కదులుతున్న వాహనంలో దొంగతనం.. షాకవుతున్న నెటిజన్లు - వీడియో
కదులుతున్న వాహనాల్లో దొంగతనాలు చేయడం వంటి సంఘటనలు ఫాస్ట్ అండ్ ది ఫ్యూరియస్ సినిమాల్లోని అనేక యాక్షన్ సన్నివేశాల్లో చూసాం. అలాంటి సంఘటన నిజ జీవితంలో జరుగుతుందని ఎప్పుడూ ఊయించి ఉండం. కానీ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో అలాంటి దొంగతనమే కనిపించింది. ఇందులో ముగ్గురు వ్యక్తులు కదులుతున్న ట్రక్కులో దొంగతనం చేయడం చూడవచ్చు. ఇంతకీ ఆ సంఘటన ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? పోలీసులు వీరిపైనా ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఇలాంటివి అరికట్టడానికి ఉన్న మార్గాలు గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో గమనించినట్లయితే.. ఓ వ్యక్తి బజాజ్ పల్సర్ బైక్ రైడ్ చేస్తున్నాడు. మరో ఇద్దరు వ్యక్తులు హైవే మీద కదులుతున్న ట్రక్కుపైన ఉన్నారు. వారు ట్రక్కుపై నుంచి ఒక బాక్స్ కిందికి పడేయడం కూడా చూడవచ్చు. ఆ తరువాత ట్రక్కు వెనకే వస్తున్న బైకు మీదికి దిగుతారు. బైకు మీదకి ఒకరి తరువాత మరొకరు దిగటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

హైవేపైన జరుగుతున్న ఈ సంఘటనను.. వెనుక కారులో వస్తున్న వారు వీడియో రికార్డ్ చేశారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది ఖచ్చితంగా వెలుగులోకి రాలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ.. హైవేపైన ఇలాంటి సంఘటనలు అమానుషమని పేర్కొంటున్నారు. ఇలాంటివి జరగకుండా తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు.
హైవేపై వెళుతున్న ట్రక్కులో ఆ వ్యక్తులు ఒక బాక్స్ తీసి కిందికి పడేసారు. ఆ బాక్సులో ఏముందనేది కూడా స్పష్టంగా తెలియడం లేదు. ఈ సంఘటన మొత్తం ఆ ట్రక్కు నడిపే వ్యక్తికి తెలియలేదని తెలుస్తోంది. ఎందుకంటే హైవేపై కదులుతున్న సమయంలో ఎవరూ దొంగతనం చేయరని భావిస్తారు. కాబట్టి ట్రక్కు నడిపే వ్యక్తి దీనిని పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. మొత్తానికి దొంగలు అనుకున్న విధంగా పని పూర్తి చేసుకున్నారు.

నిజానికి దొంగతనము క్షమించరాని నేరం, అలాంటిది ప్రయాణిస్తున్న ట్రక్కులో నుంచి దొంగతనం చేయడం అనేది మరింత నీచమైన చర్య. అనుకున్న విధంగా దొంగతనం చేశారు, కానీ అనుకోని ప్రమాదం ఎదురైతే.. తప్పకుండా పైన ఉన్న వాళ్ళు కిందపడి అవకాసం ఉంది. బైకు మీదికి దిగే సమయంలో కూడా వారికి ఏమైనా జరగవచ్చు. కాబట్టి ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది.
దొంగతనానికి సిద్ధపడినవాళ్ళు, ట్రక్కుకు కట్టిన తాళ్ల సాయంతో పైకి ఎక్కడం, దిగటం వంటివి చేశారు. వీడియోలో దొంగతనం చేసే వ్యక్తులను గమనిస్తే.. వీరికి చాలా రోజుల నుంచి ఇలాంటి దొంగతనాల్లో మంచి అనుభవం ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టే దొంగతనాన్ని చాలా వేగంగా పూర్తి చేశారు. హైవేపై దొంగతనం చేయడం అంటే.. వాళ్ళు ఎంత పెద్ద బరితెగించిన దొంగలో అర్థం చేసుకోవచ్చు.
దొంగతనానికి పాల్పడిన వ్యక్తులపైన పోలీసులు ఏమైనా చర్యలు తీసుకున్నారా? లేదా? అనేది కూడా స్పష్టంగా వెల్లడికాలేదు. ఒకవేళా పోలీసులు ఇప్పటి వరకు వీరి మీద చర్యలు తీసుకోకుంటే.. వెంటనే కఠినంగా శిక్షించాలి. లేకుంటే.. వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కాబట్టి ఈ వీడియోలో దొంగతనానికి పాల్పడిన వ్యక్తులపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కూడా పేర్కొంటున్నారు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








