తూర్పు గోదావరి జిల్లాలో రెండు కార్లు ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ముగ్గురు మృతి
దేశంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు(Road Accident) చోటుచేసుకుంటూనే ఉన్నాయి. నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం ఇలా తదితర కారణాల కారణంగా రోడ్డు భద్రత సమస్య ఏర్పోడుతోంది. ఇక ఏదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే మాత్రం హైవేలపై రక్తపు మడుగులే కనిపిస్తున్నాయి. తాజాగా ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురిని బలి తీసుకుంది.
తూర్పుగోదావరి జిల్లా జాతీయ రహదారిపై(Three Killed In Accident East Godavari District) జనవరి 2న ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొట్టడంతో ఏడాదిన్నర వయసున్న చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కొత్త సంవత్సరంలో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లలో ఓ కారు టైరు పగిలి ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు(Infant Killed In Road Accident) వెల్లడించారు. ఘోర రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మృతి చెందడం తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగించింది. హైవేలపై ఎంత అప్రమత్తంగా డ్రైవ్ చేయాలో ఈ దుర్ఘటన తెలియజేస్తుంది.
జిల్లాలోని దేవరపల్లి మండలం బండాపురం(Road Accident East Godavari District) వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రోజు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు టైరు పగిలి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఏడుగురికి గాయాలయ్యాయి. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు.

బండాపురం వద్ద నేషనల్ హైవే(National Highway)పై మారుతి సుజుకి ఎర్టిగా కారు నందిగామ నుంచి వైజాగ్‌కు, మరో ఎర్టిగా ఎస్‌యూవీ వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నాయి. ఈ క్రమంలో దేవరపల్లి మండలం బండాపురం వద్దకు రాగానే నందిగామ నుంచి వైజాగ్‌కు అతివేగంతో వెళ్తున్న అకస్మాత్తుగా కారు టైర్ పగిలిపోయింది. దీంతో ఆ కారు అదుపు తప్పి డివైడర్‌ను దాటి మరో రోడ్డుపైకి దూసుకుపోయింది.
అదే సమయంలో ఎదురుగా రోడ్డులో వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న మరో కారును వేగంగా ఢీకొట్టింది. రెండు కార్ల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. యాక్సిడెంట్ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 19 నెలల చిన్నారితో సహా ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

గాయపడిన వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. మృతులు దివ్య ప్రియ(25), రమా దేవి(50), గనిష్క(19 నెలలు)గా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తామని వెల్లడించారు. కాగా మృతులు నూతన సంవత్సర వేడుకలు ముగించుకుని హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








