టైటానిక్ షిప్ మునిగే ముందు డిన్నర్ మెనూ ఇదే.. వేలంలో ఎంత ధర పలికిందో తెలుసా.!!
టైటానిక్ షిప్(Titanic Ship).. ఈ పేరు వింటే చాలు.. ఇప్పటికీ దాని గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. 111 ఏళ్లు గడిచినా టైటానిక్ అనే పేరు మాత్రం ఇప్పటికీ ఏదో విధమైన సందర్భంలో వింటూనే ఉంటాం. అయితే ఇప్పుడు కూడా ఈ ఓడకు సంబంధించిన ఓ వార్త చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే..
సముద్రంలో మునిగిపోయిన టైటానిక్‌కు సంబంధించిన శిథిలాలు.. ప్రతి ఒక్కరిలో ఓ కలవరానికి గురిచేస్తుంటాయి. ఎందుకంటే అది సృష్టించిన విషాదం అలాంటిది. 111 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనను.. హాలీవుడ్ డెరెక్టర్ జేమ్స్ కామెరాన్ కళ్లకు కట్టినట్లుగా సినిమా తీసి మన ముందుకు తీసుకువచ్చారు. ఓ రకంగా జనాలు ఈ సంఘటనను మరిచిపోవడానికి ఈ సినిమా కూడా ఓ కారణమనే చెప్పొచ్చు.

తాజాగా టైటానిక్ షిప్ గురించిన ఓ వార్త ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ ఓడలోని డిన్నర్ మెనూ బయటపడగా.. దానికి వేలం నిర్వహించారు. అయితే ఎవరూ ఊహించనంతగా భారీ ధరకు ఈ మెనూ అమ్ముడుపోయింది. టైటానిక్ షిప్ మునిగిపోవడానికి 3 రోజుల ముందు చివరి డిన్నర్‌కు సంబంధించిన మెనూ ఇది.
ఈ మెనూలో ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు వడ్డించిన రకరకాల వంటల జాబితా ఉంది. ఆ డిన్నర్ మెనూ వేలంలో రికార్డ్ స్థాయిలో ధర పలకడం ప్రస్తుతం వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చివరి డిన్నర్ మెనూను ఇంగ్లండ్‌లో హెన్నీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ ఆఫ్ విల్ట్‌షైర్ శనివారం(నవంబర్ 11న) వేలం వేసింది.

దీంతో పాటు టైటానిక్ షిప్‌లోని టార్టాన్ డెక్ బ్లాంకెట్‌తో సహా ఇతర వస్తువులకూ వేలం నిర్వహించారు.
ఈ వేలంలో టైటానిక్ ఫస్ట్ క్లాస్ డిన్నర్ మెనూ 83 వేల పౌండ్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 84.50 లక్షలు పలికింది. ఈ కథనాన్ని బ్రిటన్‌కు చెందిన వార్తా పత్రిక గార్డియన్ తన కథనంలో ప్రచురించగా.. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది. కేవలం డిన్నర్ మెనూ ఇన్ని లక్షల ధర పలకడమేంటని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
ఐర్లాండ్‌లోని క్వీన్స్ టౌన్ నుంచి న్యూయార్క్‌కు 1912 ఏప్రిల్‌లో ఈ టైటానిక్ షిప్ ప్రారంభం కాగా..ఈ ఓడలోని ప్రయాణీకులకు అందించిన భోజన వివరాలు ఇందులో ఉన్నాయి. ఆ మెనూలో ఆప్రికాట్స్, ఫ్రెంచ్ ఐస్ క్రీమ్, ఎగ్స్, జామ్, సాల్మన్, బీఫ్, స్క్వాబ్, డక్, చికెన్, బ్రాందీ, ఆపిల్స్, చెర్రీస్, ఆయస్టర్స్, వీటితో పాటు దుంపలు, రైస్ వంటివి ఉన్నట్లుగా ఆ మెనూను చూస్తే తెలుస్తోంది.
కాగా ఈ డిన్నర్ మెనూ.. నీటిలో తడిసిన ఆనవాళ్లు కూడా స్పష్టంగా చూడవచ్చు. అయినప్పటికీ మెనూలోని అక్షరాలు కొన్ని చెక్కుచెదరకుండా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ మెనూను ఏప్రిల్ 11న షిప్‌లోని ప్రయాణికులకు వడ్డించేందుకు ప్రిపేర్ చేసినట్లుగా మెనూపై డేట్ ద్వారా అర్థమవుతోంది.
1912 ఏప్రిల్ 14 న రాత్రి సమయంలో సముద్రంలో ప్రయాణిస్తున్న టైటానిక్ షిప్ భారీ మంచుకొండను ఢీకొట్టి మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 1500 మంది నీటిలో మునిగిపోయి మరణించడం కలకలం సృష్టించింది. అయితే ఇప్పటికీ సముద్ర గర్భంలోని టైటానిక్ శిథిలాలను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు కూడా.
ఇటీవల టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ పేలిపోగా.. అందులో వెళ్లిన ఆరుగురు దుర్మరణం చెందడం.. ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. వీరంతా కోటీశ్వరులే.. టైటానిక్ షిప్‌లో గదులను చాలా విలాసవంతంగా నిర్మించారు. వివిధ దేశాల వాళ్లు కూడా ఇందులో ప్రయాణించేవారు. అందుకే వారి అభిరుచికు అనుగుణంగా మెనూ తయారుచేసేవారు.


Click it and Unblock the Notifications








