ఈ బైక్ తో చెట్లను సులభంగా ఎక్కవచ్చు.. ధర 1 లక్ష 12 వేలు మాత్రమే
సాధారణంగా కొందరి వ్యక్తుల వినూత్న ఆలోచనలు ఎన్నో మంచి కార్యాలకు శ్రీకారం చుడతాయి. వారి మెదడులో పుట్టిన ఆలోచన, దాని అమలు కోసం వారు నిరంతరం శ్రమిస్తారు. వారు తలపెట్టిన కార్యానికి ప్రతిఫలం దక్కేవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. అలా ఓ వ్యక్తి నుంచి ఆజ్యం పోసుకున్న ఓ సరికొత్త పరికరం గురించి ఇక్కడ తెలుసుకుందాం.
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్ కు చెందిన కోమలే గణపతి భట్ 2019లో అరకెన్ (ఈత రకం) చెట్టుపైకి త్వరగా ఎక్కేందుకు ఉపయోగపడే ఓ పరికరాన్ని రూపొందించాడు. ఇది అప్పట్లో వ్యాపార దిగ్గజం మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా దృష్టిని కూడా ఆకర్షించింది. దీనిపై ఆయన చేసిన ట్వీట్ ద్వారా గణపతి తయారు చేసిన పరికరం వెలుగులోకి వచ్చింది.

సులభంగా ఎక్కేయొచ్చు..
అనంతరం తాను తయారు చేసిన ఈ సరికొత్త 'ట్రీ బైక్'ని జనాలకు ఉపయోగపడాలని గణపతి నిర్ణయించుకున్నాడు. కేవలం దీన్ని డిజైన్ కు మాత్రమే పరిమితం చేయకుండా అందరికి ఉపయోగపడేలా ఈ ట్రీ బైక్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో అనేక ప్రయోగాలు చేశాడు. మొత్తానికి సక్సెస్ సాధించాడు.
దీనిపై అతను మాట్లాడుతూ.. ఈ పరికరం ఇతర చెట్లను కూడా ఎక్కడానికి సహాయపడగలదా అని జనాలు అడిగేవారని అన్నారు. అందుకోసం స్వతహాగా తనే చాలా ట్రయల్స్ వేశాడని చెప్పాడు. అనంతరం కొంతమంది నిపుణులతో సంప్రదించి, ఈ కొత్త వెర్షన్ ను ముందుకు తీసుకువచ్చినట్లు వివరించాడు. ప్రస్తుతం ఈ పరికరాన్ని ఉపయోగించి పొడవైన చెట్లను మాత్రమే కాకుండా మిగతా చెట్లను కూడా ఎక్కవచ్చు.

45 కిలోల బరువు..
51 ఏళ్ల వయస్సు ఉన్న గణపతి కొత్త ఆవిష్కరణ రైతులకు ఒక వరంగానే చెప్పవచ్చు. ఈ కొత్త 'ట్రీ బైక్' 45 కిలోల బరువున్నప్పటికీ ట్రాలీ లేదా ఇతర వాహనాలపై సులభంగా రవాణా చేయవచ్చు. ఈ సరికొత్త బైక్ పెట్రోల్ తో నడుస్తుంది. కేవలం 1 లీటర్ పెట్రోల్ తో కనీసం 70 నుండి 80 చెట్లను ఎక్కవచ్చు. 5 నుండి 15 అంగుళాల మందం ఉన్న చెట్లపై బైక్ ను ఉపయోగించవచ్చు. అంటే ఎంత పెద్ద పొడవైన చెట్లను అయినా ఈజీగా ఎక్కేయోచ్చు అన్నమాట.
ఈ బైక్ లో చెప్పదగిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇది 360 డిగ్రీల కోణంలో తిరుగుతుంది. అందువల్ల సులభంగా ఎటు అంటే అటు తిరిగితూ చెట్లను సులభంగా ఎక్కవచ్చు. అరెకనట్, కొబ్బరి చెట్లతో పాటు, మామిడి, జాక్‌ఫ్రూట్ చెట్లను కూడా సులభంగా చేధించవచ్చు. ఇలా అన్ని చెట్లను ఎక్కుతు రైతుకు మిత్రుడిగా దీనిని వాడవచ్చు. ది నెంబర్ వన్ చాయిస్ గా దీనిని కచ్చితంగా వాడుకోవచ్చని అర్థం.

ఈ బైక్ పై సబ్సిడీ..
రైతులకు ఇది గొప్పవరంగా ఉపయోగపడనుంది. పండ్ల కోతకు అవసరమైన కూలీలను తగ్గించుకునేందుకు ఈ బైక్ ఉపయోగపడనుంది. చెట్లపైకి ఎక్కేందుకు రైతులకు పెద్ద సవాలుగా ఉండేది. దీని ద్వారా పనిభారంతో పాటు సమయం తగ్గనుంది. అన్ని విధాలా ఈ బైక్ ఉపయోగపడనుంది.ఈ పరికరం కొనుగోలు చేసే వారికి కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ లభించనుంది. రూ. 43,000 సబ్సిడీని ప్రభుత్వమే ఇస్తుంది.
అంటే ఈ ట్రీ బైక్ ధర రూ.1.12 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఈ బైక్ ను ఆపరేట్ చేయండం చాలా సులభం. మహిళలు పిల్లలు కూడా దీనిని ఒంటరిగా నిర్భయంగా ఉపయోగించవచ్చని భట్ చెప్పారు. ఇంకెందుకు ఆలస్యం ఈబైక్ ని ఎవరైనా సులభంగా కొనుగోలు చేయవచ్చు. వెంటనే ఆర్డర్ పెట్టి ఏమాత్రం వేచి చూడకుండా రయ్ రయ్ మంటూ చెట్టును ఎక్కండి.


Click it and Unblock the Notifications








