పట్టాలు తప్పిన రైలు, నదిలో పడిన మూడు బోయింగ్ విమానాలు

By Ravi

మూడు బోయింగ్ 737 విమానాలు ఎగరడానికి ముందే నీట మునిగాయి. విమాన తయారీ కోసం రైలుపై ఆరు బోయింగ్ 737 విమానాల ప్రధాన భాగాలను (బాడీని) తరలిస్తుండగా, రైలు పట్టాలు తప్పడంతో మూడు బోయింగ్ 737 ఫ్యూస్‌ల్యాగ్స్ క్లార్క్ ఫోర్క్ నదిలో పడిపోయాయి. ఇందులో ఓ బోయింగ్ 737 విమాన భాగం పూర్తిగా మధ్యకు విరిగిపోగా మిగిలిన రెండు స్వల్పంగా డ్యామేజ్ అయ్యాయి.

ఈ విమాన విడిభాగాలను ఫైనల్ అసెంబ్లింగ్ కోసం కన్సాస్‌లోని విచిటాలో ఉన్న స్పిరిట్ ఏరోసిస్టమ్స్ నుంచి వాషింగ్టన్‌లోని రెన్టన్‌లో ఉన్న బోయింగ్ అసెంబ్లింగ్ కేంద్రానికి తరలిస్తున్నారు. ఈ ప్రమాదం గడచిన గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగినట్లు మోన్టానా రైల్ లింక్ ప్రతినిధి లిండా ఫ్రోస్ట్ తెలిపారు. ఈ ప్రమాదంలో బోయింగ్ భారీ ఆస్తి నష్టం వాటిళ్లినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

నదిలో పడిన మూడు బోయింగ్ విమానాలు

ఆరు బోయింగ్ 737 విమానాలను ఫైనల్ అసెంబ్లింగ్ కోసం రైలుపై కన్సాస్‌లోని విచిటాలో ఉన్న స్పిరిట్ ఏరోసిస్టమ్స్ నుంచి వాషింగ్టన్‌లోని రెన్టన్‌లో ఉన్న బోయింగ్ అసెంబ్లింగ్ కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మోన్టానా వద్ద రైలు పట్టాలు తప్పడంతో మూడు విమానాలు ఫ్యూస్‌ల్యాగ్స్ క్లార్క్ ఫోర్క్ నదిలో పడిపోయాయి.

నదిలో పడిన మూడు బోయింగ్ విమానాలు

నదిలో పడిపోయిన బోయింగ్ 737 విమానాలను ఒడ్డుకు చేర్చేందుకు రిస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. నదిలో పడిపోయిన మూడు విమానాల్లో ఓ విమానం మధ్య భాగాన విరిగిపోయింది. మరో విమానం నది ఒడ్డున ఉండగా, ఇంకో విమానం చివరి భాగం కొద్దిగా నదిలోకి దూసుకుపోయింది.

నదిలో పడిన మూడు బోయింగ్ విమానాలు

నదిలో పడిన ఈ విమానాలు రైలు ట్రాక్‌తో పాటుగా దూసుకు వచ్చేశాయి. వీటిని తిరిగి రైలు పట్టాలపైకి చేర్చేందుకు అక్కడి ఎలాంటి సానుకూల వాతావరణ కనిపించడం లేదు. భారీ క్రేను ఉంటే, వీటిని పైకి తీసుకువచ్చే అవకాశం ఉంది.

నదిలో పడిన మూడు బోయింగ్ విమానాలు

డ్యామేజ్ అయిన ఈ బోయింగ్ 737 విమాన భాగాలను తిరిగి వినియోగిస్తారా లేక వీటిని మళ్లీ స్రాప్‌గా మారుస్తారా అనేది తేలాల్సి ఉంది. రైలు పట్టాలు తప్పడానికి గల కారణం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

నదిలో పడిన మూడు బోయింగ్ విమానాలు

ఇదిలా ఉండగా, పరిస్థితిని అంచనా వేసేందుకు బోయింగ్ తమ నిపుణుల బృందాన్ని సంఘటనా స్థలికి పంపించినట్లు పేర్కొంది.

వీడియో

బోయింగ్ 737 ఫ్యూస్‌ల్యాగ్‍‌లు నదిలో పడిపోయిన తర్వాత రెస్క్యూ టీమ్ వాటిని బయటకు తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఈ వీడియోలో చూడండి.

More from DriveSpark

Article Published On: Monday, July 7, 2014, 14:05 [IST]
English summary
A train derailment near Superior, Montana sent two brand new Boeing 737 fuselages tumbling into the Clark Fork River on Thursday. The planes were on their way from Spirit Aerosystems in Wichita, Kansas to final assembly at Boeing in Renton, Washington.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+