వచ్చే నెలలో కొత్త కార్ లేదా బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఈ న్యూస్ మీకోసమే..!

వచ్చే నెలలో మీరు కొత్త కార్ లేదా బైక్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, ఇప్పుడు మీరు మీ వాహనానికి అధిక వాహన బీమా ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు. జూన్ 1, 2022 నుండి థర్డ్ పార్టీ వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం (Third Party Vehicle Insurance Premium) పెరగనుంది. కోవిడ్-19 కారణంగా విధించిన మారటోరియం కారణంగా గత రెండేళ్ల నుంచి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంలో ఎలాంటి మార్పు లేదు. చివరిసారిగా 2019-2020 లో మాత్రమే ఇన్సూరెన్స్ ప్రీమియంను సవరించారు.

వచ్చే నెలలో కొత్త కార్ లేదా బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఈ న్యూస్ మీకోమే..!

ఈ మేరకు ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీతో సంప్రదింపులు జరిపి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పెంచిన ప్రీమియం వివరాలను వెల్లడించింది. ఈ నిర్ణయం తర్వాత, వాహనదారులకు జూన్ 1 నుంచి కార్లు, టూ వీలర్ల ఇన్స్యూరెన్స్ కోసం మరింత ఖర్చు చేయాల్సి రావచ్చు. ఇదివరకు థర్డ్‌ పార్టీ ప్రీమియం రేట్లను భారత బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డిఏఐ) ప్రకటించేది. అయితే, ఇప్పుడు తొలిసారిగా కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఐఆర్‌డీఏఐతో సంప్రదించి ప్రీమియం రేట్ల ను ప్రకటించింది.

వచ్చే నెలలో కొత్త కార్ లేదా బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఈ న్యూస్ మీకోమే..!

ఏయే వాహనాలపై ఎంత మేర ప్రీమియం పెరిగిందంటే..

ద్విచక్ర వాహనాల విషయంలో 75 సీసీ లోపు ఉండే టూవీలర్లకు రూ.538 ప్రీమియం, 75-150 సీసీ టూవీలర్లకు రూ.714 ప్రీమియం, 150-350 సీసీ టూవీలర్లకు రూ.1,366 ప్రీమియం మరియు 350 సీసీ కన్నా ఎక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన టూవీలర్లకు రూ.2,804 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

వచ్చే నెలలో కొత్త కార్ లేదా బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఈ న్యూస్ మీకోమే..!

కార్ల విషయానికి వస్తే, 1000 సీసీ ఇంజన్ సామర్థ్యం కలిగిన ప్రైవేటు కార్ల థర్డ్ పార్టీ ప్రీమియంను రూ.2072 నుండి రూ.2094 (రూ.22 పెంపు)కు పెంచారు. అలాగే, 1000-1500 సీసీ వరకు ఇంజన్ సామర్థ్యం కలిగిన ప్రైవేట్ కార్ల ప్రీమియం ను రూ.3221 నుండి రూ.3416 (రూ.195 పెంపు)కు పెంచారు. ఇకపోతే, 1500 సీసీ కంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన కార్ల యొక్క థర్డ్ పార్టీ ప్రీమియంను రూ.7890 నుండి రూ.7897 (రూ.7 పెంపు)కి పెంచారు.

వచ్చే నెలలో కొత్త కార్ లేదా బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఈ న్యూస్ మీకోమే..!

ఇక ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే, 30KW కంటే తక్కువ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ ప్రైవేట్ కార్లకు థర్డ్ పార్టీ బీమా ప్రీమియంను రూ.1,780 గా నిర్ణయించగా, 30KW - 60KW బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ ప్రైవేట్ కార్లకు రూ.2,904 ప్రీమియంగా నిర్ణయించారు. చివిరగా వాణిజ్య వాహనాల విషయానికి వస్తే, 1200 కిలోల నుండి 20,000 కిలోల లోడ్ సామర్థ్యం కలిగిన కమర్షియల్ వెహికిల్స్ కి థర్డ్ పార్టీ బీమా ప్రీమియం రూ.33,414 నుండి రూ.35,313కు పెంచగా, 40,000 కిలోల కంటే అధిక లోడ్ సామర్థ్యం కలిగిన కమర్షియల్ వెహికిల్ ప్రీమియం ను రూ.41,561 నుండి రూ.44,242కు పెంచారు.

వచ్చే నెలలో కొత్త కార్ లేదా బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఈ న్యూస్ మీకోమే..!

వీటికి మాత్రమే డిస్కౌంట్.

కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం, హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలకు చెల్లించే ప్రీమియంలో 7.5 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. అలాగే, విద్యా సంస్థలు ఉపయోగించే బస్సులకు 15 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్టు ఈ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా, వింటేజ్‌ కారు (పురాతన కారు)కు, రిజిష్టర్‌ అయ్యే ప్రైవేటు కారుకు ప్రీమియంలో 50 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది.

వచ్చే నెలలో కొత్త కార్ లేదా బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఈ న్యూస్ మీకోమే..!

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు ఏమిటి?

సాధారణంగా, వాహనం ద్వారా ప్రమాదం జరిగినప్పుడు ఇతర వాహనాలకు లేదా థర్డ్ పార్టీకి జరిగే నష్టాన్ని కవర్ చేయడానికి ఈ థర్డ్ పార్టీ కవర్ చేస్తుంది. ప్రతి వాహనానికి వ్యక్తిగత భీమా ఉన్నా లేకపోయినా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండటం అనేది మోటార్ వాహన చట్టం ప్రకారం తప్పనిసరి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలను నడపడం చట్టరీత్యా నేరం. అంతేకాకుండా, ఇలా ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడపడం వలన ప్రమాదవశాత్తు జరిగే నష్టాన్ని కవర్ చేయడానికి డ్రైవర్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

వచ్చే నెలలో కొత్త కార్ లేదా బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఈ న్యూస్ మీకోమే..!

వాహనదారులు తమ కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు, సదరు వాహన యజమాని ఇతర వాహనాల డ్యామేజ్ క్లెయిమ్‌లను తీర్చడానికి గాను తప్పనిసరిగా థర్డ్ పార్టీ బీమా ను కొనుగోలు చేయాలి. ఈ బీమాను నేరుగా షోరూమ్ నుండి కానీ లేదా ఏదైనా అధీకృత ఇన్సూరెన్స్ కంపెనీ నుండి కానీ కొనుగోలు చేయవచ్చు. రోడ్డు ప్రమాదం కారణంగా మన వాహనం వలన మూడవ పక్షానికి, సాధారణంగా ఒక వ్యక్తికి లేదా అతని వాహనానికి జరిగే ఏదైనా నష్టాన్ని ఈ బీమా కవర్ చేస్తుంది.

వచ్చే నెలలో కొత్త కార్ లేదా బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఈ న్యూస్ మీకోమే..!

కాంపర్హెన్సివ్ పాలసీ తీసుకుంటే, ఇరు పార్టీలకు బెనిఫిట్..

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాకుండా, కాంపర్హెన్సివ్ ఇన్సూరెన్స్ (సమగ్ర బీమా) పాలసీ తీసుకున్నట్లయితే, అది ఇరు పార్టీలకు లబ్ధి చేకూరుస్తుంది. అంటే, మన తప్పిదం వలన మన వాహనానికి జరిగే నష్టంతో పాటుగా ఇతరుల వాహనాలకు లేదా వ్యక్తులకు జరిగే నష్టాలన్నింటినీ ఈ పాలసీ కవర్ చేస్తుంది. సాధారణంగా, ఇది థర్డ్ పార్టీ ప్రీమియం కన్నా అధికంగా ఉంటుంది. కాంపర్హెన్సివ్ ఇన్సూరెన్స్ తప్పనిసరేమి కాదు, కానీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రం తప్పనిసరి. మీ వాహనానికి కాంపర్హెన్సివ్ పాలసీ లేకపోయినట్లయితే, మీ తప్పిదం వలన మీ కారుకు జరిగే నష్టాన్ని మీరే భరించాల్సి ఉంటుంది.

Most Read Articles

English summary
Third party vehicle insurance premium to be increased from june 1st 2022 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X