కొత్త కారును కొనేముందు ఈ ఫీచర్ల పేర్లు విని మోసపోకండి.. సేల్స్‌మెన్ వలలో పడకండి..!

భారత కార్ మార్కెట్లో తయారీదారులు కొత్త మోడళ్లను మరియు సరికొత్త టెక్నాలజీలను అందుబాటులోకి తీసుకురావడంతో పోటీ వాతావరణం తీవ్రమైంది. అభివృద్ధి చెందిన టెక్నాలజీ మరియు అధిక వినియోగం కారణంగా ఒకప్పుడు ప్రీమియం కార్లలో మాత్రమే లభించే ఖరీదైన ఫీచర్లు ఇప్పుడు సాధారణ మిడ్-రేంజ్ కార్లలో కూడా లభిస్తున్నాయి.

Recommended Video

Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT

పిండి కొద్ది రొట్టె అన్న చందంగా, ఈ కాస్ట్లీ ఫీచర్లను పొందండం కోసం కస్టమర్లు కూడా కాస్ట్లీ గానే ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే, ఇలాంటి ఫీచర్లలో చాలా వరకూ డ్రైవర్ సౌకర్యాన్ని పెంచేవిగా మాత్రమే ఉంటాయి, కానీ ఇవి తప్పనిసరి అయితే కాదు.

కొత్త కారును కొనేముందు ఈ ఫీచర్ల పేర్లు విని మోసపోకండి.. సేల్స్‌మెన్ వలలో పడకండి..!

కొత్త కారును కొనుగోలు చేయడానికి షోరూమ్ లకు సందర్శించే కస్టమర్లను అక్కడి సేల్స్ ఉద్యోగులు చాలా ఈజీగా బురిడి కొట్టించేస్తుంటారు. మీరు ఒక మోడల్ కొందామని వెళితే, దాని కన్నా ఖరీదైన మోడల్‌ని మిమ్మల్ని కొనేలా ప్రేరేపిస్తుంటారు. అలాగే, మిమ్మల్ని ఎల్లప్పుడూ టాప్-ఎండ్ వేరియంట్‌ను ఎంచుకోమని, అందులో ఫుల్లీ లోడెడ్ ఫీచర్లు లభిస్తాయని చెబుతుంటారు. ఇది నిజమే అయినప్పటికీ, కారులో అన్ని ఫీచర్లు మీకు అవసరం ఉండదు. వీటిని ఎంచుకోవడం వలన మీ బడ్జెట్ కూడా అనుకున్న దాని కన్నా రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.

కొత్త కారును కొనేముందు ఈ ఫీచర్ల పేర్లు విని మోసపోకండి.. సేల్స్‌మెన్ వలలో పడకండి..!

నిజానికి, ఇలాంటి ప్రీమియం ఫీచర్లు డ్రైవింగ్‌లో మీ రోజూవారీ జీవితాన్ని సులభతరం చేయగలవు, కానీ కొత్త కారుని ఎంచుకోవడంలో ఈ ఫీచర్లు ముఖ్యమైనవి కావని మీరు గుర్తించాలి. బడ్జెట్ ధరలో కారును కొనుగోలు చేసి, మీ జేబుకి చిల్లు పడకుండా ఉండేలా చూసుకోవాలంటే మీరు కార్లలో ఈ క్రింద పేర్కొన్న ఫీచర్లను విస్మరించవచ్చు. అవేంటో చూద్దాం రండి.

కొత్త కారును కొనేముందు ఈ ఫీచర్ల పేర్లు విని మోసపోకండి.. సేల్స్‌మెన్ వలలో పడకండి..!

1. కీలెస్ పుష్-బటన్ స్టార్ట్/స్టాప్

పేరు సూచించినట్లుగానే కారు స్టార్ట్ చేయడానికి ఇగ్నిషన్‌లో కీ ఉంచకుండా, కేవలం ఒక్క బటన్ సాయంతో కారును ఆన్ లేదా ఆఫ్ చేయడానికి ఉపయోగించే ఫీచర్ ఇది. ఈ స్మార్ట్ ఫీచర్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మరియు డ్రైవర్‌కు మంచి కంఫర్ట్‌ను అందిస్తుంది. అయితే, ఈ సాంకేతికతలో ఏదైనా సమస్య ఎదురైతే, సాధారణ మ్యాన్యువల్ కీని రీప్లేస్ చేసినంత సులువుగా దీనిని రీప్లేస్ లేదా రిపేర్ చేయడం సాధ్యం కాదు. ఇది కాస్తంత ఖర్చుతో కూడుకున్నది. రిమోట్ కీలతో మంచి బెనిఫిట్స్ ఉన్నప్పటికీ, మ్యాన్యువల్ కీలపై ఉన్న భరోసా ఈ ఆధునిక రిమోట్ కీలపై ఉండదు. ఉదాహరణ తడిసిన మ్యాన్యువల్ కీతో కారు డోరుని అన్‌లాక్ చేయవచ్చు, కానీ అదే తడిసిన రిమోట్ కీతో కారుని ఓపెన్ చేయడం కాస్తంత క్లిష్టమైన పనే.

కొత్త కారును కొనేముందు ఈ ఫీచర్ల పేర్లు విని మోసపోకండి.. సేల్స్‌మెన్ వలలో పడకండి..!

2. ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు

సాధారణ కార్లలో మనం డ్రైవింగ్ చేసే వెదర్ కండిషన్స్ మరియు సమయాన్ని బట్టి హెడ్‌ల్యాంప్ లను ఆన్ చేయడం లేదా ఆఫ్ చేయడం చేస్తుంటాం. ఇందుకు సాధారణంగా స్టీరింగ్ వెనుక ఉన్న లైట్ కంట్రోల్స్‌ను ఉపయోగిస్తాయి. అయితే, ఆధునిక కార్లలో ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ అనే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇది విండ్‌షీల్డ్ పై అమర్చిన సెన్సార్ల సాయంతో పనిచేస్తుంది. విండ్‌షీల్డ్ పై పడే సూర్యకాంతిని బట్టి ఆటోమేటిక్‌గా లైట్లు ఆన్ కావడం లేదా ఆఫ్ కావడం జరుగుతుంది. ఈ ఫీచర్‌ను ఒక్కసారి ఎంగేజ్ చేస్తే, మనం డ్రైవ్ చేసేటప్పుడు బయటి కాంతిని బట్టి ఇవి ఆటోమేటిక్‌గా ఆపరేట్ అవుతుంటాయి. వినడానికి బాగానే మరియు వాడటానికి సౌకర్యంగానే ఉన్నప్పటికీ, ఈ ఫీచర్ పొందాలంటే మీరు కూడా ఆటోమేటిక్‌గా కొంత ఎక్కువ డబ్బును ఖర్చు చేయాలని గుర్తుంచుకోండి.

కొత్త కారును కొనేముందు ఈ ఫీచర్ల పేర్లు విని మోసపోకండి.. సేల్స్‌మెన్ వలలో పడకండి..!

3. సన్‌రూఫ్

సన్‌రూఫ్.. కార్లలో ఇదొక అనవరసమైన ఫీచర్. ఒకవేళ మీరు ఉపయోగిస్తున్న కారులో సన్‌రూఫ్ ఉన్నట్లయితే, మీరు దానిని ఎన్ని సందర్భాల్లో ఓపెన్ చేసి డ్రైవ్ చేశారో చేతివేళ్ల మీద లెక్కించవచ్చు. ఇదొక విలాసవంతమైన ఫీచర్, కానీ మన డ్రైవింగ్ పరిస్థితులకు అంత అవసరమైనది కాదు. సరదాగా విహారయాత్రకు వెళ్లినప్పుడు లేదా బయటి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కారు పైభాగంలో ఉండే రూఫ్‌ని కొద్దిగా ఓపెన్ చేసి డ్రైవ్ చేయడానికి మాత్రమే ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. కానీ, ఇలా జరగడం చాలా అరుదు, కాబట్టి కార్లలో సన్‌రూఫ్ ఫీచర్ కోసం మీ జేబుకి చిల్లు చేసుకోవడం అనవసరం.

కొత్త కారును కొనేముందు ఈ ఫీచర్ల పేర్లు విని మోసపోకండి.. సేల్స్‌మెన్ వలలో పడకండి..!

4. బేజ్ కలర్ ఇంటీరియర్

కారులో చాలా మంది ప్రీమియం లుక్ కోసం బేజ్ కలర్ ఇంటీరియర్స్‌కి ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే, మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, కారు లోపల ఇంటీరియర్స్ ఎంత లైట్ కలర్ లో ఉంటే, వాటి మెయింటినెన్స్ అంత హెవీగా ఉంటుంది. నిత్యం దుమ్ము, ధూళితో కూడిన రోడ్లపై ప్రయాణించే వారు, ఇలాంటి బేజ్ కలర్ ఇంటీరియర్స్‌ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం కష్టం. ఒకవేళ, మీరు ఉపయోగిస్తున్న కార్లలో ఇప్పటికే బేజ్ కలర్ ఇంటీరియర్స్ స్టాండర్డ్ ఫీచర్ గా ఉన్నట్లయితే, వాటిపై ముదురు రంగులో ఉండే సీట్ కవర్లను ఉపయోగించడం మంచిది.

కొత్త కారును కొనేముందు ఈ ఫీచర్ల పేర్లు విని మోసపోకండి.. సేల్స్‌మెన్ వలలో పడకండి..!

5. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్

ఇప్పుడు ఆల్టో వంటి చిన్న కార్లలో కూడా టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ లభిస్తోంది. కారులో ఇది చాలా ఫ్యాన్సీగా కనిపిస్తూ, మీ కారుకి మంచి రిచ్ లుక్ తెచ్చిపెట్టినప్పటికీ, దీనిని వాడటంలో మీరు పరధ్యానానికి గురయ్యే అవకాశం ఉంది. ఒకప్పటి కార్లలో రేడియో మరియు క్యాసెట్ ప్లేయర్ మినహా ఇలాంటి అధునాతన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్ ఉండేవి కావు. అయితే, నేటి ఆధునిక కార్లలో దాదాపుగా అన్ని ఫీచర్లు ఈ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ద్వారానే కంట్రోల్ చేయబడుతున్నాయి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడూ తరచూ ఈ స్క్రీన్‌ని మీ చేతివేళ్లతో ఆపరేట్ చేయడం వలన మీ దృష్టి రోడ్డుపై నుండి మరలి, ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి, కారులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ అనేది లగ్జరీ ఫీచర్ మాత్రమే అని గుర్తించండి, తప్పనిసరి మాత్రం కాదు.

కొత్త కారును కొనేముందు ఈ ఫీచర్ల పేర్లు విని మోసపోకండి.. సేల్స్‌మెన్ వలలో పడకండి..!

6. ప్రాక్సిమిటీ సెన్సార్

దీనినే పార్కింగ్ సెన్సార్ అని కూడా పిలుస్తారు. ఇవి సాధారణంగా కారు బంపర్లలో అమర్చబడి ఉంటాయి. మీరు ఇరుకైన ప్రదేశాలలో కారును పార్క్ చేస్తున్నప్పుడు, కారుకి అడ్డుగా ఏదైనా వస్తువు లేదా ఆటంకం ఉన్నట్లయితే, ఈ సెన్సార్లు గుర్తించి డ్రైవరును అప్రమత్తం చేస్తాయి. నిజానికి, ఈ ప్రత్యేక ఫీచర్ మీ కారును డ్యామేజ్ కాకుండా రక్షిస్తుంది. అయితే, ఇది మీ జేబుపై అనదపు భారంగా ఉంటుంది. మీకు తగినంత పార్కింగ్ స్థలం ఉండి, కారును రివర్స్ చేయడంలో మీరు ప్రో అయినట్లయితే, ఈ ఫీచర్ మీకు అవసరం ఉండదనే చెప్పాలి.

కొత్త కారును కొనేముందు ఈ ఫీచర్ల పేర్లు విని మోసపోకండి.. సేల్స్‌మెన్ వలలో పడకండి..!

7. యాంబియెంట్ లైటింగ్

యాంబియంట్ లైటింగ్ మీకు కారు లోపల ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. దూర ప్రయాణాలు చేస్తున్న సమయంలో మీ మానసిక స్థితిని (మూడ్‌ని) మెరుగుపరుస్తుంది. కొన్నిసార్లు ఈ ఫీచర్ అనవసరమైన పరధ్యానానికి కూడా కారణం అవుతుంది. మీ బడ్జెట్ అనుమతిస్తే, కారులో ఈ ఫీచర్ ను ఎంచుకోవచ్చు. నిజానికి ఇది రోజువారీ ప్రయాణంలో ఉపయోగించబడే తప్పనిసరి ఫీచర్ అయితే కాదని గుర్తుంచుకోండి.

కొత్త కారును కొనేముందు ఈ ఫీచర్ల పేర్లు విని మోసపోకండి.. సేల్స్‌మెన్ వలలో పడకండి..!

8. ఫాక్స్ రూఫ్ రెయిల్స్

కారులో లగేజ్ సరిపోని పరిస్థితిలో రూఫ్ పై భాగంలో అదనపు లగేజ్‌ను తీసుకువెళ్లడం కోసం కార్లకు రూఫ్ రెయిల్స్ అమర్చబడి ఉంటాయి. చాలా వరకూ కార్లలో ఇవి ఫంక్షనల్ గా ఉంటాయి. అంటే, వీటిపై ఆఫ్టర్ మార్కెట్లో లభించే రూఫ్ క్యారియర్లను కొనుగోలుచేసి, మీ అదనపు లగేజ్‌ని తీసుకెళ్లవచ్చు. అయితే, కొన్ని కార్లలో రూఫ్ రెయిల్స్ ఉండకపోవచ్చు లేదా ఫంక్షనల్ రూఫ్ రెయిల్ స్థానంలో ఫాక్స్ రూఫ్ రెయిల్స్ (రూఫ్‌ని అంటుపెట్టుకుని ఉండేవి) ఉండొచ్చు. ఇలాంటి ఫాక్స్ రూఫ్ రెయిల్స్ వలన ఎలాంటి ఉపయోగం ఉండదు, ఇవి కేవలం స్టైలింగ్ ఎలిమెంట్‌గా మాత్రమే ఉంటాయి.

కొత్త కారును కొనేముందు ఈ ఫీచర్ల పేర్లు విని మోసపోకండి.. సేల్స్‌మెన్ వలలో పడకండి..!

9. వాయిస్ కమాండ్స్

వాయిస్ కమాండ్స్ అనేది ఇప్పుడు అనేక కార్లలో మనం చూస్తున్న ఓ స్మార్ట్ టెక్నాలజీ ఫీచర్. మీ కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లో ఉండే కొన్ని ఫీచర్లను కంట్రోల్ చేయడానికి మీరు మీ చేతివేళ్లను ఉపయోగించాల్సిన అవసరం లేకుండా, కేవలం మీ గొంతుతో కొన్ని వాయిస్ కమాండ్లను ఇవ్వడం ద్వారా వాటిని కంట్రోల్ / యాక్సెస్ చేయవచ్చు. ప్రయాణంలో ఇది మీ జీవితాన్ని సులభతరం మరియు సురక్షితం చేస్తుంది. అంతేకాకుండా, డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు పూర్తిగా రహదారిపై దృష్టి పెట్టడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అయితే, ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి నిర్దిష్ట ఉచ్చారణ అవసరం. మనం ఒక కమాండ్ ఇచ్చి, సిస్టమ్ మరొక కమాండ్ అర్థం చేసుకుంటే ఉపయోగం ఉండదు. కాబట్టి, ప్రతి ఒక్కరూ దీన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించలేరు. ఈ ఫీచర్ కోసం అదనపు ఖర్చు చేయాల్సి వస్తుంది.

కొత్త కారును కొనేముందు ఈ ఫీచర్ల పేర్లు విని మోసపోకండి.. సేల్స్‌మెన్ వలలో పడకండి..!

10. ఆటోమేటిక్ వైపర్స్

సాధారణంగా వర్షం వస్తున్నప్పుడు లేదా విండ్‌షీల్డ్ మురికిగా ఉన్నప్పుడు మాత్రమే మనం కారులో వైపర్స్ ఉపయోగిస్తుంటాం. అనేక సందర్భాల్లో మనం వీటిని మ్యాన్యువల్ గా కంట్రోల్ చేస్తాం. అయితే, ఆటోమేటిక్ వైపర్స్ కలిగిన కార్లలో విండ్‌షీల్డ్‌పై పడే వర్షపు నీటిని బట్టి, ఇవి ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంటాయి. అంతేకాదు, వర్షపు తీవ్రతను బట్టి వాటి వేగం కూడా ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతూ ఉంటుంది. వినడానికి ఫ్యాన్సీగానే ఉన్నప్పటికీ, ఈ ఫీచర్ అంత తప్పనిసరి అయినది మాత్రం కాదు.

కొత్త కారును కొనేముందు ఈ ఫీచర్ల పేర్లు విని మోసపోకండి.. సేల్స్‌మెన్ వలలో పడకండి..!

మీరు బడ్జెట్‌లో కారును కొనాలని చూస్తున్నట్లయితే, పైన తెలిపిన ఫీచర్లకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ, మీ బడ్జెట్‌లోనే ఈ ఫీచర్లన్నీ లభించినట్లయితే, నిస్సందేహంగా మీరు వీటిని ఎంచుకోవచ్చు. ఇవన్నీ ఆప్షనల్ ఫీచర్లు మాత్రమే, తప్పనిసరి ఫీచర్లు మాత్రం కాదని గుర్తుంచుకోండి.

Most Read Articles

English summary
To save more on your new car you can ignore these 10 features while buying
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X