విరాట్ కోహ్లీకి వారసుడు.. తండ్రికి మహీంద్రా సూపర్ హిట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని గిఫ్ట్‌గా ఇచ్చిన స్టార్ ప్లేయర్
టీమిండియా యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ తన అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. భారత జట్టులో స్థిరమైన స్థానం సంపాదించుకున్న ఈ హైదరాబాద్ ప్లేయర్, తండ్రికి మహీంద్రా XEV 9e అనే సూపర్ హిట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని బహుమతిగా ఇచ్చి తన ప్రేమను చాటుకున్నాడు. ఈ కారు విలువ రూ. 22 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఉంటుందని అంచనా.
తిలక్ వర్మ క్రికెట్ కెరీర్
2023లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ హైదరాబాద్ ఆల్‌రౌండర్, బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. అతను పేస్, స్పిన్ బౌలర్లను ఈజీ ఎదుర్కొనే కెపాసిటీ తనకు ఉంది. విరాట్ కోహ్లీ స్థానంలో భవిష్యత్తులో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం అతను టీ20 జట్టులో స్థిరమైన సభ్యుడిగా ఉన్నప్పటికీ, కోచ్ గౌతమ్ గంభీర్ అతనిని వన్డేలలో కూడా పరీక్షించడానికి ఆసక్తి చూపుతున్నారు.

తిలక్ సంపాదన
22 ఏళ్ల తిలక్ వర్మ ఇప్పటికే ఆర్థికంగా కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు. వివిధ నివేదికల ప్రకారం.. అతని మొత్తం ఆస్తి రూ.5 కోట్లకు పైగానే ఉంది. ఇందులో అతని ఐపీఎల్ జీతం, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్, ఇతర వ్యక్తిగత పెట్టుబడులు కూడా ఉన్నాయి.
మహీంద్రా XEV 9e ఎస్‌యూవీ వివరాలు
తిలక్ వర్మ తండ్రి కోసం ఎంచుకున్న బ్లాక్ కలర్ కారు ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు మహీంద్రా కొత్త INGLO ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. ఇది మంచి ఇంటీరియర్ స్పేస్, స్థిరత్వం, మెరుగైన హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. అలాగే, ఇది చాలా బలంగా ఉండే బోరాన్ స్టీల్ ఫ్రేమ్‌తో తయారు చేయబడింది.

ఈ కారు 59 kWh, 79 kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ బ్యాటరీలు అత్యంత సురక్షితమైన లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) టెక్నాలజీతో రూపొందించబడ్డాయి. ఈ కారును 175 kW డీసీ ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించి కేవలం 20 నిమిషాల్లో 20-80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.
పెర్ఫార్మెన్స్, ఫీచర్స్
59 kWh మోడల్ 228 bhp పవర్, 380 Nm టార్క్ అందిస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 542 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. 79 kWh వేరియంట్ 282 bhp పవర్, 380 Nm టార్క్ ఇస్తుంది. ఇది 656 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

ఈ కారులో మూడు డ్రైవ్ మోడ్‌లు (రేంజ్, ఎవ్రీడే, రేస్), సిటీ డ్రైవింగ్ కోసం వన్-పెడల్ డ్రైవ్ ఉన్నాయి. డాష్‌బోర్డ్‌లో మూడు పెద్ద 12.30 అంగుళాల స్క్రీన్‌లు ఉన్నాయి.
ఈ లగ్జరీ కారులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2+ ADAS, 360-డిగ్రీ కెమెరా, సీట్ వెంటిలేషన్, ఇన్‌ఫినిటీ గ్లాస్ రూఫ్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, 16-స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. చాలామంది కస్టమర్లు టాప్ వేరియంట్ ప్యాక్ 3 సెలక్ట్ చేసుకున్నారని.. తిలక్ కూడా అదే మోడల్ కొని ఉంటారని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications








