రోజుకు రెండు సార్లు నీట మునిగే ఫ్రాన్స్‌లోని రహదారి

Written By:

మానవుల ప్రమేయం లేకుండా ప్రకృతి చేసే మ్యాజిక్‌లలో ఇది ఒకటి అని చెప్పవచ్చు. ఫ్రాన్స్‌లోని ఒక రహదారిలో రోజుకు రెండు సార్లు మాత్రమే ప్రయాణించే వీలుంది. మిగతా సమయంలో సుమారుగా 13 అడుగుల మేర ఆ రహదారి సముద్రంలోకి మునిగిపోతుంది.

మీరు చదివినది అక్షరాల నిజమే. ఈ రహదారి పేరు పాసేజ్ డ్యు గోయిస్. దీనిని గల్ఫ్‌లోని బర్నెఫ్ మరియు ఫ్రాన్స్‌లోని Noirmoutier అనే ద్వీపాన్ని కలుపుతూ సముద్రం మధ్యలో నిర్మించారు.

ఈ రహదారి మీద రోజుకు రెండు సార్లు అది కొన్ని గంటల పాటు మాత్రమే ప్రయాణించవచ్చు. మిగతా సమయం అంతా ఈ రహదారిని సముద్రం జలం కప్పేస్తుంది.

ఈ రహదారి కనబడకుండా సుమారుగా 13 అడుగుల మేర సముద్రం కప్పేస్తుంది.

బర్నెఫ్ మరియు Noirmoutier అనే రెండు ప్రాంతాలను కలిపే ఈ రహదారిని 1701 కాలంలోన్ నిర్మించిట్లు తెలిసింది.

తరువాత చిత్ర పటంలో ఇది గుర్తింపు పొందిన తరువాత 1840 నుండి ఈ రెండు ప్రాంతాలను కలిపే ఈ రహదారి గుండా గుర్రాల ద్వారా సేవలు ప్రారంభమయ్యాయి.

ప్రస్తుతం పాసేజ్ డ్యు గోయిస్ రహదారి పొడవు 2.58 మైళ్లు అంటే 4.16 కిలోమీటర్లుగా ఉంది.

కొద్ది కొద్దిగా అలలు ఈ రహదారిని ముంచేస్తున్నప్పుడు రహదారి కనుమరుగవడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో రహదారికి మధ్యలో ఉన్నపుడు ప్రమాదానికి గురి కాకుండా ఇరువైపులా చిన్నపాటి స్తంభాలను నిర్మించారు.

రహదారి మీద నీటి మట్టం పెరిగే కొద్ది ప్రవాహం పెరిగి కొట్టుకుపోయే సందర్భాలు కూడా చోటు చేసుకుంటాయి. ఇలాంటప్పుడు ఆపద నుండి రక్షించడానికి అక్కడే రెస్క్యూ సిబ్బంది కూడా ఉంటుంది.

సహజ సిద్దంగా జరిగే చర్యలను తిలకించడానికి పర్యాటకులు ఎక్కువగానే వస్తుంటారు. తద్వారా ఇది ప్రపంచ పర్యాటక క్షేత్రంగా నిలిచింది. మీరు కనుక ఇక్కడి వెలుతుంటే తగు జాగ్రత్తలు తీసుకోండి.

  

English summary
Read In Telugu:This crazy road in France disappears underwater twice a day
Story first published: Thursday, September 22, 2016, 12:43 [IST]
Please Wait while comments are loading...

Latest Photos