రూ. 70 కోట్లకంటే ఎక్కువ ఖరీదైన నెంబర్ ప్లేట్.. ఒక్కసారైనా చూడాల్సిందే..!!

సాధారణంగా వాహన ప్రియులు తమకు నచ్చిన వాహనాలను లక్షల్లో లేదా కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన సంఘటనలు ఇప్పటికి చాలా చూసాము మరియు అలాంటి సంఘటనల గురించి చదువుకున్నాం.. కూడా. అయితే ఇప్పుడు కార్లు మరియు బైకులకు మాత్రమే కాకూండా, నెంబర్ ప్లేట్లకు కూడా భారీ మొత్తంలో ఖర్చు చేసి వాటిని సొంతం చేసుకుంటున్నారు. ఇలాంటి వాటి గురించి కూడా కొంత మందికి తప్పకుండా తెలిసే ఉంటుంది. కానీ ఇటీవల ఒక నెంబర్ ప్లేట్ వేలం పాటలో ఏకంగా రూ. 70 కోట్లకు పైగా పలికింది అంటే నమ్ముతారా.. తప్పకుండా నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే ఇది నిజం కాబట్టి..

రూ. 70 కోట్ల రూపాయలకు పలికిన ఆ నెంబర్ ఏది, అది ఏ దేశానికీ సంబంధించినది అనే పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

రూ. 70 కోట్లకంటే ఎక్కువ ఖరీదైన నెంబర్ ప్లేట్.. ఒక్కసారైనా చూడాల్సిందే

నివేదికల ప్రకారం ఈ నెంబర్ ప్లేట్స్ కి సంబంధించిన వేలం దుబాయ్ లో 'మోస్ట్ నోబుల్ నంబర్స్' ఛారిటీ ద్వారా నిర్వహించబడింది. ఇందులో కార్లు మరియు ఇతర వాహనాలకు సంబంధించిన నెంబర్ ప్లేట్స్ బిడ్ నిర్వహించారు (వేలం వేశారు). ఇందులో ప్రత్యేకమైన మొబైల్ ఫోన్ నంబర్‌లపై కూడా బిడ్‌ నిర్వహించడం జరిగింది.

రూ. 70 కోట్లకంటే ఎక్కువ ఖరీదైన నెంబర్ ప్లేట్.. ఒక్కసారైనా చూడాల్సిందే

'మోస్ట్ నోబుల్ నంబర్స్' ఛారిటీ నిర్వహించిన ఈ బిడ్ లో 'AA8' సింగిల్-డిజిట్ నంబర్ ఏకంగా 35 మిలియన్ దిర్హామ్‌లకు అమ్ముడైంది. అంటే ఇది మన భారత కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ. 70 కోట్లకు పైమాటే అని చెప్పవచ్చు. అంతకు ముందు సంవత్సరం 'AA9' అనే నెంబర్ ప్లేట్ 38 మిలియన్ దిర్హామ్‌లకు విక్రయించబడింది. అంటే ఇది ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 79 కోట్లకు పైగా ఉంటుంది.

రూ. 70 కోట్లకంటే ఎక్కువ ఖరీదైన నెంబర్ ప్లేట్.. ఒక్కసారైనా చూడాల్సిందే

ఈ వేలం ద్వారా మొత్తం 53 మిలియన్ దిర్హామ్‌లు సేకరించబడ్డాయి. ఈ వచ్చిన మొత్తం డబ్బును ప్రపంచంలోని 50కి పైగా దేశాల్లోని బలహీన వర్గాలకు ఆహారాన్ని అందించడానికి ఉపయోగించనున్నట్లు ఎమిరేట్స్ ఆక్షన్ అండ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ తెలిపింది.

రూ. 70 కోట్లకంటే ఎక్కువ ఖరీదైన నెంబర్ ప్లేట్.. ఒక్కసారైనా చూడాల్సిందే

అంతే కాకుండా దుబాయ్‌లోని ఎమిరేట్స్ ఆక్షన్ అండ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ నిర్వహించిన ఈ వేలంలో రెండు అంకెల దుబాయ్ కార్ నంబర్ ప్లేట్ 'F55' ను 4 మిలియన్ దిర్హామ్‌లకు విక్రయించింది. దీని విలువ భారత కరెన్సీ ప్రకారం రూ. 8.23 ​​కోట్లకంటే ఎక్కువ.

రూ. 70 కోట్లకంటే ఎక్కువ ఖరీదైన నెంబర్ ప్లేట్.. ఒక్కసారైనా చూడాల్సిందే

అదే సమయంలో V66 మరో కార్ నెంబర్ ప్లేట్ కూడా 3.8 మిలియన్ దిర్హామ్‌ల వరకు పలికింది. దీని విలువ రూ. 7.91 కోట్లకంటే కంటే ఎక్కువ (భారత కరెన్సీ ప్రకారం). ఇవన్నీ చూస్తుంటే ప్రపంచంలో కేవలం కార్లు మరియు బైకులకు మాత్రమే కాదు, నెంబర్ ప్లేట్స్ విలువ కూడా భారీగానే ఉందని మనకు స్పష్టంగా తెలుస్తోంది.

రూ. 70 కోట్లకంటే ఎక్కువ ఖరీదైన నెంబర్ ప్లేట్.. ఒక్కసారైనా చూడాల్సిందే

ప్రపంచంలోని సంపన్నదేశాలకు ఏ మాత్రం తీసిపోకుండా మన భారతదేశంలో కూడా నెంబర్ ప్లేట్స్ వేలం భారీ స్థాయిలోనే జరుగుతుంది. ఇటీవల చండీగఢ్ రిజిస్టరింగ్ మరియు లైసెన్సింగ్ అథారిటీ నిర్వహించిన వేలంలో చండీగఢ్‌ కు చెందిన ఓ వ్యక్తి రూ.15.44 లక్షలు బిడ్డింగ్ చేసి ఓ ఫ్యాన్సీ నంబర్‌ను దక్కించుకున్నాడు. అతడు సొంతం చేసుకున్న ఫ్యాన్సీ నెంబర్ 'CH-01- CJ-0001'.

రూ. 70 కోట్లకంటే ఎక్కువ ఖరీదైన నెంబర్ ప్లేట్.. ఒక్కసారైనా చూడాల్సిందే

వివరాలలోకి వెళితే చండీగఢ్‌ కు చెందిన అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్ 'బ్రిజ్ మోహన్' అనే వ్యక్తి, చండీగఢ్ రిజిస్ట్రేషన్ మరియు లైసెన్సింగ్ అథారిటీ నిర్వహించిన వేలంలో అత్యధికంగా రూ.15.44 లక్షలకు బిడ్‌ చేసి ఈ 'CH-01- CJ-0001' ఫ్యాన్సీ నెంబర్ సొంతం చేసుకున్నాడు.

రూ. 70 కోట్లకంటే ఎక్కువ ఖరీదైన నెంబర్ ప్లేట్.. ఒక్కసారైనా చూడాల్సిందే

బ్రిజ్ మోహన్ కొనుగోలు చేసిన ఈ ఖరీదైన ఈ నెంబర్ ప్లేట్ తన హోండా యాక్టివా స్కూటర్‌ కి ఉపయోగించనున్నట్లు తెలిపాడు. ఆ స్కూటర్ ధర కేవలం రూ. 71000 మాత్రమే. ఆల్టై స్కూటర్ కి ఇంత ఖరీదైన నెంబర్ ప్లేట్ ఎందుకని చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు, కానీ తాను భవిష్యత్ లో కొనుగోలు చేసే కారుకి కూడా ఇదే నెంబర్ ప్లేట్ ఉపయోగిస్తానని తెలిపాడు. బ్రిజ్ మోహన్ ఈ సంవత్సరంలో రానున్న దీపావళి సమయంలో కొత్త కారు కొనడానికి ప్లాన్ వేస్తున్నట్లు కూడా తెలిపాడు. కారు కొనుగోలు చేసిన తరువాత ఇది ఆ కారుకి వినియోగిచబడుతుంది. అప్పటి వరకు తన హోండా యాక్టివాలో ఈ నెంబర్ కనిపిస్తుంది.

Most Read Articles

English summary
Third most expensive number plate in the world details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X