రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కొత్త కారు ఇదేనా?
రష్యా దేశ అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కోసం ఓ సరికొత్త లీమోజైన్ కారును అభివృద్ధి చేసేందుకు ఆ దేశ సర్కారు యోచిస్తోందని, ఇందుకోసం కొన్ని ఆటోమోటివ్ డిజనర్ల నుంచి కొత్త డిజైన్లను ఆహ్వినించడం గురిండి గడచిన మార్చ్ నెలలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే.
రష్యాకు చెందిన కార్ల తయారీ కంపెనీ మారష్యా మోటార్స్ మరియు ఆన్‌లైన్ ఆటోమొబైల్ డిజైన్ కంపెనీ కార్‌డిజైన్ డాట్ రష్యాలు కంపెనీలు పుతిన్ కోసం ఓ అధునాతన కారును డిజైన్ చేసేందుకుగాను 'అధ్యక్షుడి కోసం ఓ కారు' అనే కాంటెస్ట్‌ను నిర్వహించాయి. ఈ కాంటెస్ట్‌కు వందకు పైగా డిజైన్లు వచ్చాయి.
కాగా.. ఈ కాంటెస్ట్ ఇటీవలే ముగిసింది. ఇందులో యారోస్లావ్ యాకోవ్లెవ్, బెర్నాండ్ వీల్ లను విజేతలుగా ప్రకటించారు. వీరు రూపొందించిన కారును పుతిన్ అధికారిక కారు డిజైన్ కోసం పరిగణించారు. ఈ విషయంపై రష్యా సర్కారు నుంచి అధీకృత నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది. అది వెల్లడైన తక్షణమే ఈ కారును ప్రొడక్షన్ దశకు తీసుకువెళ్లే ఆస్కారం ఉంది.
మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‍లో పరిశీలించండి.

కాంటెస్ట్
మారష్యా మోటార్స్, ఆన్‌లైన్ ఆటోమొబైల్ డిజైన్ కంపెనీ కార్‌డిజైన్ డాట్ రష్యాలు కంపెనీలు పుతిన్ కోసం ఓ అధునాతన కారును డిజైన్ చేసేందుకుగాను 'అధ్యక్షుడి కోసం ఓ కారు' అనే కాంటెస్ట్‌ను నిర్వహించాయి. ఈ కాంటెస్ట్‌కు వందకు పైగా డిజైన్లు వచ్చాయి.

కాంటెస్ట్ విజేతలు
ఈ కాంటెస్ట్ ఇటీవలే ముగిసింది. ఇందులో యారోస్లావ్ యాకోవ్లెవ్, బెర్నాండ్ వీల్ లను విజేతలుగా ప్రకటించారు.

కాన్సెప్ట్ పేరు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కోసం రూపొందించిన ఈ కాన్సెప్ట్ కారు పేరు జిల్ ప్రెసిడెన్షియల్ లీమో కాన్సెప్ట్ కారు.

కాన్సెప్ట్ డిజైన్‌కు పట్టిన సమయం
యారోస్లావ్ యాకోవ్లెవ్, బెర్నాండ్ వీల్‌లు మూడు వారాలు శ్రమించి ఈ కాన్సెప్ట్ కారును డిజైన్ చేశారు.

పొడవాటి బానెట్
ఈ కాన్సెప్ట్ కారు ఫ్రంట్ డిజైన్ రోల్స్ రాయిస్ కార్ల డిజైన్ నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసినట్లుగా ఉంటుంది.

రియర్ డిజైన్
జిల్ ప్రెసిడెన్షియల్ లీమో కాన్సెప్ట్ కారు ఫ్రంట్ డిజైన్ ఆకర్షనీయంగా ఉంటుంది. అయితే రియర్ డిజైన్ మాత్రం కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.

గ్రీన్ సిగ్నల్ లభిస్తే ప్రొడక్షన్ దశకు
ఈ అధ్యక్ష కారుకు రష్యా సర్కారు నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే, ఇది ఉత్పత్తి దశకు చేరుకునే అవకాశం ఉంది.

రియర్ డిజైన్ క్లోజప్
రియర్ డిజైన్ క్లోజప్
వీడియో
అధ్యక్ష కారు వీడియో


Click it and Unblock the Notifications