వర్షాకాలంలో మీ కారు మంచి మైలేజీ ఇవ్వాలంటే.. ఈ చిట్కాలు తప్పనిసరి

వర్షాకాలంలో కారు డ్రైవింగ్ చేయడం మంచి అనుభూతిని ఇస్తుంది. చిరుజల్లులు పడుతుంటే ఆహ్లాదకర వాతావరణంలో ఉల్లాసంగా కారు నడుపుతూ మంచి ఫీల్‌ను ఆస్వాదించవచ్చు. కానీ అదే వర్షం ఎక్కువైతే బురద రోడ్లపై కారు డ్రైవింగ్‌ చేయడం సవాలుగా మారుతుంది. అది మీ కారు ఇంధన సామర్థ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.

వర్షాకాలంలో కారు మైలేజీ కూడా తగ్గే అవకాశాలున్నాయి. తడి రోడ్లపై డ్రైవింగ్‌.. కారు భద్రత మరియు పనితీరుపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. కానీ కొన్ని చిట్కాలను పాటిస్తే వర్షాకాలంలో కూడా మీ కారు మంచి మైలేజీ ఇస్తుంది. వర్షాలు తీవ్రతరమైన నేపథ్యంలో మీ కారు మైలేజీ కోసం ఆ చిట్కాలేంటో ఈ కథనంలో మీ కోసం అందిస్తున్నాం.

Car-Mileage

ఇంజిన్ స్విచ్ ఆఫ్ చేయండి: రద్దీ ఎక్కువగా ఉండే రోడ్లపై ఎక్కువ సేపు నిరీక్షిస్తున్నప్పుడు కారును అనవసరంగా ఐడిల్ చేయకుండా ఇంజిన్ స్విచ్ ఆఫ్ చేయడం మంచిది. దీని ద్వారా మీ కారులో ఫ్యూయెల్‌ వృథా కాకుండా చూసుకోవచ్చు. కాబట్టి మీరు ట్రాఫిక్‌లో వేచి ఉండాల్సి వస్తే, ఇంజిన్‌ను స్విచ్ ఆఫ్ చేయడం ఉత్తమం.

సడెన్‌ స్పీడ్‌ మరియు సడెన్‌ బ్రేకింగ్ కారణంగా రోడ్లపై ప్రమాదాలు జరగడమే కాకుండా మైలేజీని కూడా తగ్గిస్తాయి. కాబట్టి నిర్దేశించిన పరిమితుల్లో స్థిరమైన వేగాన్ని కొనసాగించడం మంచిది. సడెన్‌ బ్రేక్‌ వేసే పరిస్థితి రాకుండా కారును నడపడం కూడా అవసరం. వర్షాకాలంలో తడి రోడ్లపై మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంతో పాటు కారు మైలేజీని మెరుగుపరచడంలో ఇది దోహదపడుతుంది.

Car-Mileage

టైర్లు: వర్షాకాలంలో మీ కారు మైలేజీని మెరుగుపరచడానికి సరైన టైర్ నిర్వహణ ముఖ్యం. తయారీదారు సిఫార్సు చేసిన విధంగా మీ కారు టైర్లు సరైన గాలి ఒత్తిడిలో ఉన్నాయా లేదా అనేది నిర్ధారించుకోండి ఎందుకంటే తక్కువ గాలితో కూడిన టైర్ల కారణంగా ఫ్యూయెల్‌ వినియోగం పెరుగుతుంది.

టైర్‌ ప్రెజర్‌: అంతేకాకుండా వర్షాకాలంలో రోడ్లు ఎప్పుడూ తడిగా ఉంటాయి. అటువంటి రోడ్లపై మంచి ట్రాక్షన్ పొందడానికి, టైర్ల డెప్త్‌ తగినంతగా ఉండాలి. కాబట్టి టైర్‌ డెప్త్ కూడా సరిపోయేలా చూసుకోవడం చాలా అవసరం. టైర్ ప్రెజర్‌ తక్కువ మార్జిన్‌లో ఉండేలా చూసుకోవడం ద్వారా మైలేజీని మెరుగుపరచవచ్చు. వర్షాకాలంలో తయారీదారులు సూచించిన టైర్ ఒత్తిడిని నిర్వహించాలి.

Car-Mileage

ఏసీ వినియోగం: వర్షాకాలంలో కార్లలో ఏసీ లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల విండ్‌షీల్డ్‌కు ఫాగింగ్ ఏర్పడుతుంది. అయితే, ఏసీని ఉపయోగించడం వల్ల మీ కారు ఇంధన సామర్థ్యంపై ప్రతికూలంగా ప్రభావితం చూపిస్తుంది. అందుకోసం ACని అతి తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచకపోవడం ఉత్తమం.

మంచి మైలేజీకి కోసం మీ కారును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కారు లోపల అనవసరమైన బరువును తొలగించండి. ఎందుకంటే దీని వల్ల అదనపు భారం పడి ఇంధన వినియోగం పెరుగుతుంది. కాబట్టి కారు లోపల అనవసరమైన వస్తువులు తీసేసి బరువు తగ్గించండి.

Car-Mileage

గేర్‌ షిఫ్ట్‌లు: మీ కారు మంచి మైలేజీని ఇవ్వాలంటే గేర్ షిఫ్ట్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. తక్కువ గేర్లు ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తున్నందున మెరుగైన ఇంధన సామర్థ్యం కోసం, అధిక గేర్‌కి మారాలని ఆటో నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధంగా డ్రైవింగ్ స్టైల్‌లో కొన్ని చిన్న చిన్న దిద్దుబాట్లు చేయడం వల్ల మీ కారు మైలేజీని పెంచవచ్చు.

సర్వీసింగ్‌: వర్షాకాలంలో మీ కారు సరైన స్థితిలో ఉండేలా చూసుకోవడానికి రెగ్యులర్ సర్వీస్ మరియు మెయింటెనెన్స్ చాలా ముఖ్యం. కాబట్టి తయారీదారులు సిఫార్సు చేసిన విధంగా కారును సర్వీసింగ్‌ చేయించండి. కారు విడిభాగాలు సక్రమంగా పనిచేస్తేనే మంచి మైలేజీ ఇస్తుందని గుర్తించాలి. ఈ విషయాలన్నీ సరిగ్గా పాటిస్తే, మీ కారులో పెట్రోల్/డీజిల్ ఖర్చుపై మీరు డబ్బు ఆదా చేయొచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, July 25, 2023, 18:57 [IST]
English summary
Tips to increase car mileage during monsoon in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+