ఔరా.. 19 ఏళ్ల చిన్నది Royal Enfield బైక్ రిపేర్ చేస్తుంది.. వీడియో చూసారా..!!

ఈ రోజు మార్కెట్లో ఎన్నో, ఎన్నెన్నో బైకులు ఆధునిక డిజైన్ కలిగి, లేటెస్ట్ ఫీచర్స్ తో విడుదలవుతున్నాయి. కానీ కేవలం దేశీయ మార్కెట్లో మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్లో కూడా తిరుగులేని బైక్ బ్రాండ్ గా ఈ రోజుకి ప్రజాదరణ పొందుతున్న బైక్స్ Royal Enfield. Royal Enfield యువ రైడర్లను ఆకర్శించడంలో విజయం సాధిస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీ కొత్త 2021 Royal Enfield Classic 350 బైక్ విడుదల చేసింది. ఈ బైక్ ప్రస్తుత తరానికి ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉంటుంది.

ఔరా.. 19 ఏళ్ల చిన్నది Royal Enfield బైక్ రిపేర్ చేస్తుంది.. వీడియో చూసారా..!!

ఇదిలా ఉండగా Royal Enfield వినియోగించడానికి ఎంత అనుకూలంగా ఉంటాయి. ఒక వేళా ఏదైనా రిపేర్ వస్తే, బాగా ప్రావీణ్యం ఉన్న మరియు అనుభవం ఉన్న మెకానిక్స్ వీటిని బాగు చేస్తారు. అయితే ఒక 19 సంవత్సరాల వయసున్న ఒక యువతి Royal Enfield బైక్ ని అవలీలగా రిపేర్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం..

ఔరా.. 19 ఏళ్ల చిన్నది Royal Enfield బైక్ రిపేర్ చేస్తుంది.. వీడియో చూసారా..!!

నివేదికల ప్రకారం ఈ సంఘటన కేరళలో జరిగినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన వీడియో MediaoneTV Live అనే YouTube ఛానెల్‌లో అప్లోడ్ చేయబడింది. ఈ వీడియోలో ఆ యువతి బైక్ రిపేర్ చేయడం చూడవచ్చు.

ఔరా.. 19 ఏళ్ల చిన్నది Royal Enfield బైక్ రిపేర్ చేస్తుంది.. వీడియో చూసారా..!!

ఈ వీడియోలో కనిపించే అమ్మాయి పేరు 'దియా'. ఈమె కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన యువతి. ఈ అమ్మాయి తమ వర్క్‌షాప్‌లోనే తన తండ్రితో పాటు Royal Enfield మోటార్‌సైకిళ్లను రిపేర్ చేస్తుంది. ఈ అమ్మాయికి రిపేర్ చేయడంపై కలిగించాడు.

ఔరా.. 19 ఏళ్ల చిన్నది Royal Enfield బైక్ రిపేర్ చేస్తుంది.. వీడియో చూసారా..!!

దియా తండ్రికి మోటార్‌సైకిల్ రిపేర్ వర్క్‌షాప్ ఉంది, అతను స్వయంగా Royal Enfield మోటార్‌సైకిళ్లను రిపేర్ చేయడంలో ప్రత్యేకత కలిగి ఉన్నాడు. దియా 10 వ తరగతి తర్వాత సెలవులో, వర్క్‌షాప్‌లో ఆమె తండ్రికి సహాయం చేస్తూ, తాను కూడా Royal Enfield బైకులు రిపేర్ చేయడం నేర్చేసుకుంది.

ఔరా.. 19 ఏళ్ల చిన్నది Royal Enfield బైక్ రిపేర్ చేస్తుంది.. వీడియో చూసారా..!!

ప్రస్తుతం దియా తనకు తానె Royal Enfield బైక్స్ రిపేరు చేస్తుంది. ఇదంతా తన తండ్రి సహకారంతో మాత్రమే సాధ్యమయ్యిందని దియా స్వయంగా తెలిపింది. దియా Royal Enfield బైక్స్ రిపేర్ చేయడంతో చుట్టుపక్కల ప్రజలు కూడా ఆశర్యపోతున్నారు. ఏది ఏమైనా పట్టుదలతో అనుకుంటే ఏదైనా సాధించవచ్చని దియా మరొక్క సారి ఋజువు చేసింది.

ఔరా.. 19 ఏళ్ల చిన్నది Royal Enfield బైక్ రిపేర్ చేస్తుంది.. వీడియో చూసారా..!!

Royal Enfield బైకులను కేవలం పురుషులు మాత్రమే కాకుండా మహిళలు కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీనికి నిదర్శనంగా ఇప్పటికే చాలా సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. దియా కి కూడా Royal Enfield థండర్‌బర్డ్‌ బైక్స్ అంటే ఇష్టమని తెలిపింది. అంతే కాకుండా రెట్రో డిజైన్ మరియు బుల్లెట్ సిగ్నేచర్ ఎగ్సాస్ట్ నోట్ మోటార్ సైకిళ్ల పట్ల ఆకర్షితులవడానికి కారణమని తెలిపింది. దియా తాను వ్యక్తిగతంగా Royal Enfield థండర్‌బర్డ్‌ ఇష్టపడటానికి ప్రధాన కారణం అందులో ఉన్న సీటింగ్ పొజిషన్ అని తెలిపింది.

Royal Enfield కంపెనీ ఇటీవల విడుదల చేసిన కొత్త Classic 350 బైక్ విషయానికి వస్తే, దీని ధర రూ. రూ .1.84 లక్షల నుండి 2.15 లక్షల వరకు ఉంది. ఇది Redditch, Halcyon, Signals, Dark మరియు Chrome అనే 5 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా ఆధునికంగా ఉంటుంది.

ఔరా.. 19 ఏళ్ల చిన్నది Royal Enfield బైక్ రిపేర్ చేస్తుంది.. వీడియో చూసారా..!!

కొత్త 2021 Royal Enfield Classic 350 బైక్ 349 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20.3 బిహెచ్‌పి పవర్ మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. ఇది మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది.ఈ బైక్ క్రోమ్ రెడ్, డార్క్ స్టీల్త్ బ్లాక్, సిగ్నెల్స్ మార్స్ గ్రే, హాల్సియన్ గ్రీన్ మరియు రెడ్డిచ్ గ్రీన్ మొదలైన కలర్స్ లో అందుబాటులో ఉంటుంది.ఈ కొత్త Royal Enfield Classic 350 బైక్ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Image Courtesy: MediaoneTV Live

Most Read Articles

English summary
This girl from kerala diya expert in repairing royal enfield bikes details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X