ప్రపంచంలో ఇది ఒక వింత...నౌకల్ని మోస్తున్న నౌకలు

By Anil

భూమి మీద ఒఖ చోట నుండి మరొక చోటుకు సరుకు రవాణా చేయడానికి గల రవాణా మార్గాల రోడ్డు, రైలు, వాయు మరియు నీటి మార్గాల ద్వారా రవాణా చేస్తుంటాం. కాని పెద్ద ఎత్తున సరుకును దేశాలు, ఖండాలు దాటి రవాణా చేయడానికి నీటి మార్గం ఎంతో అనువుగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో విస్తారమైన సాధనాలు అందుబాటులో ఉన్నాయి.
Also Read: వయాసిస్ ఆఫ్ ది సీస్ - ఫన్ ఫ్యాక్ట్స్ (పూర్తి చిత్రాలతో..)

ఈ కారణంగా ఇప్పుడు అనేక పెద్ద నౌకలు ఊపిరిపోసుకుంటున్నాయి. ముఖ్యంగా సరుకు రవాణా కోసం అనేక పెద్ద ఓడలను తయారు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ పెద్ద ఓడలను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి కార్గో షిప్పులను ఉపయోగించి రవాణా చేస్తున్నారు. ఇతర నౌకలు వాటిని మోసుకెల్లడం ప్రపంచంలో ఒక వింతం అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద కార్గో షిప్‌లను రవాణా చేస్తున్న నౌకల గురించి క్రింది గల కథనాల ద్వారా తెలుసుకుందాం రండి.

షిప్పింగ్ వివరాలు

షిప్పింగ్ వివరాలు

సముద్ర జలాల్లో ముడి చమురు అన్వేషణకు వీటిని ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు. వీటి ద్వారా క్రూడ్ ఆయిల్ మరియు ఇతర విలువైన ఖనిజాల అన్వేషణలో ఈ భారీ నౌకలు ఉపయోగపడుతున్నాయి. ఇందులో అతి పెద్ద సరుకు రవాణా నౌకలు రెండు ఉన్నాయి. అవి యమ్‌‌వి బ్లూ మార్లిన్ మరియు యమ్‌వి బ్లాక్ మార్లిన్ అను రెండు నౌకలు నిర్మించబడ్డాయి. బ్లాక్ మార్లిన్ క్రింద గల నౌకను 1999 లో నిర్మించారు మరియు బ్లూ మార్లిన్ పైన ఉండే నౌకను 2000 లో నిర్మించారు.

నిర్వహణ సంస్థ

నిర్వహణ సంస్థ

ఈ రెండు నౌకలు ఓస్లో నగరానికి చెందిన నార్వేఆఫ్‌షోర్ రవాణా సంస్థ నిర్వహిస్తు ఉండేది. అయితే 2001 సంవత్సరంలో నెదర్లాండ్స్‌కు చెందిన కార్గో రవాణా సంస్థ ఒకటి వీటిని కొనుగోలు చేసింది.

ఫార్మాట్

ఫార్మాట్

ఈ రెండు అతి పెద్ద నౌకలు ద్వారా భారీ సరుకులను లోడ్ మరియు అన్‌లోడ్ చేయడం ఎంతో సులభంగా ఉంటుంది. నౌకాశ్రయాల్లో అతి పెద్ద బ్లాక్‌లను ఇందులోకి షిఫ్ట్ చేయడం దీనికి ఏ మాత్రం శ్రమ కాదు. అనగా మొత్తం మీద దీని ద్వారా సరుకు రవాణా చేయడం ఏ మాత్రం రిస్క్‌తో కూడుకున్నది కాదు అని అర్థం.

Photo credit: Ryan C. McGinley, US Navy

జలాంతర్గామి వంటి సదుపాయాలు.

జలాంతర్గామి వంటి సదుపాయాలు.

ఇందులో ఓడ మునిగిపోయినట్లు ఉంటుంది. కాని అలా మునిగి ఉండదు దీనిని ప్రత్యేకంగా ఇలా రూపొందించారు. నౌక ప్రయాణాన్ని మొదలు పెట్టినపుడు కొంచెం మునిగి ఉండటం వలన ఇది జలాంతర్గామిలా ప్రయాణిస్తుంది. దీని వలన ఇది శాస్వతంగా మునిగిపోయే అవకాశాలు చాలా తక్కువ.

నౌక మీద నౌకలు

నౌక మీద నౌకలు

కొత్త నౌకలను ఒత చోట నుండి మరొక చోటుకు తరలించడం ఎంతో సులభం. క్రింద గల నౌకను బ్లాక్ మార్లిన్ అంటారు అని తెలుసుగా, ఈ బ్లాక్ మార్లిన్‌లో వెసల్ అనే పరకరాన్ని ఏర్పాటుచేయడం ద్వారా ఇది అలలను సృష్టింస్తుంది. సగం నీటిలో మునిగి ఉండటం వలన ఇది బ్లూ మార్లిన్ నౌక సువభంగా ముందుకు కదలడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

యుద్ద నౌక

యుద్ద నౌక

ఆల్‌ఖైదా తీవ్రవాదులు యునైటెడ్ స్టేట్స్‌లో గల యుయస్‌యుస్ కోల్ యుద్ధ నౌక మీద టార్గెట్ చేసి దాని మీద ఆత్మాహుతి దాడులు చేసి తీవ్రంగా ద్వసం చేశారు. తరువాత ఆప్షోర్ సంస్థ ఈ బ్లూ మెర్లిన్ నౌకను యుయస్ కోసం అద్దెకు తీసుకుంది.

Photo Credit: LTJG Chuck Bell,United States Navy.

సాహస ప్రయాణాలు

సాహస ప్రయాణాలు

ఈ నౌకలో అత్యంత భారీ పెద్ద యంత్రాలను షిప్పింగ్ చేస్తారు. అంతే కాకుండా యునైటెడ్ స్టేట్స్ లోని టెక్సాస్ నుండి అలస్కా వరకు యక్స్-బ్యాండ్ రాడార్ అని పిలువబడే అతి భారీ నౌకను 2005 లో మోసుకుంటూ వెల్లింది. దాదాపుగా ఇది 60,000 టన్నుల బరువు ఉంటుంది.

ప్రముఖ టివి

ప్రముఖ టివి

2005లో గ్రాండ్ స్నోవిట్ గ్యాస్ శుద్ధీకరణ సౌకర్యాలను బ్లూ మార్లిన్ లో ఇన్ట్సాల్ చేస్తుండగా. అక్కడ ఇంజనీరింగ్ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని ఒక డిస్కవరీ ఛానల్ పూర్తిగా చిత్రీకరించి ప్రసారం చేసింది.

నౌక పరిమాణం

నౌక పరిమాణం

ఈ అతి పెద్ద నౌక నీటి మట్టం నుండి 33 అడుగులు లోపలికి మునిగి ఉంటుంది, నీటి మట్టం నుండి 44 అడుగులు ఎత్తులో ఉంటుంది, 138 అడుగులు వెడల్పు మరియు 712 అడుగులు పొడవు ఉంటుంది.

ఇంజన్

ఇంజన్

ఈ అతి పెద్ద నౌకలో దాదాపుగా 16,950 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేయగల ఇంజన్ కలదు. మరియు ఇది గంటకు 26.9 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది మరియు దీనిలో ఒక సారి ఇంధనాన్ని నింపితే దాదాపుగా 46,000 కిలోమీటర్లు దూరం ప్రాయాణిస్తుంది.

ఉద్యోగుల సౌకర్యాలు

ఉద్యోగుల సౌకర్యాలు

ఇందులో దాదాపుగా 38 క్యాబిన్లు ఉన్నాయి. ఇందులో 60 మంది ఉద్యోగులు పని చేస్తుంటారు. అయితే ఇందులో పని చేసే ఉద్యోగులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి అని కొన్ని వ్యూహాలు నౌక నిర్వహణా బోర్డు వారికి సూచించింది.

ప్రపంచంలో ఇది ఒక వింత
  1. గోవాలో ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌకను సందర్శించిన మోడీ
  2. ఫొటోలు: చిత్ర విచిత్రమైన యాక్సిడెంట్స్..

Most Read Articles

English summary
This Giant Ship That Ships Other Ships
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X