవైపు వారిపై జోకులు వేస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, September 13, 2023, 16:39 [IST]
English summary
Thieves attempt to theft atm in maharashtra video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+