Just In
- 14 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 1 hr ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం
- 1 hr ago
కొత్త 2021 స్విఫ్ట్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన మారుతి సుజుకి
- 3 hrs ago
హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు
Don't Miss
- Movies
సీనియర్ డైరెక్టర్‌తో అను ఇమ్మాన్యుయేల్ అఫైర్.. డేటింగ్ జోష్‌లో ఉన్న దర్శకుడు ఎవరంటే!
- News
Sunny Leone: మేడమ్ మొగుడికే స్పాట్ పెట్టాడు, కారు నెంబర్ తో త్రీడి సినిమా, పీయూష్ !
- Sports
ముంబైలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఐపీఎల్ 2021పై బీసీసీఐ పునరాలోచన! తెరపైకి ప్లాన్-బి!
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Finance
ఆర్థిక మాంద్యం నుండి బయటకు భారత్, తలసరి ఎంత అంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వామ్మో.. పోలీస్ స్టేషన్ సమీపంలో ఆపి ఉంచిన కారు టైర్లనే దొంగలించారు.. ఎక్కడనుకుంటున్నారా..!
సమాజంలో కొంతమంది పోలీసులపై ప్రజలకు కొంత చెడు అభిప్రాయం ఉన్నప్పటికీ, కొంతవరకు ఇప్పటికి పోలీస్ వ్యవస్థను మరియు నిజాయితీగల పోలీసులను ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే ఇప్పటికే కొంత వరకు పోలీసుల నుంచి న్యాయం మరియు రక్షణ లభిస్తోంది.

పోలీస్ స్టేషన్ అన్నా పోలీసులన్నా ఇప్పటికి కొంతమందిలో తెలియని నమ్మకం మరియు గౌరవం వుంది. కానీ ఇటీవల ఒక వ్యక్తి తన కారుని పోలీస్ స్టేషన్ సమీపంలో ఆతృతగా పార్కింగ్ చేసాడు, కానీ చివరికి అతడు అక్కడికి వచ్చి చూసే సరికి పెద్ద షాక్ కి గురయ్యాడు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ సమీపంలో ఆపి ఉంచిన కారు టైర్లు దొంగిలించబడ్డాయి.

పోలీస్ స్టేషన్ సమీపంలో ఆపి ఉంచిన కారు టైర్లు దొంగలించబడటంతో ప్రజలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. దీన్ని బట్టి చూస్తే దొంగలు ఎంత నిర్భయంగా తిరుగుతున్నారో మనకు అర్థమవుతుంది. ఇటీవల కాలంలో వాహన దొంగతనం కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి.
MOSRT READ:అంబానీ ఇంట చేరిన మరో ఫెరారీ సూపర్ స్పోర్ట్స్ కార్.. చూస్తే మైండ్ బ్లోయింగ్

ఇక ఈ సంఘటన విషయానికి వస్తే, మహారాష్ట్రలో నివసిస్తున్న 30 ఏళ్ల రవీంద్ర భగత్‌చంద్ మారుతి సుజుకి సెలెరియో కారును కలిగి ఉన్నారు. గత సోమవారం ఆయన ఇంటి వద్ద ఒక చిన్న పార్టీ జరిగింది. ఈ పార్టీకి హాజరు కావడానికి వారి బంధువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

తమ ఇంటి ఆవరణంలో వాహనాలను పార్క్ చేయడానికి తగినంత స్థలం లేనందున, వారు తమ కారును సురక్షితమైన స్థలంలో ఉంచాలని నిర్ణయించుకున్నారు. ఈ కారణంతో కారును సికాలి పోలీస్ స్టేషన్ సమీపంలో నిలిపి ఉంచారు. వారి సెలెరియో కారు సోమవారం రాత్రి పోలీస్ స్టేషన్ నుండి 50 మీటర్ల దూరంలో రోడ్డు పక్కన పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచబడింది.
MOST READ:చివరి రోజు పాండాతో కలిసి పని చేసిన డెలివరీ బాయ్.. ఎందుకంటే

పోలీస్‌స్టేషన్ సమీపంలో కారుని నిలిపి వుంచడం వల్ల దొంగతనం కాదని అతడి నమ్మకం. కానీ మరుసటి రోజు ఉదయం అతను కారు తీయటానికి వచ్చినప్పుడు, ఒక్క సారిగా షాక్ కి గురయ్యాడు. కారుకున్న చక్రాలను ఎవరో దొంగలించి కారు కింద పెద్ద రాళ్లను ఉంచారు.

వెంటనే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనా స్థలంలో సిసిటివి కెమెరాలను పరిశీలించారు. సిసిటివిలో నలుగురు వ్యక్తులు వేర్వేరు వాహనాల్లో వచ్చి చక్రాలు దొంగిలించినట్లు తెలిసింది. ఈ గుర్తు తెలియని వ్యక్తులను పోలీసులు పట్టుకోవడంలో నిమగ్నమయ్యారు. ఆ దొంగలు కేవలం చక్రాలను మాత్రమే కాకుండా, కారు బ్రేక్ కాలిపర్, డిస్క్ కూడా దొంగిలించారు.
MOST READ:తండ్రికి నచ్చినదానిని సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా ఇచ్చిన కొడుకు.. ఆ గిఫ్ట్ ఏంటో చూసారా..!

కారు నుంచి దొంగలించిన ఆ టైర్ల ధర దాదాపు 20000 రూపాయలని కార్ ఓనర్ తెలిపాడు. కారు ఓనర్ ఇచ్చిన కంప్లైంట్ పై పోలీసులు ఐపిసి సెక్షన్ 379 కింద కేసు నమోదు చేశారు. కేసును సీరియస్‌గా తీసుకున్నామని, త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

ఈ రకమైన సంఘటనలతో వాహన యజమానులు భయభ్రాంతులకు గురవుతారు. ఇలాంటి సంఘటనలు సురక్షితమైన పార్కింగ్ ప్లేస్ లేని వాహనదారులు ప్రశాంతంగా పార్కింగ్ కూడా చేసుకోలేకపోతున్నారు. ఈ రకమైన సంఘటనలు జరగకుండా నిరోధించడానికి సరైన పార్కింగ్ స్థలం ఉండటం చాలా అవసరం.
MOST READ:కార్ డ్రైవ్ చేస్తుండగా, హఠాత్తుగా వచ్చిన పాము.. చివరికి ఎం జరిగిందంటే ?