టోల్ ఫీజు చెల్లించకుండా తప్పించుకుపోయిన ట్యాక్సీ డ్రైవర్.. హైవేపై ఛేజ్ చేసిన టోల్ బూత్ అధికారులు..
రోడ్లు, హైవేలను నిర్మించడానికి భారత ప్రభుత్వం కంపెనీలకు టెండర్లు జారీ చేస్తుంది. రోడ్ల నిర్మాణం పూర్తయిన అనంతరం ఈ కంపెనీలు రోడ్లపై టోల్ గేట్‌ను జోడించి రోడ్డు నిర్మాణం, నిర్వహణ ఖర్చులను వాహనదారుల నుంచి వసూలు చేస్తారు. కార్లు, నాలుగు చక్రాల వాహనాలకు వాటి బరువు ఆధారంగా టోల్ ఛార్జీలు వసూలు చేస్తారు.
ఈ నేపథ్యంలో కొందరు వాహనదారులు కొన్నిసార్లు టోల్ ఛార్జీలు చెల్లించకుండా తప్పించుకుపోతుంటారు. ఇటీవల ఓ ట్యాక్సీ డ్రైవర్ టోల్ కట్టకుండా వెళ్లిపోయిన ఘటన చోటుచేసుకుంది. అయితే ట్యాక్సీ డ్రైవర్‌ను టోల్ బూత్ అధికారులు వెంబడించిన వీడియో వైరల్‌గా మారింది. మారుతీ సుజుకి వ్యాగన్ R హ్యాచ్‌బ్యాక్ వాహనాన్ని హైవేపై టాటా సుమో కారులో టోల్ బూత్ అధికారులు వెంబడించారు.

ఈ వీడియోను రెడిట్‌లో ఓ వ్యక్తి షేర్ చేశారు. వీడియో పైన 'మీరు టోల్ ఫీజు చెల్లించనప్పుడు సిబ్బంది మిమ్మల్ని ఇలా ఫాలో చేస్తారు.' అని పేర్కొన్నారు. అయితే ఈ వీడియో చూస్తున్నంతసేపు టోల్ బూత్ సిబ్బంది మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ డ్రైవర్‌ను పట్టుకున్నారా అని ఊపిరి బిగపట్టుకుని చూడటం ఖాయం.
రద్దీగా ఉన్న రహదారిపై వ్యాగన్ ఆర్ డ్రైవర్, టాటా సుమోలో సిబ్బంది స్టంట్స్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే స్పష్టమైన సమాచారం లేదు. వీడియోలో ప్రగతి మైదాన్ అనే బోర్డు కనిపిస్తుంది. దాన్ని బట్టి ఈ సంఘటన ఢిల్లీ జరిగిందని తెలుస్తోంది.
అయితే వ్యాగన్ R డ్రైవర్‌ను పట్టుకోవడానికి టోల్ బూత్ సిబ్బంది తీవ్రంగా కృషి చేశారు.

ఎందుకంటే మారుతి సుజుకి వ్యాగన్ R డ్రైవర్.. టోల్ బూత్ సిబ్బందిని రోడ్డుపై ముప్పుతిప్పులు పెట్టాడు. వారిని తప్పుదోవ పట్టించడానికి కారును కుడి, ఎడమ వైపులకు మళ్లిస్తూ పోనిస్తున్నాడు. టోల్ బూత్ అధికారులు అతడిని ఆపడానికి ప్రయత్నించినా చాకచక్యంగా తప్పించుకు ముందుకు పోతున్నాడు.
ఈ క్రమంలో కొంచెం దూరం వెళ్లాక కారు ఆపాల్సిందిగా టాటా సుమోలోని అధికారులు అతడిని హెచ్చరించారు. అయినప్పటికీ అతను ఆగకుండా అలాగే ముందుకు పోతూ ఎడమ వైపు డైరెక్షన్ తీసుకున్నాడు. దీంతో అధికారులు కూడా తమ కారును ఎడమ లేన్ లో ప్రయాణిస్తూ కారును ఆపేందుకు ప్రయత్నించారు.

ఇంతకీ టోల్ బూత్ అధికారులు వ్యాగన్ R డ్రైవర్‌ను ఆపారా లేరా అనే సమాచారం లేదు. కానీ చాలా మటుకు, ఢిల్లీ నగరంలో ట్రాఫిక్ రద్దీ కారణంగా అధికారులు, డ్రైవర్ కారుని పట్టుకునే అవకాశం ఉంది. ఇక్కడ నిశితంగా పరిశీలిస్తే రెండు అంశాలను గమనించవచ్చు.
ఇక్కడ ఈ ఛేజింగ్ మనకి ఆసక్తికరంగా అనిపించినా.. ఏదేమైనా ఈ సంఘటనలో టోల్ బూత్ అధికారులు, వ్యాగన్ R డ్రైవర్ ఇద్దరి తప్పూ ఉంది. టోల్ ఫీజు చెల్లించకుండా తప్పించుకు పోవడం ట్యాక్సీ డ్రైవర్ తప్పయితే.. రోడ్డుపై ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ఇద్దరి తప్పు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








