జనరల్‌ టికెట్‌ ప్యాసింజర్స్‌తో ఫుల్‌ రష్‌గా రిజర్వ్‌డ్‌ కోచ్‌లు.. ప్రయాణికుడి కంప్లెయింట్‌, రైల్వే శాఖ సీరియస్

దేశంలోని రైళ్లలో జనరల్‌ టికెట్‌ ప్రయాణికులు.. ఇటీవల రిజర్వ్‌డ్‌ కోచ్‌(Train Reserved Coaches)ల్లో ప్రయాణిస్తున్న సంఘటనలు చాలా చోటుచేసుకున్నాయి. ఈ కారణంగా టికెట్‌ రిజర్వ్‌ చేసుకున్న ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. జనరల్‌ బోగీల్లో రద్దీని తలపించేలా ఏసీ, స్లీపర్‌ కోచ్‌లు ఉంటున్నాయి. ఈ క్రమంలో దీనిపై ఓ ప్రయాణికుడు రైల్వేకు ఫిర్యాదు చేశారు.

దేశవ్యాప్తంగా రైల్వే శాఖ ప్రతిరోజూ లక్షలాది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పును తీసుకువస్తూ వందేభారత్‌ రైళ్లు కూడా ప్రజాదరణ పొందుతున్నాయి. అయినప్పటికీ సాధారణ, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకి ఏ మాత్రం ఆదరణ తగ్గడం లేదు. కాగా ఇటీవల రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. జనరల్‌ బోగీలు తగ్గిపోవడంతో అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్‌ ప్రయాణికులు ఎక్కువగా ఏసీ, స్లీపర్‌ కోచ్‌ల్లో ప్రయాణిస్తున్నారు.

Ticketless-Passengers-In-Reserved-Coaches

సుదూర ప్రాంతాలకు ప్రయాణించేవారు ఎక్కువగా స్లీపర్‌(Rush In Sleeper And AC Coaches), ఏసీ కోచ్‌లను బుక్‌ చేసుకుంటారు కాబట్టి.. నిత్యం ఆ కంపార్ట్‌మెంట్‌లు కూడా రద్దీగా ఉంటాయి. అందుకే నెల రోజుల ముందుగానే ప్రయాణికులు బుక్‌ చేసుకుంటారు. అయితే రైళ్లలో సాధారణంగా రిజర్వ్‌డ్‌, అన్‌రిజర్వ్‌డ్‌ అనే రెండు కోచ్‌లు ఉంటాయి.

ఈ క్రమంలో అన్‌రిజర్వ్‌డ్‌ టిక్కెట్లను రైల్వే శాక పెద్దఎత్తున విక్రయించినప్పటికీ.. ఎంత కష్టమైనా, ఎంత రద్దీగా ప్రయాణికులు వాటిలో మాత్రమే ప్రయాణించాలి. కానీ ఇటీవల రైళ్లలో జనరల్‌ బోగీలు తగ్గిపోవడంతో ఆ టిక్కెట్లు తీసుకున్న చాలా మంది ప్రయాణికులు రిజర్వ్‌ చేసిన కోచ్‌ల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య దేశవ్యాప్తంగా ఉంది.

Ticketless-Passengers-In-Reserved-Coaches

తాజాగా ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న ఓ వ్యక్తి ఇప్పుడు(Unreserved Ticket Passengers In Reserved Coaches).. సహనం కోల్పోయి ఏకంగా రైల్వే శాఖకు ఫిర్యాదు చేశారు. సోషల్‌ మీడియా 'X' సైట్ పేజీలో వీడియోను ఓ పోస్ట్ పెట్టారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అతను గుజరాత్‌లోని భుజ్ నుంచి సాలిమార్‌కు ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నారు.

అతను ఈ రైలులోని ఎస్ 5 కోచ్‌లో ప్రయాణించాడు. ఈ క్రమంలో చాలా మంది ప్రయాణికులు రిజర్వేషన్ టిక్కెట్లు లేకుండానే రైలు ఎక్కారు. దీంతో ఆ కోచ్‌లోని ప్రయాణికులంతా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో ఈ దృశ్యాలను ఫొటో తీసి, రికార్డ్ చేసి రైల్వే అడ్మినిస్ట్రేషన్‌ని, రైల్వే శాఖ మంత్రిని ట్వీట్‌లో ట్యాగ్ చేశాడు.

Ticketless-Passengers-In-Reserved-Coaches

వ్యక్తి పెట్టిన ఈ పోస్ట్‌పై రైల్వే యంత్రాంగం స్పందించింది. ఈ నివేదికలోని నిర్దిష్ట సంఘటనకు సంబంధించి చర్య తీసుకోవడానికి ఫిర్యాదుదారు మొబైల్ ఫోన్ నంబర్‌ను కోరుతూ రైల్వే సిబ్బంది రిప్లై ఇచ్చారు. అంతే కాకుండా దీనిపై ఫిర్యాదు చేసేందుకు 139 నంబర్‌కు డయల్ చేయవచ్చని, లేదంటే రైల్ మదత్ అనే వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోస్ట్‌లో వెల్లడించారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, March 28, 2024, 11:05 [IST]
English summary
Ticketless passengers occupy reserved coaches in trains man complaints railway reacts
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+