పనికిరాని సీట్ బెల్టులతో వ్యాపారం.. మిలియన్ల కొద్దీ సంపాదన.. ఎలా అనుకునుటున్నారా?

దేశం రోజురోజుకి అభివృద్ధివైపు పరుగులు తీస్తున్న తరుణంలో కొత్త కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఈ కొత్త ఉత్పత్తులు ప్రస్తుతం సమాజంలో వాడుకోవడానికి అనుకూలంగా ఉన్నప్పటికి అవి ఎదో ఒకరకంగా పర్యావరణానికి హాని కలిగిస్తూనే ఉన్నాయి. కావున పర్యావరణంలో కాలుష్య శాతం భారీగా పెరిగిపోతున్న తరుణంలో, చాలా కంపెనీలు ఇప్పుడు పర్యావరణ అనుకూలంగా ఉండే ఉత్పత్తులను తయారుచేయడానికి నడుం బిగించాయి.

ఇటీవల కాలంలో పారిశ్రామిక వ్యర్థాల నుంచి రీసైకిల్ చేసే వ్యాపారాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఇందులో వ్యర్థాలు అంటే వస్త్రాలు, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి వాటితో పాటు పాత మరియు పనికిరాని కార్లు కూడా ఈ కోవ కిందికే వస్తాయి. అయితే ఇటువంటి వ్యర్దాలను ఉపయోగించి అద్భుతమైన బ్యాగులు తయారుచేసే వారిని గురించి మరియు వారు చేసే బ్యాగుల గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

పనికిరాని సీట్ బెల్టులతో వ్యాపారం.. మిలియన్ల కొద్దీ సంపాదన.. ఎలా అనుకునుటున్నారా?

గురుగ్రామ్ కు చెందిన గౌతమ్ మాలిక్ తన తల్లి డాక్టర్ ఉషా మాలిక్, ఆయన భార్య భావన దండోనాతో కలిసి 2015లో 'జాగరీ బ్యాగ్స్' తయారుచేయడం మొదలుపెట్టారు. ఈ జాగరీ బ్యాగ్స్ కేవలం పాత పనికిరాని సీటు బెల్ట్ లు మరియు కార్గో బెల్ట్ లను అప్ సైక్లింగ్ చేయడం ద్వారా అందమైన మరియు ఎంతో మన్నికైన బ్యాగులను తయారు చేస్తున్నారు.

పనికిరాని సీట్ బెల్టులతో వ్యాపారం.. మిలియన్ల కొద్దీ సంపాదన.. ఎలా అనుకునుటున్నారా?

సాధారణంగా పాత మరియు పనికిరాని కార్ల యొక్క అన్ని భాగాలు ఆటోమొబైల్ పరిశ్రమలో తిరిగి ఉపయోగించబడే అవకాశం ఉంది. అయితే ఇందులో సీటు బెల్ట్ వంటివి మళ్ళీ ఉపయోగించడానికి వీలుండదు. అయితే ఇటువంటి పనికిరాని కారు సీటు బెల్ట్ లను 'అప్ సైక్లింగ్' చేయడం ద్వారా ఒక వ్యాపారాన్ని గౌతమ్ మాలిక్ ప్రారంభించారు.

MOST READ:నదిలో చిక్కుకున్న మహీంద్రా థార్.. బయటకు లాగిన మిత్సుబిషి పజెరో[వీడియో]

పనికిరాని సీట్ బెల్టులతో వ్యాపారం.. మిలియన్ల కొద్దీ సంపాదన.. ఎలా అనుకునుటున్నారా?

గౌతమ్ మాలిక్ మనసులో ఒకప్పటినుంచి వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన ఉంది, దీనికి అతని తల్లి మరియు భార్య ఈ ఆలోచనను నిజం చేయడంలో అతనికి ఎంతగానో సహకరించారు.

గౌతమ్ మాలిక్ ఢిల్లీలో పెరిగి, పాఠశాల విద్యాబ్యాసం పూర్తి చేసిన తరువాత, పూణే విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ చదివాడు. చదువుతున్న రోజుల్లోనే ఒరోవిల్లేకు వెళ్ళే అవకాశం వచ్చింది. ఒరోవిల్లే ప్రాంతం నిజమైన ఆర్కిటెక్చర్ కి ప్రసిద్ధి చెందింది. కావున అతని అధ్యయనంలో చాలా వరకు ఈ డిజైనింగ్ తెలుసుకున్నాను, అంతే కాకుండా ఒరోవిల్లేలోని ఇళ్లు మరియు భవనాలను నిర్మించడంలో ఉపయోగించే పర్యావరనానికి స్నేహపూర్వక ముడి పదార్థాలను గురించి కూడా తెలుసుకున్నాడు.

పనికిరాని సీట్ బెల్టులతో వ్యాపారం.. మిలియన్ల కొద్దీ సంపాదన.. ఎలా అనుకునుటున్నారా?

ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఒరోవిల్లే అతనికి శాశ్వత అనుబంధం ఏర్పడింది. ఆర్కిటెక్చర్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత, గౌతమ్ 2001లో యుఎస్ వెళ్లి, అక్కడ ఫిల్మ్ అండ్ మీడియా స్టడీస్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. చదువు పూర్తయిన తర్వాత అమెరికాలోనే 'డిజైనింగ్ అండ్ గ్రాఫిక్స్' రంగంలో పనిచేయడం ప్రారంభించాడు.

MOST READ:కరోనాతో మరణించిన ఉద్యోగికి రూ. 70 లక్షల భీమా; బాష్

పనికిరాని సీట్ బెల్టులతో వ్యాపారం.. మిలియన్ల కొద్దీ సంపాదన.. ఎలా అనుకునుటున్నారా?

కాలక్రమేనా విభిన్న ఉత్పత్తులను రూపొందించడానికి ఎన్నెన్నో ప్రదేశాలు తిరిగి తెలుసుకున్న తర్వాత, తరచుగా యునైటెడ్ స్టేట్స్ లోని బహిరంగ ప్రదేశాలను సందర్శించడానికి ఎక్కువ సమయం గడిపాడు. ఈ సమయంలోనే అక్కడి ప్రజల జీవన విధానం మరియు వారి అభిరుచులు తెలుసుకోవడం ప్రారంభించారు.

ఈ విధంగా గడుస్తున్న సమయంలో అతని ద్రుష్టి ప్రజలు వాడుతున్న బ్యాగులపై పడింది. ఎక్కువమంది ప్రజలు వారి అనుభూతులకు అనుగుణంగా బ్యాగులు కొనుగోలు చేయడం చాలా సార్లు అతడు చూసాడు. సాధారణంగా ఎవరైనా బ్యాగులు కొనుగోలు చేసేటప్పుడు దాని డిజైన్ మరియు బ్యాగ్ యొక్క మెటీరియల్ వంటివి గమనిస్తారు.

పనికిరాని సీట్ బెల్టులతో వ్యాపారం.. మిలియన్ల కొద్దీ సంపాదన.. ఎలా అనుకునుటున్నారా?

ఆ సమయంలో బ్యాగులు తయారు చేయడానికి ట్రక్కుల్లో ఉపయోగించే 'అప్ సైకిల్స్' టార్పాలిన్ అనే స్విస్ కంపెనీ గురించి తెలుసుకున్నాడు. సాధారణంగా ట్రక్కుల్లో గూడ్స్ కవర్ చేయడం కొరకు టార్పాలిన్ ఉపయోగించబడుతుంది. కానీ టార్పాలిన్లను తయారు చేయడానికి వివిధ రకాల మెటీరియల్ ఉపయోగించబడుతుంది. ఎందుకంటే టార్పాలిన్లు చాలా బలమైన ప్లాస్టిక్ తో తయారు చేయబడతాయి. అంతే కాదు ప్లాస్టిక్ ఇతర మెటీరియల్ కంటే హలా తేలికగా ఉంటుంది.

MOST READ:ఫ్రీ సర్వీస్ & వారంటీ మరింత పొడిగించిన సుజుకి మోటార్‌సైకిల్‌

పనికిరాని సీట్ బెల్టులతో వ్యాపారం.. మిలియన్ల కొద్దీ సంపాదన.. ఎలా అనుకునుటున్నారా?

ఈ కంపెనీ గురించి తెలుసుకున్న గౌతమ్ కు భారతదేశంలో ఇలాంటి 'వ్యర్థాలు' 'అప్ సైకిల్' చేయాలనే ఆలోచన తట్టింది. ఇదే ఆలోచనను అమలు చేయడానికి తన మాతృ భూమికి తిరిగి వచ్చాడు.

గౌతమ్ మాలిక్ భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత, తన స్వంత డిజైనింగ్ కంపెనీని ప్రారంభించాడు. దాదాపు రెండేళ్లపాటు దీన్ని నడిపిన తర్వాత జబాంగ్ కంపెనీలో పనిచేయడం ప్రారంభించాడు. కానీ ఈ సమయంలో, అతను భారతదేశంలో అందుబాటులో ఉన్న 'పారిశ్రామిక వ్యర్థాల' పై పరిశోధనను కొనసాగించాడు.

పనికిరాని సీట్ బెల్టులతో వ్యాపారం.. మిలియన్ల కొద్దీ సంపాదన.. ఎలా అనుకునుటున్నారా?

ఎందుకంటే, అతడు తమ స్వంత స్టార్టప్ ప్రారంభించాల్సి వచ్చింది. మొదట్లో, అతడు కూడా తాను విదేశాల్లో చూసిన టార్పాలిన్లను అప్ సైక్లింగ్ చేయడం గురించి ఆలోచించాడు. అయితే మన దేశంలో ఉపయోగించే టార్పాలిన్ యొక్క నాణ్యత అంత మంచిది కాదు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఉండే మరో మెటీరియల్ కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ విధముగా వెతుకుతున్న సమయంలో పాత కారు సీటు బెల్ట్ అతని ద్రుష్టిలో పడింది.

MOST READ:'ట్రేసర్' అనే పేరును ట్రేడ్‌మార్క్ చేసిన యమహా, కొత్త బైక్ రాబోతుందా?

పనికిరాని సీట్ బెల్టులతో వ్యాపారం.. మిలియన్ల కొద్దీ సంపాదన.. ఎలా అనుకునుటున్నారా?

ఇదే అదనుగా తీసుకున్న గౌతమ్ మాలిక్ ఢిల్లీలోని మాయాపురిని సందర్శించాడు. ఢిల్లీలో ఈ ప్రాంతం ఇండస్ట్రియల్ వ్యర్థాలకు ప్రసిద్ధి చెందింది. కాబట్టి గౌతమ్ తన వ్యాపారం కోసం ఇక్కడి నుండి పాత సీటు బెల్ట్ లను తీసుకోవడం ప్రారంభించాడు. మొదట, అతను ఈ సీటు బెల్ట్ ల నుండి బ్యాగులను తయారు చేసి ప్రజల మధ్యకు తీసుకెళ్లాడు.

ఈ సమయంలో ఈ బ్యాగులకు ఒక్క భారతదేశ ప్రజలు మాత్రమే కాదు ఇతర దేశాల ప్రజలు కూడా ఎక్కువగా ఆకర్షితులయ్యారు. కాలక్రమంగా ఈ బ్యాగులకు మంచి స్పందన వచ్చింది. కావున గౌతమ్ 2015లో 'జాగరీ బ్యాగుల' తయారీకి శ్రీకారం చుట్టాడు. దీనికోసం అతడు పాత సీటు బెల్టులకు, కార్గో బెల్ట్ లను అప్ సైక్లింగ్ చేయడం ద్వారా హ్యాండ్ బ్యాగులు, ల్యాప్ టాప్ బ్యాగులు మొదలైనవాటిని తయారు చేసాడు.

పనికిరాని సీట్ బెల్టులతో వ్యాపారం.. మిలియన్ల కొద్దీ సంపాదన.. ఎలా అనుకునుటున్నారా?

ఈ 'జాగరీ బ్యాగుల' కోసం మరిన్ని ముడి పదార్థాలను తీసుకుని దానిని మరింత డిజైన్ చేసి విక్రయించడం ప్రారంభించాడు. యితడు మాత్రమే కాదు అతని భార్య భావన ఆర్కిటెక్చర్ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. కానీ గౌతమ్ కోసం ఆమె అతని కంపెనీలో సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. అంతే కాకుండా అతని తల్లి డాక్టర్ ఉషా మాలిక్ కూడా థాని కంపెనీలో కంపెనీలో ఫైనాన్స్ వర్క్ చూసుకుంటుంది.

గౌతమ్ తల్లి దాదాపు 40 స౦వత్సరాలు ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని మిరాండా హౌస్ లో ప్రొఫెసర్ గా ఉన్నారు. రిటైర్ మెంట్ తరువాత ఏదైనా విభిన్నమైన రంగంలో మంచి ఏదైనా చేయాలని అనుకుంది. కాబట్టి ఆసమయంలో గౌతమ్ తన ఆలోచనను చెప్పినప్పుడు, అతనికి పూర్తిగా మద్దతు ఇవ్వాలనుకుంది. ఇస్తున్నాను. ఎందుకంటే మా ఈ వ్యాపారం ద్వారా, మేము పర్యావరణ పరిరక్షణపై పనిచేస్తున్నాము మరియు ప్రజలకు ఉపాధిని కూడా అందిస్తున్నాము.

పనికిరాని సీట్ బెల్టులతో వ్యాపారం.. మిలియన్ల కొద్దీ సంపాదన.. ఎలా అనుకునుటున్నారా?

పనిజరిగే విధానం:

ఈ జాగరీ బ్యాగుల ఉత్పత్తి కోసం మొదట ముడిపదార్థం వివిధ వనరుల నుండి తమ యూనిట్ కి వస్తాయి. ఆ తరువాత విభిన్న ప్రొడక్ట్ లు డిజైన్ చేయబడతాయి. సీటు బెల్ట్ కేవలం రెండు అంగుళాల వెడల్పు మాత్రమే ఉంటుంది, కావున దీనిని దృష్టిలో ఉంచుకుని వారు అన్ని ఉత్పత్తులను డిజైన్ చేస్తారు.

ఇందులో కూడా మంచి డిజైన్స్ మరియు కస్టమర్ లను ఆకర్షించడం కొరకు తయారుచేయబడతాయి. బ్యాగుల ఉత్పత్తిలో డిజైన్ చాలా ముఖ్యం, కావున ప్రజలను ఆకర్శించడానికి అనుకూలమైన డిజైన్లను తయారుచేసి కొంత ఎంబ్రాయిడరీ కూడా చేరుస్తారు.

పనికిరాని సీట్ బెల్టులతో వ్యాపారం.. మిలియన్ల కొద్దీ సంపాదన.. ఎలా అనుకునుటున్నారా?

ఈ బ్యాగుల తయారీలో వారు దాదాపుగా ఇప్పటివరకు 3,960 మీటర్లకు పైగా పనికిరాని మరియు పాత కారు సీటు బెల్ట్ లు మరియు 900 మీటర్లకు పైగా కార్గో సీటు బెల్ట్ లను వినియోగించారు. దీనితో పాటు ఇతర వ్యర్థాలను ఉపయోగించి కూడా వారు బ్యాగులు తయారుచేయడానికి పూనుకున్నారు. ఇందులో ఇప్పటికే గౌతమ్ 15 మందికి ఉపాధి కల్పించాడు. వారిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు.

ఉత్పత్తులు ఎంత ఉన్నా, ఇందులో మార్కెటింగ్ చాలా ప్రధానం. కావున మార్కెటింగ్ విషయానికి వస్తే, ఇతడు అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో నివసిస్తున్న కొంతమందివ్యక్తులతో సంబంధం కలిగి ఉన్నారు. ఇప్పుడు వీరే తమకు కస్టమర్లు అయ్యారని, వారి ద్వారానే ఇతర వ్యక్తులకు కూడా తెలుస్తుంది.

పనికిరాని సీట్ బెల్టులతో వ్యాపారం.. మిలియన్ల కొద్దీ సంపాదన.. ఎలా అనుకునుటున్నారా?

భారతదేశంలో జరిగే మార్కెటింగ్ విషయానికి వస్తే, వీరు పండుగలు మొదలైన సమయాల్లో స్టాల్స్ ఏర్పాటు చేయడం ప్రారంభించాము. ఇందులో భాగంగానే మొదట దేశ రాజధాని ఢిల్లీలో మొదటి స్టాల్ ఏర్పాటు చేశాడు. అయితే మొదట ప్రజల నుండి ఆశించినత స్పందన రాలేదు. కావున సోషల్ మీడియాను వేదికగా తీసుకుని ప్రజలను ఆకర్శించడం ప్రారంభించాడు. అతనికి వారి స్నేహితులు చాలా సహకరించారు.

విదేశీ మార్కెట్:

గౌతమ్ ఇప్పుడు వివిధ కొత్త మోడల్స్ పై పనిచేస్తున్నారు. కస్టమర్ లతో నేరుగా కనెక్ట్ కావడమే కాకుండా, పెద్ద మొత్తంలో వారి నుంచి బ్యాగులను కొనుగోలు చేసే కొన్ని సంస్థలతో కూడా అతడు సంబంధం పెట్టుకున్నాడు. రానురాను అతని బ్యాగులకు మంచి స్పదన వచ్చిన తర్వాత, ఇతర కంపెనీలు కూడా బ్యాగులు తయారు చేయమని చెప్పారు.

పనికిరాని సీట్ బెల్టులతో వ్యాపారం.. మిలియన్ల కొద్దీ సంపాదన.. ఎలా అనుకునుటున్నారా?

గత ఐదేళ్లలో సుమారు 9,000 మంది వినియోగదారులకు ఈ బ్యాగులను అందించారు. వీరిలో సుమారు 6,000 మంది వినియోగదారులు తమ వద్ద నుంచి నిరంతరం బ్యాగులను కొనుగోలు చేస్తున్నారు. భారతదేశంతో పాటు, వారి ఉత్పత్తులు అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా మరియు జపాన్ వంటి దేశాలకు కూడా అమ్ముడవుతున్నాయి.

పనికిరాని సీట్ బెల్టులతో వ్యాపారం.. మిలియన్ల కొద్దీ సంపాదన.. ఎలా అనుకునుటున్నారా?

ఈ బ్యాగుల తయారీ గురించి గౌతమ్ మాలిక్ మాట్లాడుతూ, అతడు సుమారు 10,00,000 రూపాయల పెట్టుబడితో ఈ సంస్థను ప్రారంభించాడు. గౌతమ్ ఈ కంపెనీ ప్రారంభించిన మొదట సంవత్సరమే 20 లక్షల రూపాయల టర్నోవర్ తీసుకోగలిగాడు. కాలక్రమంగా ఇతని ఉత్పత్తులకు డిమాండ్ బాగా పెరిగింది. కావున టర్నోవర్ కూడా రెట్టింపయింది.

పనికిరాని సీట్ బెల్టులతో వ్యాపారం.. మిలియన్ల కొద్దీ సంపాదన.. ఎలా అనుకునుటున్నారా?

గౌతమ్ మాలిక్ర్ భవిష్యత్తులో ఈ రీసైక్లింగ్ రంగంలో మరింత మంది యువతకు ఉపాధి కల్పించాలనుకుంటున్నాడు. దీని కోసం, వ్యర్థాల రకాన్ని బట్టి ప్రజలు 'అప్ సైకిల్' చేయడానికి వివిధ ప్రదేశాలలో కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నాడు. ఏది ఏమైనా వ్యర్థాల నుంచి బ్యాగులు తయారు చేసి, ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా, ఇతరదేశాల కూడా ఎగుమతి చేస్తూ మరింత మందికి ఉపాధి కల్పించాలనుకుంటున్న గౌతమ్ నిజంగా గ్రేట్.. కదా.

ఇలాంటి ఆసక్తి కరమైన విషయాలను మరియు కార్లు, బైకుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి మా డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Image Courtesy: Jaggary Bags

Most Read Articles

English summary
This Startup Makes Hand Bags From Recycled Car Seatbelts Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X