ఏప్రిల్ 1, 2022వ తేదీ నుండి పెరగనున్న థర్డ్ పార్టీ వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం

కొత్త ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 1, 2022వ తేదీ నుండి) వివిధ విభాగాలకు చెందిన వాహనాల థర్డ్ పార్టీ మోటర్ వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెరగనుంది. థర్డ్ పార్టీ మోటారు వాహనాల బీమా ప్రీమియంను పెంచాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదిత సవరించిన రేట్ల ప్రకారం, 1000 సీసీ ప్రైవేట్ కార్ల థర్డ్ పార్టీ బీమా ప్రీమియం రూ. 2,072 నుంచి రూ. 2,094 కి పెరిగే అవకాశం ఉంది.

ఏప్రిల్ 1, 2022వ తేదీ నుండి పెరగనున్న థర్డ్ పార్టీ వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం

అదేవిధంగా, 1,000 సీసీ నుండి 1,500 సీసీ వరకు ఇంజన్ సామర్థ్యం కలిగిన ప్రైవేట్ కార్ల యజమానులు ఇకపై రూ. 3,221 కి బదులుగా రూ. 3,416 చొప్పున థర్డ్ పార్టీ బీమా ప్రీమియంను చెల్లించాల్సి రావచ్చు. అలాగే, 1,500 సీసీ కంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన కార్ల యజమానులు రూ.7,890కి బదులుగా రూ.7,897 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

ఏప్రిల్ 1, 2022వ తేదీ నుండి పెరగనున్న థర్డ్ పార్టీ వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం

ఇక ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే, 150 సీసీ నుంచి 350 సీసీ మధ్య ఇంజన్ సామర్థ్యం కలిగిన వాహనాలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం రేటు రూ.1,366 వరకూ ఉంటుంది. అలాగే, 350 సీసీ కంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలకు సవరించిన ప్రీమియం రేటు రూ. 2,804 గా ఉంటుంది. కరోనా మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాల ఆలస్యంతో కొత్త ప్రీమియం రేట్లు అమలు చేయబడుతున్నాయి.

ఏప్రిల్ 1, 2022వ తేదీ నుండి పెరగనున్న థర్డ్ పార్టీ వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం

బీమా నియంత్రణ సంస్థ IRDAI ఈ థర్డ్ పార్టీ రేట్ల వివరాలను తెలియజేసింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, బీమా నియంత్రణ సంస్థతో సంప్రదించి థర్డ్ పార్టీ మోటారు వాహనాల బీమా రేట్లను తెలియజేయడం కూడా ఇదే తొలిసారి. ఈ నోటిఫికేషన్ ప్రకారం, ఎలక్ట్రిక్ ప్రైవేట్ కార్లు, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలు మరియు ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలపై 15 శాతం తగ్గింపు ప్రతిపాదించబడింది.

ఏప్రిల్ 1, 2022వ తేదీ నుండి పెరగనున్న థర్డ్ పార్టీ వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం

అనుకోని పరిస్థితుల్లో మోటార్ వాహనం ప్రమాదానికి గురైనప్పుడు, ఆ సమయంలో ఇతర వాహనాలకు జరిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు థర్డ్ పార్టీ బీమా సహకరిస్తుంది. ఇది ప్రతి మోటార్ వాహనానికి తప్పనిసరిగా ఉండాల్సిన బీమా కవరేజ్ పాలసీ. వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు, వాహన యజమాని తన స్వంత డ్యామేజ్ కవర్‌తో పాటు ఇతర వాహనాల డ్యామేజ్ క్లెయిమ్‌ను తీర్చడానికి థర్డ్ పార్టీ బీమా కవర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో, మార్చి 14 వరకు ప్రభావితం అయ్యేలా అన్ని వాటాదారుల నుండి మంత్రిత్వ శాఖ సూచనలను కోరింది.

ఏప్రిల్ 1, 2022వ తేదీ నుండి పెరగనున్న థర్డ్ పార్టీ వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం

బీమాలు ఎన్ని రకాలు?

మోటార్ వాహన చట్టం ప్రకారం, రోడ్డుపై తిరిగే ప్రతి మోటార్ వాహనానికి తప్పనిసరిగా బీమా (ఇన్సూరెన్స్) ఉండాలి. సరైన వాహన ఇన్సూరెన్స్ లేకుండా సదరు వాహనాన్ని నడపటం చట్టరీత్యా నేరం. ఈ మోటార్ ఇన్సూరెన్స్ లో రెండు రకాలు ఉంటాయి. వీటిలో ఒకటి సమగ్ర బీమా లేదా కాంపర్హెన్సివ్ ఇన్సూరెన్స్ మరొకటి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. ఇందులో సమగ్ర బీమాలో కస్టమర్ వాహనానికి మరియు థర్డ్ పార్టీ వాహనానికి రెండింటికీ బీమా వర్తిస్తుంది. కేవలం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకుంటే, కస్టమర్ స్వంత వాహనానికి బీమా లభించదు, కానీ థర్డ్ పార్టీ వాహనానికి మాత్రం బీమా వర్తిస్తుంది.

ఏప్రిల్ 1, 2022వ తేదీ నుండి పెరగనున్న థర్డ్ పార్టీ వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం

సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా బీమా వర్తించదు..

మోటార్ వాహనాల చట్టం 1988 లోని సెక్షన్ 3 మరియు 5 ప్రకారం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం చట్టం ప్రకారం నేరం. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేనట్లయితే, బీమా కంపెనీలు వాహన ప్రమాద క్లెయిమ్‌ను తిరస్కరించవచ్చు. అలాగే, సెక్షన్ 39 మరియు సెక్షన్ 192 ప్రకారం, చెల్లుబాటు అయ్యే వాహన రిజిస్ట్రేషన్ లేకుండా సదరు వాహనాన్ని నడపటం కూడా చట్టరీత్యా నేరం. కాబట్టి, బీమా కవరేజ్ పాలసీని క్లెయిమ్ చేయాలంటే, తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ మరియు చెల్లుబాటు అయ్యే వాహన రిజిస్ట్రేషన్ కూడా ఉండాలి.

More from DriveSpark

Article Published On: Tuesday, March 8, 2022, 9:34 [IST]
English summary
Third party vehicle insurance premium to cost more from next fiscal details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+