Just In
- 18 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 1 day ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 1 day ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 1 day ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
మార్చి 8 నుంచి రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Movies
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భీష్మ డైరెక్టర్‌కి రేంజ్ రోవర్ గిఫ్ట్ గా ఇచ్చిన హీరో నితిన్, ఎందుకో తెలుసా !
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ముద్ర వేసుకుంటూ చాలా మంది అభిమానులను కలిగిన హీరోలలో ఒకరు నితిన్. చాలామంది హీరోలు కొన్ని సందర్భాలలో ఖరీదైన వాహనాలను గిఫ్ట్ గా ఇవ్వడం ఇది వరకే మనం చూసి ఉన్నాము. ఇటీవల కాలంలో హీరో ప్రభాస్ తన జిమ్ ట్రైనర్‌కు రేంజ్ రోవర్ వెలార్‌ను గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ క్రమంలోనే నీతి కూడా డైరెక్టర్ కి రేంజ్ రోవర్ కార్ గిఫ్ట్ గా ఇచ్చాడు. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

నితిన్ గత నాలుగేళ్లుగా సరైన సక్సెస్ లేక బాధపడుతున్న సమయంలోనే వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ అనే చిత్రం చేసాడు. నాలుగేళ్ళ తర్వాత భీష్మ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించాడు. సరిగ్గా కరోనా ముందు ఈ సినిమా విడుదల అయ్యింది.

కరోనా ప్రభావం వల్ల పెద్ద హిట్ అవ్వాల్సిన సినిమా కొంతవరకు కలెక్షన్లు తగ్గాయి. భీష్మ సూపర్ హిట్ కావడంతో నితిన్ రేంజ్ రోవర్ కారుని సినిమా డైరెక్టర్ వెంకీ కుడుములకు బహుమతిగా ఇచ్చాడు.
MOST READ:బొలెరో న్యూ వేరియంట్ లాంచ్ చేసిన మహీంద్రా : దీని ధర ఎంతో తెలుసా ?

భీష్మ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తనకు ఇచ్చినందుకు గాను డైరెక్టర్ వెంకీ కుడుములకు ఖరీదైన రేంజ్ రోవర్ కారుని బహుమతి ఇచ్చినప్పుడు, సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు వెంకీ కుడుముల. హీరో నితిన్ ఇచ్చిన కారుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నీతి కి కృతఙ్ఞతలు తెలియజేసాడు వెంకీ కుడుముల.

బుధవారం డైరెక్టర్ వెంకీ కుడుముల పుట్టినరోజు సందర్భంగా హీరో నితిన్ ఈ కారును గిఫ్ట్ గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. "బెస్ట్ పర్సన్‌తో బెస్ట్ ఫిలిం చేసినప్పుడు, మంచి విషయాలు జరుగుతాయి అని ట్వీట్‌తో పాటు నితిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన కారు ఫొటోను కూడా వెంకీ కుడుముల షేర్ చేశారు.
MOST READ:కొత్త కారు కొన్న సన్నీలియోన్ : ఈ కార్ రేటెంతో ఎంతో తెలుసా ?

ఆటో పరిశ్రమలో ఖరీదైన కార్ల విభాగంలో రేంజ్ రోవర్ కూడా ఒకటి. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటంతో పాటు వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది. రేంజ్ రోవర్ చాలా మంచి లగ్జరీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా మంచి సామర్త్యాన్ని కూడా కలిగి ఉంటుంది. చాలామంది సెలెబ్రెటీలు మరియు రాజకీయ నాయకులు ఈ రేంజ్ రోవర్ కార్లను కలిగి ఉన్నారు.