టైర్ కొనేముందు ఈ అక్షరాలు చూడాలి.. L, M, N, P, Q, R, H, V, Z అర్థమేమిటి?

సాధారణంగా మనం కొత్త కారు లేదా బైక్ కొనేటప్పుడు ఇంజిన్, మైలేజ్, డిజైన్, ఫీచర్ల మీద మాత్రమే దృష్టి పెడతాం. కానీ, చాలా మంది పట్టించుకోని ఒక ముఖ్యమైన విషయం ఉంది. అదే టైర్. టైర్ కేవలం బండిని రోడ్డు మీద నిలబెట్టడానికి మాత్రమే కాదు.. మీ కారు సేఫ్టీ, పర్ఫామెన్స్ రెండింటికీ ఇవే బాధ్యత వహిస్తాయి.

టైర్ సైడ్‌వాల్‌పై రాసి ఉండే L, M, N, P, Q, R, H, V, Z వంటి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్, ఆ టైర్ స్పీడ్ రేటింగును తెలియజేస్తాయి. అంటే, ఆ టైరు గరిష్టంగా ఎంత వేగంతో సురక్షితంగా నడవగలదో ఈ అక్షరాలు నిర్ణయిస్తాయి.

Tire Speed Rating Decides Your Car s Top Safe Speed Why Q or R is Important

స్పీడ్ రేటింగ్ అంటే ఏమిటి?
స్పీడ్ రేటింగ్ అనేది ఒక టైర్ కెపాసిటీని సూచిస్తుంది. ఆ టైర్ గరిష్టంగా ఎంత వేగంతో నడిచినా సురక్షితంగా ఉంటుందో ఇది తెలియజేస్తుంది. ఈ రేటింగ్‌ను టెస్టింగ్ తర్వాత నిర్ణయిస్తారు. ప్రతి టైర్ మీద ఇంగ్లీష్ అక్షరం రూపంలో ఉంటుంది.

ఉదాహరణకు, ఒక టైర్‌పై Q అని రాసి ఉంటే, ఆ టైర్ గంటకు 160 కి.మీ వేగాన్ని తట్టుకోగలదు. అదే R అని రాసి ఉంటే, ఆ టైర్ గంటకు 170 కి.మీ వేగాన్ని సురక్షితంగా తట్టుకునే కెపాసిటీ కలిగి ఉంటుంది. L రేటింగ్ ఉన్న టైర్ గంటకు 120 కి.మీ మాత్రమే సురక్షితం.

Tire Speed Rating Decides Your Car s Top Safe Speed Why Q or R is Important

సరైన స్పీడ్ రేటింగ్ ఎంచుకోవడం ఎందుకు ముఖ్యం?
సరైన స్పీడ్ రేటింగ్ ఉన్న టైర్‌ను ఎంచుకోవడం వాహనదారుల సేఫ్టీకి చాలా కీలకం. మీ కారు వేగం కంటే తక్కువ స్పీడ్ రేటింగ్ ఉన్న టైర్‌తో డ్రైవ్ చేస్తే, టైర్ హీటెక్కి పేలిపోయే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల ప్రమాదం జరిగే అవకాశం పెరుగుతుంది.

సరైన రేటింగ్ ఉన్న టైర్ హైవేపై డ్రైవింగ్ చేసేటప్పుడు కారు స్టెబిలిటీ, కంట్రోల్‎ను మెరుగుపరుస్తుంది. తన కెపాసిటీ మేరకు పనిచేసినప్పుడు, టైర్ మెరుగైన పర్ఫామెన్స్ అందిస్తూ, ఎక్కువ కాలం మన్నుతుంది.

Tire Speed Rating Decides Your Car s Top Safe Speed Why Q or R is Important

Q, R రేటింగ్ అర్థాలు
సాధారణంగా ఆఫ్‌రోడింగ్ వెహికల్స్, ఎస్యూవీలు, కొన్ని ట్రక్కులలో Q, R రేటింగ్‌లు కనిపిస్తాయి. Qసింబల్ ఉన్న టైర్ గంటకు 160కి.మీ వరకు సురక్షితం. ఈ వాహనాలకు ఎక్కువ వేగం కంటే, టార్క్, గ్రిప్ ముఖ్యం కాబట్టి ఈ రేటింగ్ సరిపోతుంది. R సింబల్ ఉన్న టైర్ గంటకు 170కి.మీ వరకు సురక్షితం. ఇవి సాధారణంగా పిక్అప్ ట్రక్కులు, ఎస్యూవీలు, కొన్ని హెవీ వెహికల్స్‌లో ఉపయోగిస్తారు.

మీరు ఒక వేళ స్పోర్ట్స్ కారు నడుపుతున్నట్లయితే, దానికి Q లేదా R రేటింగ్ సరిపోదు. అలాంటి వెహికల్స్‎కు V (గంటకు 240కిమీ) లేదా Z (గంటకు 240+ కిమీ) రేటింగ్ ఉన్న టైర్లను ఎంచుకోవాలి. ఇవి ఎక్కువ వేగాన్ని, వేడిని తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

Tire Speed Rating Decides Your Car s Top Safe Speed Why Q or R is Important

టైర్ కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
ఓనర్ మాన్యువల్ చూడండి: మీ కారు కంపెనీ ఏ టైర్ సైజు, స్పీడ్ రేటింగ్ను సిఫార్సు చేసిందో కారు ఓనర్ మాన్యువల్‌లో చూసి తెలుసుకోవాలి.
డ్రైవింగ్ స్టైల్: మీరు హైవేపై ఎక్కువ వేగంతో, ఎక్కువ దూరం ప్రయాణిస్తుంటే, R కంటే ఎక్కువ రేటింగ్ ఉన్న టైర్‌ను ఎంచుకోవాలి. పట్టణంలో తక్కువ దూరం ప్రయాణించే వారికీ ఇది పెద్ద సమస్య కాదు.

లోడ్ ఇండెక్స్: టైర్‌పై స్పీడ్ రేటింగ్ మాత్రమే కాదు, లోడ్ ఇండెక్స్ కూడా రాసి ఉంటుంది. ఇది టైర్ గరిష్టంగా ఎంత బరువును మోయగలదో తెలియజేస్తుంది.
క్వాలిటీ : ఎల్లప్పుడూ మంచి బ్రాండ్‌ను ఎంచుకోవాలి, ఎందుకంటే లోకల్ టైర్‌లపై రాసిన రేటింగ్‌లు సరైన టెస్టింగ్‌తో సరిపోలకపోవచ్చు.

నిర్లక్ష్యం చేస్తే తప్పదు భారీ మూల్యం
టైర్ స్పీడ్ రేటింగ్‌ను నిర్లక్ష్యం చేయడం మీ సేఫ్టీకి చాలా ప్రమాదకరం. చాలా మంది ప్రమాదాలకు సరైన టైర్ వాడకపోవడం కూడా ఒక కారణం. తక్కువ రేటింగ్ ఉన్న టైర్‌ను వాడడం ద్వారా మీరు కొంత డబ్బు ఆదా చేసుకోవచ్చు. కానీ హైవే మీద అది మీ కుటుంబాన్ని, మీ ప్రాణాన్ని ప్రమాదంలో పడేస్తుంది.

కాబట్టి, కొత్త టైర్ కొనేటప్పుడు, దానిపై రాసిన Q, R లేదా H వంటి అక్షరాలను తప్పకుండా గమనించాలి. సరైన టైర్ ఆప్షన్ మీ డ్రైవింగ్ అనుభవాన్ని పెంచుతుంది. సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, October 6, 2025, 11:45 [IST]
English summary
Tire speed rating decides your cars top safe speed why q or r is important
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+