మీరు ఇంధన బిల్లులు తగ్గించుకోవాలనుకుంటున్నారా.?.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
ప్రస్తుత కాలంలో పెరుగుతున్న ఇంధన ధరలు వాహనదారులను కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ తమ ఇంధన బిల్లులను తగ్గించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఇంటి కరెంట్ బిల్లు తగ్గించుకోవడానికి ఎలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తామో.. అదే వాహనాల వినియోగంలోనూ పాటిస్తే చాలు. పొదుపుతో పాటు పర్యావరణ హితంగాను మారొచ్చు.
ఆర్థిక ప్రయోజనాలే కాకుండా ఇంధనాన్ని ఆదా చేయడం ద్వారా పర్యావరణ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో మీ వాహనం ముఖ్యంగా కార్లు మంచి ఇంధన సామర్థ్యాన్ని నిర్వహించడం కూడా చాలా కీలకం. వీటికి దోహదపడేలా మీ వాహనాల ఇంధన బిల్లులను తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే చాలు. అవేంటో చూద్దాం.

రెగ్యులర్‌గా కారు సర్వీస్ : మీ వాహనం మంచి మైలేజీని ఇవ్వడానికి క్రమం తప్పకుండా సరైన వ్యవధిలో మీ కారును సర్వీస్ చేయడం చాలా ముఖ్యం. కారు సర్వీసు చేయిస్తున్నప్పుడు మూడు అంశాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఆయిల్, ఆయిల్ ఫిల్టర్, ఎయిప్ ఫిల్టర్. ఈ మూడింటిని భర్తీ చేయించాలి. అందుకోసం మంచి మెకానిక్‌ను ఎంచుకోవడం కూడా ముఖ్యం.
ప్లానింగ్ ముఖ్యం : ఈ ఆధునిక యుగంలో కొత్త ప్రాంతాలకు వెళ్లేవారు ఎక్కువగా జీపీఎస్, మ్యాప్‌లపై ఆధారపడుతున్నారు. మ్యాప్ లేకుండా కొత్త ప్రాంతాలకు వెళ్లడం టైమ్ వేస్ట్‌తో పాటు ఇంధన దుర్వినియోగంతో కూడుకున్నది. ఇది చాలా కీలకం. ఇది ట్రాఫిక్ రహితమే కూడా గమ్యస్థానానికి త్వరగా చేరుకునేందుకు దోహదపడుతుంది. తద్వారా ఇంధనాన్ని ఆదా చేయడమే కాదు.. ఇంధన ఖర్చులను కూడా తగ్గిస్తుంది.

ఈ సమయంలో ఇంధనం నింపితే బెటర్ : ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చమురుకు విస్తరించే గుణం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని చాలా మంది వాహనదారులు గమనించరు. పగటి సమంయలో సాధారణంగా మధ్యాహ్నం సమయంలో వాహనదారులు తమ వాహనాల్లో ఇంధనం నింపుతుంటారు. ఈ కారణంగా తక్కువ శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇంధనం వేగంగా ఖాళీ అవుతుంది. కావున ఉదయం లేదా రాత్రి సమయాల్లో ఇంధనం నింపడం బెటర్.
టైర్ ప్రెజర్‌ను తనిఖీ చేయాలి : డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రైర్ ప్రెజర్ తక్కువగా ఉంటే డ్రాగ్‌ను సృష్టిస్తుంది. ఈ కారణంగా మైలేజీ తక్కువగా ఇస్తుంది. అందుకే కొన్ని వారాలకోసారి టైర్ ఒత్తిడిని తనిఖీ చేయడం ముఖ్యం. సిటీ పరిమితుల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ట్రైర్ ప్రెజర్ 32 psi నుంచి 35 psi ఉండేలా చూసుకోవాలి. దీని ద్వారా ఇంధన పొదుపు చేసుకోవచ్చు.

అనవసర బరువులు పెట్టొద్దు : వాహనదారులు సాధారణంగా తమ వాహనం నుంచి అనవసర వస్తువులను తొలగించడంలో నిర్లక్ష్యం వహిస్తారు. ఈ కారణంగా వాహన యంత్రంపై బరువు పెరుగుతుంది. ప్రతి అదనపు కిలో బరువు కారణంగా ఇంధన వాడకం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ ఇంధన బిల్లులను తగ్గించుకోవడానికి కారును వీలైనంత లేలికగా ఉంచడం ముఖ్యం.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








