విమాన ప్రయాణానికి ముందు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడని ఆహార పదార్థాలు

By Anil

విమాన ప్రయాణానికి ముందు భీబత్సమైన ఆకలితో ఉండటం సహజమే, అందుకోసం ఇంటి నుండి బయలుదేరే ముందే భోజనం చేస్తుంటాం. అయితే రావాల్సిన విమానం లేట్ అవ్వడం, ఎయిర్ పోర్ట్‌లోని ఫుడ్ స్టాల్స్‌లలో నోరూరించే వంటకాలు ఉన్నపుడు ఎలాగైనా వాటి పని పట్టాలి అనుకుంటాం.

ఆకలిగా ఉన్నపుడు తినడం తప్పు కాదు, తినకూడని ఆహారాలు మరియు పానీయాలు సేవిస్తే ఆ రోజంతా ఇబ్బందిగానే ఉంటుంది. అయితే అలాంటి సందర్భం రాకూడదనుకుంటే ఈ కథనంలో తెలిపిన ఆహార మరియు పానీయాలకు దూరంగా ఉండండి.

ఆపిల్స్

ఆపిల్స్

ఆరోగ్యానికి నెంబర్‌ వన్‌గా చెప్పుకునే ఆపిల్స్ ఎందుకు తినకూడదు అని మీ ప్రశ్న కదా ? నిజమే. కాని విమాన ప్రయాణానికి ముందు ఆపిల్స్ మరియు దాని జాతికి చెందిన పండ్లను తీసుకోకపోవడం ఎంతో మంచిది. ఇందులో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది. కాబట్టి భూమి నుండి గరిష్ట ఎత్తులో ఉన్నపుడు ఇలాంటివి జీర్ణం కావు. తద్వారా గ్యాస్ ఉత్పత్తి అయ్యి ఉబ్బరంగా ఉంటుంది.

ఫ్రెంచ్ ఫ్రైస్

ఫ్రెంచ్ ఫ్రైస్

ఇలాంటి వాటిని తినకుండా అస్సలు ఉండలేము అంటారు చాలా మంది. అయితే ఇవి తినకూడదు అనడానికి బలమైన కారణాలు ఉన్నాయి. అజీర్ణ పదార్థాలకు తల్లిగా చెప్పుకునే ఇవి అత్యంత సులభంగా గ్యాస్‌ను ఉత్పత్తి చేసి ఉబ్బరంతో పాటు మిమ్మల్ని తరచూ అసౌకర్యానికి గురిచేస్తుంది.

 భారతీయ వంటకాలు

భారతీయ వంటకాలు

ఈ విషయంలో మీరు ఖచ్చితంగా ఏఖీభవించాల్సిందే. మన భారతీయ వంటకాలను మంచి కారంతో, ఎక్కువ వంట నూనెలతో దినుసులతో రుచికి ఏ మాత్రం తీసిపోకుండా చూసిన వెంటనే తినాలి అనే విధంగా ఉంటాయి. ఇక కోడి కూరకు సంభందించిన వంటకాలు తిని ఫ్లైట్ ఎక్కితే దిగే వరకు ఒకటే ఇబ్బంది కలిగిస్తాయి.

శీతల పానీయాలు

శీతల పానీయాలు

ఎక్కువ సమయం పాటు విమానాశ్రయంలో వేచి ఉన్నపుడు దప్పికకొనడం సాధారణమే. అలాంటి సందర్భంలో టేస్ట్ గురించి మరిచిపోయి తరచూ నీటిని త్రాగడం మంచిది. అయితే కోక్ వంటి పానీయాలు సేవిస్తే ఆహారవాహికలోకి చేరుకుని గ్యాస్‌ను సృష్టిస్తాయి. ఇది విమానంలో ప్రయాణిస్తున్నపుడు మీకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

మద్యపానం

మద్యపానం

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో అక్కడక్కడ బార్లు కూడా కనబడుతుంటాయి. ఇక మద్య ప్రియులు కాస్త నాలుక తడుపుకుందాం అనుకుంటే అంతే సంగతులు. విమానంలోకి వెళ్లి జర్నీ ప్రారంభం అయ్యిందంటే చాలు విపరీతమైన తలనొప్పి మరియు వికారంతో వాంతులయ్యే అవకాశం ఉంటుంది.

చూయింగ్ గమ్

చూయింగ్ గమ్

సమయాన్ని వృదా చేయడానికి ఉన్న మార్గాల్లో చూయింగ్ గమ్ నమలడం ఒకటి. అయితే ఎయిర్ ట్రావెల్ చేసే ముందు ఇలా నమలడాన్ని మానుకోండి. ఎందుకంటే ఎక్కువ సమయం పాటు చూయింగ్ గమ్ నమలడం ద్వారా దాని నుండి ఉత్పత్తి అయ్యే స్రవాలు లోపలికి చేరుకుని గాలితో కలిసి గ్యాస్‌గా మారుతుంది. తద్వారా ఉబ్బరం కలగే అవకాశం ఉంది.

కాఫీ

కాఫీ

వినే వాడుంటే ఇలాంటివి బాగానే చెబుతురులే అని విస్కుంటున్నారా ? లేకపోతే కాఫీ కూడా తాగవద్దంటారా అని కోపానికి పోతున్నారా ? కాఫీ త్రాగే వారు మరియు విమానం కాఫీ ఆర్డర్ చేసే వారిని పరిశీలించిన తరువాత కాఫీ త్రాగపోకవడం మంచిదని తెలిపారు. కాఫీకి డీ హైడ్రషన్ (నిర్జలీకరణ) ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరియు విమానంలో తడి గాలి ఉంటుంది. ఈ రెండింటి వలన తల నొప్పి మరియు వికారం వచ్చే అవకాశాలు ఉన్నాయి.

బర్గర్

బర్గర్

పాశ్చాత్య దేశాల ఆహారం దాదాపు బర్గర్లు పిజ్జాలే అని చెప్పవచ్చు. విభిన్న రంగుల్లో చూడ్డానికి ఆకర్షణీయంగా వెంటనే తినేయాలి అనే స్థాయిలో బర్గర్లను తయారు చేస్తారు. ఇక ఎయిర్‌పోర్ట్‌లలోని స్టాల్స్‌లలో వీటికి కొదవే లేదు. గరిష్ట ఎత్తులో ప్రయాణిస్తున్నపుడు ఇలాంటి పదార్థాలు అస్సలు జీర్ణ అవ్వవు. తద్వారా పొట్ట అసౌకర్యానికి గురవుతుంది. అంతే కాకుండా దీని వలన సిరల్లోని రక్తం గడ్డకట్టే అవకాశం కూడా ఉంది.

విమాన ప్రయాణానికి ముందు తినకూడని ఆహారాలు పదార్థాలు

  • ఇండియా-పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న యుద్ద వాతావరణం....?
  • దీపావళికి ఇంట్రెస్టింగ్ మోడల్‌తో సిద్దమైన యమహా
  • భారతదేశపు రహస్య ఆయుధం కాళీ గురించి ఆసక్తికరమైన విషయాలు

More from DriveSpark

Article Published On: Monday, September 19, 2016, 13:33 [IST]
English summary
Read In Telugu: Things You Must Never Eat Or Drink Before A Flight
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+