నేటి వీడియో: మహీంద్రా స్కార్పియోపై పులి.. ఏంచేసింది?
మనం పులిని కిలోమీటరు దూరం నుంచి చూస్తేనే పది కిలోమీటర్ల మేర పరుగులు తీస్తాం. అలాంటిది పులి మన కారుపై ఎక్కి దర్జాగా పడుకుంటే, ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. మనకు భయంగానే ఉంటుంది కానీ ఆఫ్రికాలో మాత్రం ఇది షరామామూలే.
ఆఫ్రికన్ అభయారణ్యాల్లో ఇలాంటి సంఘటనలు తరచూ కనిపిస్తూనే ఉంటాయి. వాహనాలు వెచ్చగా ఉండి, ప్రత్యేకించి టూరిస్ట్ ఎస్‌యూవీల వంటి వాహనాల పై భాగంలో మంచి స్పేస్ ఉంటుంది కాబట్టి, ఇవి దర్జాగా పైకి ఎక్కు కునుకు తీస్తూ, కారులో ఉండే వారికి కునుకు లేకుండా చేస్తాయి.

ఇటీవల సౌత్ ఆఫ్రికాలోని టైగర్ క్యాన్యాన్స్ వద్ద ఇలాంటి ఓ సంఘటనే కెమరాకు చిక్కింది. ఈ అభయారణ్యం ప్రత్యేకించి పులలకు ఫేమస్, ఇది ప్రముఖ వైల్డ్‌లైఫ్ ఫిల్మ్ మేకర్ జాన్ వార్టీకి చెందినది. ఇందులో ఓ పులి వార్టీ నడుపుతున్న మహీంద్రా స్కార్పియో వాహనం పైకి ఎక్కి, రూఫ్‌పై ఉన్న స్పేర్ టైరును దిండుగా చేసుకొని కాసేపు కునుకు తీసింది.
వార్టీ తన కారును స్టార్ట్ చేసి, గతుకుల రోడ్లపై వెళ్తున్నప్పుడు పులి నిద్ర లేచి, కారుపై కింగ్‌లా టూరిస్టులతో పాటే తాను కూడా రైడ్‌కు వెళ్లింది. ఈ వీడియోని సేత్ రోథర్‌హామ్ అనే టూరిస్ట్ తన కెమరాలో అతి సమీపం నుంచి రికార్డ్ చేశాడు. అసలు విషయం ఏటంటే, ఈ పులులు పైకి కనిపించే క్రూరమైనవి కావట.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/LscN5C44Zqk?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>
మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన దక్షిణాఫ్రికా విభాగం, మహీంద్రా సౌత్ ఆఫ్రికా అక్కడి మార్కెట్లో విస్తృత శ్రేణి ఉత్పత్తులను విక్రయిస్తుంది. అందులో ఎక్స్‌యూవీ500, బొలెరో, స్కార్పియో, క్వాంటో, జైలో వంటి కార్లున్నాయి.


Click it and Unblock the Notifications








