డ్రైవింగ్ మధ్యలో బ్రేక్‌లు ఫెయిల్ అయ్యాయా.. ఇలా చేయడం ద్వారా ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు!
కార్లు సహా ఇతర వాహనాల డ్రైవింగ్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. అయితే సక్రమంగా డ్రైవింగ్ చేయడం పెద్ద సవాల్‌తో కూడుకున్నది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా అకస్మాత్తుగా బ్రేక్ ఫెయిల్ (brakes fail) అవుతుంటాయి. ఆ సందర్భంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. బ్రేక్ ఫెయిల్ అయిన సమయంలో అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ప్రమాదాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్ల ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. అయితే బ్రేకులు ఫెయిల్ అయిన సందర్భంలో చాలా మంది డ్రైవర్లు తీవ్ర ఆందోళన చెందుతారు. ఫలితంగా ప్రమాదాలను నియంత్రించే అవకాశాన్ని కోల్పోతారు. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చు లేదా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడొచ్చు.

సమీప వాహనదారులను హెచ్చరించడం : డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అయితే వెంటనే యాక్సిలరేటర్ వేగాన్ని తగ్గించాలి. ఫలితంగా వాహన వేగం తగ్గుతుంది. అనంతరం వాహనం కొంత నియంత్రణలోకి వచ్చాక.. మీ సమీపంలో ఉన్న వాహనదారులను హెచ్చరించండి. హారన్ మోగించడం, హెడ్‌లైట్ల ద్వారా హెచ్చరించవచ్చు,
క్రూయిజ్ కంట్రోల్ టెక్నాలజీ : వాహనాన్ని నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు క్రూయిజ్ కంట్రోల్ టెక్నాలజీ ఉంటే ఆఫ్ చేయాల్సి ఉంటుంది. మరియు గేర్లను కూడా నెమ్మదిగా తగ్గించాలి. దాంతోపాటు ఎమర్జెన్సీ బ్రేకులను ఉపయోగించాలి. అయితే ఈ బ్రేకులు వాహనాన్ని పూర్తిగా నిలపలేకపోయినా.. వాహన వేగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

చివరి అవకాశం : అనంతరం వాహనాన్ని పూర్తిగా నిలిపేసేందుకు చివరి అవకాశంగా ఏదైనా తేలికపాటి వస్తువును ఢీకొట్టవచ్చు. ఫలితంగా వాహనం వేగం గణనీయంగా తగ్గి పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది. అయితే బ్రేకింగ్ ఫెయిల్ అయిన సమయంలో స్టీరింగ్ వీల్‌ను అత్యంత జాగ్రత్తగా ఉపయోగించాలి. వాహన వేగాన్ని నియంత్రించేందుకు ఇతర వస్తువును ఢీకొట్టడం చివరి అవకాశంగా మాత్రమే ఉపయోగించాలి.
పరిస్థితి చేయిదాటిపోయి వాహనాన్ని పూర్తిగా నిలిపి వేసేందుకు అవకాశం లేనప్పుడు, ప్రమాదం జరుగుతుందని భావించినప్పుడు.. శరీరానికి గాయాలు కాకుండా భద్రతా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాళ్ల, చేతులు సహా ముఖానికి గాయాలు కాకుండా షీల్డ్ లాంటివి ఉపయోగించండి. ఫలితంగా ప్రమాదం జరిగినా.. శరీర భాగాలకు గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడొచ్చు.

ప్రస్తుతం అన్ని కార్లలో అత్యాధునిక బ్రేకింగ్ వ్యవస్థ ఉంటోంది. ఫలితంగా బ్రేక్ ఫెయిల్ చాలా అరుదుగా జరుగుతుంది. అయితే బ్రేక్ ఫెయిల్ సమయంలో ఆందోళన చెందకుండా.. పైన చెప్పిన కొన్ని సూచనల ద్వారా వాహన వేగం తగ్గించడం లేదా పూర్తిగా నిలిపేసేందుకు ప్రయత్నం చేయాలి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








