డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్‌లో తప్పకుండా పాటించాల్సిన రూల్స్, ఇవే

మోటార్ వాహన చట్టం ప్రకారం భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన వారు డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి అర్హులు. కానీ చాలా మంది 18 ఏళ్ళు పూర్తిగా నిండకముందే వాహనాలను పబ్లిక్ రోడ్లపై డ్రైవ్ చేస్తున్నారు. ఇలాంటి వారి వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కావున నిర్దేశించిన వయసు వచ్చిన తరువాత డ్రైవింగ్ లైసెన్స్ పొంది డ్రైవింగ్ చేయాలి.

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ రూల్స్ తప్పనిసరి

ఇంతకు ముందు డ్రైవింగ్ లైసెన్స్ పొందటం చాలా సులభంగా ఉండేది. అయితే ఇప్పుడు రూల్స్ చాలా వరకు మారిపోవడం వల్ల డ్రైవింగ్ లైసెన్స్ పొందటం కొంత కష్టతరమవుతుంది. ఇప్పుడు కొన్ని కఠినమైన పరీక్షల తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వబడుతుంది.

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ రూల్స్ తప్పనిసరి

కానీ డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేసే సంబంధిత అధికారులు డ్రైవింగ్ లో మీకున్న నైపుణ్యాన్ని టెస్ట్ చేస్తారు, కావున ఈ రూల్స్ పాటించడం తప్పనిసరి. చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లో విఫలమవ్వడానికి ప్రధాన కారణం ఈ నియమాలను పాటించకపోవడం.

MOST READ:బజాజ్ ఆటో 2021 ఏప్రిల్ సేల్స్ రిపోర్ట్; వివరాలు

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ రూల్స్ తప్పనిసరి

డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి, డ్రైవింగ్ టెస్ట్ లో ఆర్టీఓ అధికారుల సమక్షంలో పాటించాల్సిన కొన్ని నియమాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.

కంపర్టబుల్ గా ఉండటం (సౌకర్యంగా ఉండండి):

మీరు డ్రైవింగ్ టెస్ట్ కి వెళ్ళేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉండాలి, ఎలాంటి గాబరా లేదా టెన్షన్ వంటివి పడకూడదు. ఒకవేళా ఏదైనా టెన్షన్ కి లోనైతే ఎక్కువ తప్పులు చేసే అవకాశం ఎక్కువ. డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి డ్రైవింగ్ టెస్ట్ లో ఆత్మవిశ్వాసంతో పాల్గొనండి.

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ రూల్స్ తప్పనిసరి

బేసిక్ రూల్స్ గురించి తెలుసుకోండి:

డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి పాల్గొనే టెస్ట్ గురించి కనీస పరిజ్ఞానం కలిగి ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ఇందులో కొన్ని బేసిక్ రూల్స్ తెలుసుకుని ఉండే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేగాని డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లో మీకు అన్ని తెలుసునని అతిగా నమ్మకంగా ఉండటం సరైంది కాదు.

MOST READ:మీకు తెలుసా.. విమానం ఎత్తులో ఎగిరేటపుడు పైలెట్స్ మాట్లాడకూడదు.. ఎందుకంటే?

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ రూల్స్ తప్పనిసరి

డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలో వెహికల్ మిర్రర్, హ్యాండ్‌బ్రేక్ మరియు ఇండికేటర్ వంటి వాటిని ఉపయోగించడం గురించి తప్పకుండా తెలుసుకోండి. మీరు డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కి వెళ్ళడానికి ముందే వాహనం యొక్క విడిభాగాలన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా, లేదా అని టెస్ట్ చేసి నిర్థారించుకోండి.

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ రూల్స్ తప్పనిసరి

ట్రైనింగ్:

డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లో పాల్గొనే సమయంలో 8 ఆకారంలో, వంగిన మరియు వాలుగా ఉండే ప్రదేశంలో డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది. కావున ఇలాంటి వాటికి సంబంధించిన ట్రైనింగ్ తీసుకోవడం చాలా మంచిది. ఇది డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలో పాస్ అవ్వడానికి చాలా ఉపయోగకారంగా ఉంటుంది.

MOST READ:హీరో హోండా యాడ్ లో సల్మాన్ ఖాన్.. ఎప్పుడైనా చూసారా..!

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ రూల్స్ తప్పనిసరి

సీట్ బెల్టు:

కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరి. కారులో ప్రవేశించిన వెంటనే మీరు చేయవల్సిన మొదటి పని సీట్ బెల్ట్ ధరించడం. సీట్ బెల్ట్ ధరించిన తరువాత డ్రైవింగ్ టెస్ట్ కొనసాగించండి. డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లో పాల్గొనేటప్పుడు వాహనంలో ఎల్ స్టిక్కర్ అమర్చబడిందని నిర్ధారించుకోండి.

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ రూల్స్ తప్పనిసరి

టెస్టింగ్ సమయంలో కారును పార్కింగ్ చేసేటప్పుడు లేదా టర్న్ తీసుకునేటప్పుడు ఇండికేటర్స్ ఉపయోగించండి. ఎందుకంటే ఆర్టీఓ కార్యాలయంలోని సంబంధిత సిబ్బది వీటన్నింటిని గమనిస్తుంటారు. దీనిని గుర్తుంచుకోవాలి. డ్రైవింగ్ టెస్ట్ సమయంలో మాత్రమే కాదు నిత్య జీవితంలో కూడా కార్ డ్రైవింగ్ సమయంలో సీట్ బెల్ట్ చాలా అవసరం.

MOST READ:వేగంగా కదులుతున్న కారులోకి జంప్ చేసిన వ్యక్తి [వీడియో]

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ రూల్స్ తప్పనిసరి

సమయం (టైమ్):

డ్రైవింగ్ టెస్ట్ లో మీ కోసం కేటాయించిన సమయంలో డ్రైవింగ్ టెస్ట్ కి హాజరవ్వాలి. ఇందులో ఎలాంటి ఆలస్యం చేయకూడదు. నిర్దేశించిన సమయంలో టెస్ట్ కి చేరుకోకపోతే మీ అప్లికేషన్ రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంది. లేకుంటే మీ డ్రైవింగ్ టెస్ట్ సమయాన్ని మరుసటి రోజుకి వాయిదా వేసే అవకాశం కూడా ఉంటుంది.

కావున తప్పనిసరిగా కేటాయించిన టైమ్ కి చేరుకోవాలి. అంతే కాకుండా అవసరమైన డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్లాలి. డాక్యుమెంట్స్ లేకుండా టెస్ట్ లో పాల్గొన్నారని విషయాన్నీ మీరు గుర్తుంచుకోవాలి.

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ రూల్స్ తప్పనిసరి

ఇండికేటర్స్ వినియోగం:

ఇంతకు ముందు పైన చెప్పినట్లుగానే డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లో ఇండికేటర్ ఉపయోగించాలన్న సంగతి మర్చిపోవద్దు. ఇందుకంటే ఇండికేటర్స్ ఉపయోగించడం లేదా ఉపయోగించకపోవడం వంటి వాటిని అధికారులు గమనిస్తూ ఉంటారని సంగతి కూడా గుర్తుంచుకోవాలి.

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ రూల్స్ తప్పనిసరి

డ్రైవింగ్ టెస్ట్ సమయంలో మీరు ఇండికేటర్స్ ఉపయోగించడం మరిచిపోతే, డ్రైవింగ్ లైసెన్స్ టెస్టులో తప్పకుండా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు టెస్ట్ సమయంలో మలుపుల్లో ఇతర సందర్భాలలో అవసరమైన ఇండికేట్స్ ఉపయోగించడం తప్పనిసరి.

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ రూల్స్ తప్పనిసరి

ఆర్టీఓ అధికారులు డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ పై రివర్స్ టేక్ టెస్ట్ నిర్వహిస్తారు. అలాంటప్పుడు ఇంజిన్ రివర్స్ గేర్‌కు మార్చాలి, అంతే కాకుండా ఆఫ్ చేయకుండా రివర్స్‌లో తీసుకోవాలి. రివర్స్ గేర్‌ను బిగించవద్దని ఒక నియమం కూడా ఉంది. రెండు చేతులను స్టీరింగ్ వీల్ మీద ఉంచండి. అవసరమైనప్పుడు మాత్రమే ఒక చేతిని స్టీరింగ్ వీల్‌పై, మరో చేతిని గేర్‌పై ఉంచండి.

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ రూల్స్ తప్పనిసరి

యాక్సిలరేటర్‌ను ఓపికగా నిర్వహించడం. నేను బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నాననే తీవ్ర విశ్వాసంతో యాక్సిలరేటర్‌ను ఉపయోగించకూడదని కూడా సలహా ఇస్తారు.పైన చెప్పిన ఈ టిప్స్ పాటిస్తే డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లో ఉత్తీర్ణత సాధించడం ఖాయం. తప్పకుండా గుర్తించుకోవాలి.

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ రూల్స్ తప్పనిసరి

డ్రైవింగ్ లైసెన్స్ పొందటం చాలా వసరం ఎందుకంటే సరైన అనుభవం లేకుండా రోడ్డుపై వాహనాలను తీసుకువస్తే అనుకోని ప్రమాదాలు చాలా జరుగుతాయి. కావున ఆర్డీఓ అధికారులు డ్రైవింగ్ లైసెన్న్ పొందటానికి తగిన అర్హతలు గమనించి డ్రైవింగ్ లైసెన్స్ అందిస్తారు.

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ రూల్స్ తప్పనిసరి

భారతదేశంలో రోడ్డుప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం సరైన ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం. సరైన పద్దతిలో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారికి తప్పకుండా ఈ రూల్స్ తెలిసి ఉంటాయి. అలా కాకుండా విచ్చలవిడిగా డ్రైవింగ్ చేసేవారి వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. కావున వాహనదారులందరూ ఆర్డీఓ అధికారుల ద్రువీకరణతో లైసెన్స్ పొందాలి.

Most Read Articles

English summary
Things To Keep In Mind While Taking Driving License Test. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X